మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాల పాఠ్యాంశాల్లో యోగాను చేర్చాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు
ఈసీసీఈ నుండి 12వ తరగతి వరకు యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు
జాతీయ యోగా ఒలింపియాడ్ - 2022 మరియు క్విజ్ పోటీలను ప్రారంభించిన కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి
Posted On:
18 JUN 2022 2:02PM by PIB Hyderabad
కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా జాతీయ యోగా ఒలింపియాడ్ - 2022 మరియు క్విజ్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సుభాస్ సర్కార్ కూడా పాల్గొన్నారు.
జాతీయ యోగా ఒలింపియాడ్‌ను విద్యా మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంయుక్తంగా 18 నుండి 20 జూన్ 2022 వరకు నిర్వహిస్తోన్నాయి. ఈ సంవత్సరం 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ప్రాంతీయ విద్యా సంస్థల మల్టీపర్పస్ స్కూల్‌ల నుండి దాదాపు 600 మంది విద్యార్థులు త్వరలో జరగనున్న జాతీయ యోగా ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ..కోవిడ్ అనంతర కాలంలో బాధలను దూరం చేయడంలో మరియు స్థితిస్థాపకతను పెంపొందించడంలో యోగా మానవాళికి ఉపయోగపడిందని అన్నారు. ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రోత్సహించడానికి మరియు ప్రజలను మరింత దగ్గరికి తీసుకురావడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరానికి యోగా ఫర్ హ్యుమానిటీ అనే థీమ్‌ను సముచితంగా ఎంచుకున్నారని మంత్రి హైలైట్ చేశారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి యోగా అని జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించినప్పటి నుంచి యోగాకు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభించిందని ఆయన అన్నారు. మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం యోగా ప్రపంచాన్ని ఏకం చేస్తోందని ఆయన అన్నారు.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల భౌతిక మరియు మానసిక శ్రేయస్సుపై ఎన్‌ఈపీ 2020 ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ స్పోర్ట్స్ మాన్ స్పిరిట్‌ను పెంపొందిస్తుంది మరియు విద్యార్థులు ఫిట్‌నెస్‌ను జీవితకాల వైఖరిగా స్వీకరించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.
ఆరోగ్యం మరియు శారీరక విద్యలో యోగా అంతర్భాగమని శ్రీ ప్రధాన్ అన్నారు. మన పాఠ్యాంశాల్లో యోగాకు సంబంధించిన ప్రాచీన జ్ఞానాన్ని చేర్చాలని ఎన్‌సీఈఆర్‌టీకి సూచించారు. మేము ఎన్‌సీఎఫ్‌ని అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్న నేపథ్యంలో మనం తప్పనిసరిగా ఈసీసీఈ నుండి 12వ తరగతి వరకు యోగాకు ప్రాధాన్యతనివ్వాలి. అలాగే పాఠశాల, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో యోగా ఒలింపియాడ్‌లు నిర్వహించాలని ఎన్‌సీఈఆర్‌టీకి సూచించారు. ప్రతి బ్లాక్‌లోని పాఠశాల విద్యార్థులను చేర్చుకోవడం వల్ల యోగా వారసత్వాన్ని మరింతగా పెంచడంతోపాటు యోగాను జీవనశైలిగా మార్చుకోవడంలో కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు.
జాతీయ యోగా ఒలింపియాడ్‌లో తమ రాష్ట్రాలు/యూటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపికైన విద్యార్థులందరినీ మంత్రి అభినందించారు. బ్లాక్ స్థాయి నుంచే వారు పాల్గొన్నందుకు వారిని అభినందించారు.
పాల్గొన్నవారిని ఉద్దేశించి శ్రీ సర్కార్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అన్నారు. దేశాన్ని ఏకీకృత రూపంలో చూడాలనే ఆలోచనను పౌరులకు అందించే విద్యా విధానాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. యోగా ఒలింపియాడ్‌లో ఆసనం, ప్రాణాయామం, క్రియ, ధ్యానం తదితర అంశాలను విద్యార్థులు ప్రదర్శిస్తారని, తద్వారా యోగా ప్రాముఖ్యతను అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలుగుతారని తెలిపారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన యోగా విలువలను మరియు ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన జీవనశైలిని ఎలా వేగవంతం చేయగలదో కూడా ఆయన వివరించారు.
ఈ సంవత్సరం థీమ్ "మానవత్వం కోసం యోగా". నాణ్యమైన ఆరోగ్యాన్ని మరియు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడంలో యోగ ఆసనాలు అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయన్నది అంగీకరించబడిన వాస్తవం.
ఎన్‌సిఈఆర్‌టి2016లో నేషనల్ యోగా ఒలింపియాడ్‌ను ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయినప్పుడు, క్విజ్ పోటీని నిర్వహించడం ద్వారా యోగా స్ఫూర్తిని సజీవంగా ఉంచింది. ఆ కార్యక్రమంలో కెవిలు, ఎన్‌విల విద్యార్థులు మరియు ప్రాంతీయ విద్యా సంస్థల ప్రదర్శన మల్టీపర్పస్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా, జాతీయ యోగా ఒలింపియాడ్‌తో పాటు యోగాపై క్విజ్ పోటీలు నిర్వహించబడతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన యోగా విలువలను మరియు ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన జీవనశైలిని ఎలా వేగవంతం చేయగలదో కూడా ఆయన నొక్కి చెప్పారు.
ఏఐసీటీఈ వైస్ చైర్మన్ శ్రీ ఎం.పి పూనియా;ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రొ. దినేష్ ప్రసాద్ సక్లానీ; ఎన్‌సీఈఆర్‌టీ జాయింట్ డైరెక్టర్, ప్రొ. శ్రీధర్ శ్రీవాస్తవ; ఎన్‌సిఇఆర్‌టి సెక్రటరీ ప్రొ. ప్రత్యూష్ కుమార్ మండల్ మరియు విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
*****
(Release ID: 1835123)
Visitor Counter : 214