ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యువత అభివృద్ధి కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి వివరాలు పంచుకున్న - ప్రధానమంత్రి

Posted On: 12 JUN 2022 3:53PM by PIB Hyderabad

గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా యువత అభివృద్ధి కోసం తమ ప్ర‌భుత్వం చేసిన కృషి వివ‌రాల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్రమోదీ పంచుకున్నారు. ఈ వివరాలను తెలియజేసే కథనాలను ఆయన తమ వెబ్‌-సైట్ నమో యాప్, మై గోవ్ ద్వారా పంచుకున్నారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమాలలో వరుస ట్వీట్లు చేస్తూ -

భారత యువశక్తి మన గొప్ప బలం.  మన యువత వివిధ రంగాల్లో రాణిస్తూ దేశ ప్రగతికి దోహదపడుతున్నారు.  యువత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిన కొన్ని ప్రధాన ప్రయత్నాలను  వరుస కథనాలు టూకీగా వివరిస్తాయి. #8SaalYuvaShaktiKeNaam”

"యువత వారి కలలను సాధించడానికివారి సామర్థ్యాన్ని నెరవేర్చడానికిఎనిమిది సంవత్సరాల మన ప్రభుత్వం వీలు కల్పించింది వివరాలు #8SaalYuvaShaktiKeNaam లో ఒక సారి చూడండి.” 

దేశ యువశక్తి నవ భారతదేశానికి మూలస్తంభం.  దాన్ని పటిష్టం చేసేందుకు కొత్త విద్యా విధానం లేదా ..టి ఏర్పాటు..ఎం విస్తరణ తో పాటుకొత్త అంకురసంస్థలుయునికార్న్‌  నుండి ఖేలో ఇండియా కేంద్రం వరకుగత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. వీటన్నింటితో యువతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది." అని పేర్కొన్నారు.

******

DS

 

***


(Release ID: 1833381) Visitor Counter : 120