ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాబుల్ లోని కార్తే పార్ వన్ గురుద్వారా పై జరిగిన పిరికిపందతనం నిండిన ఉగ్రవాద దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 18 JUN 2022 10:12PM by PIB Hyderabad

అఫ్ గానిస్తాన్ లోని కాబుల్ లో గల కార్తే పార్ వన్ గురుద్వారా పై జరిగిన పిరికిపందతనం తో కూడినటువంటి ఉగ్రవాద దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు. భక్త జనం సురక్షితం గా, శ్రేయం గా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆ పరమాత్మ ను ప్రార్థించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కాబుల్ లో గల కార్తే పార్ వన్ గురుద్వారా పై పిరికితనం నిండినటువంటి ఉగ్రవాద దాడి ఘటన జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. ఈ క్రూరమైనటువంటి దాడి ని నేను ఖండిస్తున్నాను. భక్తజనం సురక్షితం గాను, క్షేమం గాను ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1835378) आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada