మంత్రిమండలి

శ్రీలంకలోని కొలంబోలో బిమ్స్‌ టెక్ టెక్నాలజీ ట్రాన్స్‌ ఫర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (MoA)ని ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 14 JUN 2022 4:08PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశం మార్చి 30, 2022 న శ్రీలంక లోని కొలంబోలో జరిగిన 5వ బిమ్ స్టెక్ సదస్సులో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ స్థాపన కోసం బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారానికి (BIMSTEC) సాంకేతిక బదిలీ సౌకర్యం (టిటిఎఫ్) కోసం బిమ్ స్టెక్ సభ్య దేశాలు సంతకాలు చేసిన   ఒక మెమోరాండం ఆఫ్ అసోసియేష న్ (ఎంఒఎ) కు ఆమోదం తెలిపింది.  .

 

బిమ్ స్టెక్ టిటిఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యాలు సాంకేతికతలను బదిలీ చేయడం, అనుభవాలను పంచుకోవడం మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా బిమ్ స్టెక్ సభ్య దేశాల మధ్య సాంకేతిక బదిలీలో సహకారాన్ని సమన్వయం చేయడం, సులభతరం చేయడం మరియు బలోపేతం చేయడం.

 

బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్, అగ్రికల్చరల్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ ఆటోమేషన్, కొత్త మరియు పునరుత్పాదక ఇంధనం వంటి ప్రాధాన్యతా రంగాలలో బిమ్స్‌ టెక్ సభ్య దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానాల బదిలీని టిటిఎఫ్ సులభతరం చేస్తుంది. టెక్నాలజీ ఆటోమేషన్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ, ఓషనోగ్రఫీ, న్యూక్లియర్ టెక్నాలజీ అప్లికేషన్స్, ఈ-వేస్ట్ మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, హెల్త్ టెక్నాలజీస్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మరియు క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్‌కి సంబంధించిన సాంకేతికతలు.

టిటిఎఫ్ కు ఓ పాలక మండలి ఉంటుంది మరియు టిటిఎఫ్ కార్యకలాపాల మొత్తం నియంత్రణ పాలక మండలిలో ఉంటుంది. పాలక మండలి ప్రతి సభ్య దేశం నుండి ఒక నామినీని కలిగి ఉంటుంది.

 

బిమ్ స్టెక్ టిటిఎఫ్ ఆశించిన ఫలితాలు:

  1. బిమ్ స్టెక్ దేశాలలో అందుబాటులో ఉన్న సాంకేతికతల డేటాబ్యాంక్,
  2. సాంకేతికత బదిలీ నిర్వహణ, ప్రమాణాలు, అక్రిడిటేషన్, మెట్రాలజీ, టెస్టింగ్ మరియు క్రమాంకనం సౌకర్యాల రంగాలలో మంచి అభ్యాసాలపై సమాచార నిల్వ
  3. సామర్థ్యం పెంపుదల, అనుభవాలను పంచుకోవడం మరియు అభివృద్ధిలో మంచి పద్ధతులు మరియు
  4. బిమ్ స్టెక్ దేశాల మధ్య సాంకేతికతలను బదిలీ చేయడం మరియు ఉపయోగించడం.

****



(Release ID: 1833911) Visitor Counter : 150