ప్రధాన మంత్రి కార్యాలయం

నవ్ సారీ లో ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో భాగం గా అనేక అభివృద్ధి పథకాల నుప్రారంభించిన ప్రధాన మంత్రి


3,050 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పథకాల కు ప్రారంభోత్సవం / శంకుస్థాపనచేసిన ప్రధాన మంత్రి

‘‘గుజరాత్ లో వేగవంతమైన మరియు సమ్మిళితమైన అభివృద్ధి యొక్క వైభవోపేతసంప్రదాయాన్ని డబల్ ఇంజన్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో ముందుకు తీసుకుపోతోంది’’

‘‘పేదల సంక్షేమాని కి మరియు పేదల కు కనీస సౌకర్యాల ను అందించేందుకు ప్రభుత్వంఅత్యంత శ్రద్ధ తీసుకొంటోంది’’

‘‘ప్రతి పేద వ్యక్తి, ఎంతటి సుదూర ప్రాంతం లో నివసిస్తున్న ఆదివాసీ లు అయినా సరే స్వచ్ఛమైన నీరును పొందడానికి హక్కు కలిగిన వారే’’

‘‘ప్రభుత్వం లో ఉండడం అంటే అది సేవ చేయడాని కి ఒక అవకాశం అని మేం భావిస్తాం’’

‘‘పాత తరం వారు ఎదుర్కొన్న సమస్యలు మన కొత్త తరం వారు ఎదుర్కోకూడదు అన్న దానికిమేం కట్టుబడి ఉన్నాం’’

Posted On: 10 JUN 2022 12:48PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ గౌరవ్ అభియాన్కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భం లో నవ్ సారీ లోని ఆదివాసీ ప్రాంతం అయినటువంటి ఖుద్ వేల్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాల కు ఆయన ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన లు చేశారు. వీటిలో 7 ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం, 12 ప్రాజెక్టుల కు శంకుస్థాపన తో పాటు 14 ప్రాజెక్టుల కు భూమి పూజ కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో జీవన సౌలభ్యాన్ని పెంపొందింప చేయడం, సంధానాని కి ఉత్తేజాన్ని ఇవ్వడం తో పాటు, నీటి సరఫరా ను మెరుగు పరచడం లో కూడా సహాయకారి గా ఉంటాయి. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఆదివాసీ జనాభా పెద్ద సంఖ్య లో సభాస్థలి కి తరలివచ్చినట్లు పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాల ను నిర్వహించడం అంటే అది ఆదివాసీ సోదరీమణుల మరియు సోదరుల నిరంతర ఆప్యాయత ను సూచిస్తోంది అని ఆయన సగర్వం గా చెప్పారు. ఆదివాసీల కు ఉన్న శక్తియుక్తుల కు మరియు వారి దృఢ సంకల్పానికి గుర్తింపు ను ఇస్తున్నటువంటి నవ్ సారీ గడ్డ కు ఆయన ప్రణామాన్ని ఆచరించారు.

గడచిన రెండు దశాబ్దాల లో చోటు చేసుకొన్నటువంటి శీఘ్ర మరియు సమ్మిళిత అభివృద్ధి, ఇంకా ఈ అభివృద్ధి నుంచి పుట్టిన ఒక కొత్త మహత్వాకాంక్ష గుజరాత్ కు గర్వకారణం గా ఉన్నాయి. ఈ వైభవోపేత సంప్రదాయాన్ని డబల్ ఇంజిన్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో ముందుకు తీసుకు పోతోంది. ఈ రోజు న చేపట్టిన ప్రాజెక్టు లు దక్షిణ గుజరాత్ లోని సూరత్, నవ్ సారీ, వల్ సాడ్ మరియు తాపీ జిల్లాల లో జీవన సౌలభ్యాన్ని తీసుకు వస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

ఎనిమిది సంవత్సరాల కిందట గుజరాత్ ప్రజలు తనను ఏ విధం గా దిల్లీ కి పంపించిందీ ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. గత ఎనిమిది ఏళ్ల లో, అనేక మంది ప్రజల ను మరియు ప్రాంతాల ను అభివృద్ధి ప్రక్రియ తోను, ఆకాంక్షల తోను ముడిపెట్టడం లో ప్రభుత్వం సఫలం అయింది అని ఆయన అన్నారు. పేద ప్రజలు, ఆదరణ కు దూరం గా ఉండిపోయిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు మరియు ఇతర బలహీన వర్గాలు వారి యావత్తు జీవనాన్ని కనీస అవసరాల ను తీర్చుకోవడం కోసం వెచ్చించిన కాలం అంటూ ఒకటి ఉండింది అని ఆయన గుర్తు కు తెచ్చారు. పూర్వం ప్రభుత్వాలు అభివృద్ధి ని వాటి ప్రాథమ్యం గా పెట్టుకోలేదు. ఆపన్న వర్గాల వారు మరియు ప్రాంతాలు సౌకర్యాల కు నోచుకోకుండా ఉండిపోయాయి. గత ఎనిమిది ఏళ్ళ లో సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్మంత్రాన్ని తన ప్రభుత్వం అనుసరిస్తూ, పేద ల సంక్షేమం కోసం, పేదల కు కనీస సదుపాయాల ను అందించడం కోసం అత్యంత శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం, ప్రభుత్వం సంక్షేమ పథకాల ను అందరికీ అందించడం ద్వారా పేద వ్యక్తి ప్రతి ఒక్కరి కీ సాధికారిత ను కల్పించే కార్యక్రమాన్ని అమలు పరుస్తోంది అని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి ప్రధాన వేదిక ను చేరుకోవడాని కంటే ముందు, ఆదివాసీ సముదాయాల కు చెందిన లబ్ధిదారుల తో మమేకం అయ్యారు. లబ్ధిదారుల తో, ప్రజల తో భేటీ కావడం అభివృద్ధి కి సరికొత్త గతి ని అందిస్తుంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి గుజరాతీ భాష లో మాట్లాడుతూ, స్థానికుల తో తనకు ఉన్నటువంటి సుదీర్ఘ అనుబంధం గురించి గుర్తు కు తెచ్చుకున్నారు. తాను ఆ ప్రాంతం లో పని చేస్తూ ఉండగా, ప్రజలు తనను ఆహ్వానించిన తీరు ను, తన పట్ల చూపిన అనురాగాన్ని ఆయన స్మరించుకొన్నారు. ‘‘మీ యొక్క ఆత్మీయత, మీ యొక్క దీవెన లు ఇవే నా బలం గా ఉన్నాయి’’ అని మంత్రి చెప్తూ, ఉద్వేగాని కి లోనయ్యారు. ఆదివాసీ సముదాయాల సంతానం సాధ్యమైన అన్ని అవకాశాల ను అందుకోవాలి అని ఆయన అన్నారు. వారి లో గల స్వచ్ఛత, వివేకం, సంఘటితం అయ్యే తీరు మరియు క్రమశిక్షణ వంటి గుణాల ను గురించి ఆయన ప్రస్తావించారు. సామూహిక జీవనం మరియు పర్యావరణాన్ని కాపాడుకోవడం వంటి ఆదివాసీల విలువ ను గురించి కూడా ఆయన తెలియ జేశారు. ఆదివాసీ ప్రాంతాల కు నీరు అందేటట్లు చూడటం కోసం తాను చేసిన కృషి ని గురించి ఆయన వివరించారు. గతం లో ఒక నీళ్ళ ట్యాంకు కు ప్రారంభోత్సవం వంటి చిన్న కార్యాని కి సైతం పతాక శీర్షిక ల స్థాయి లో ప్రచారం లభించడం తో పోల్చి చూస్తే మూడు వేల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ఈనాటి ప్రాజెక్టుల కు పూర్తి గా వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. నిరంతర సంక్షేమం మరియు అభివృద్ధి ప్రాజెక్టు లు అనేవి తన ప్రభుత్వ శైలి లో దీర్ఘకాలం పాటు భాగం గా ఉంటూ వచ్చాయి; మరి ఈ ప్రాజెక్టుల ఉద్దేశ్యమల్లా ప్రజల సంక్షేమం మరియు పేదల శ్రేయం. అంతేకాక, ఇవి ఏ ఎన్నికల దృష్టి తోనో చేసినవేమీ కాదు అని ఆయన అన్నారు. ప్రతి పేద వ్యక్తి, ఎంత సుదూర ప్రాంతం లో నివసిస్తున్న ఆదివాసీ అయినా సరే స్వచ్ఛమైన నీటిని అందుకోవడానికి హక్కు కలిగివున్న వారు. ఈ కారణం గానే అంత పెద్ద ప్రాజెక్టుల ను చేపట్టడం జరుగుతోంది. మంత్రి కి ఉన్న స్వీయ శైలి ఏమిటి అంటే అది ఆయన శంకుస్థాపన చేసిన పని ని ఆయనే ప్రారంభించడం అనేదే. ప్రాజెక్టుల ను సకాలం లో పూర్తి చేసేందుకు సంబంధించి పని సంస్కృతి లో చోటు చేసుకొన్న ఒక పెద్ద పరివర్తన ఇది. ‘‘మేం ప్రభుత్వం లో ఉండడాన్ని సేవ చేసేందుకు లభించిన ఒక అవకాశం అని తలుస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. పాత తరం ఎదుర్కొన్న సమస్యల ను మన కొత్త తరం వారు ఎదుర్కోకూడదు అనే విషయాని కి మేము కట్టుబడి ఉన్నాం. అందువల్లే ఈ పథకాలు స్వచ్ఛమైన నీరు, ప్రతి ఒక్కరి కి నాణ్యమైన విద్య ల వంటి కనీస సౌకర్యాలు అందేందుకు పూచీ పడుతున్నాయి అని ఆయన అన్నారు. ఈ ప్రాంతం లో ఒక్క సైన్స్ స్కూల్ అయినా లేనటువంటి కాలం అంటూ ఒకటి ఉండేది అని ఆయన గుర్తు కు తీసుకు వస్తూ, ఇప్పుడేమో వైద్య కళాశాల లు మరియు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయి అని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వ్యాపారం, సంధానం లకు సంబంధించిన పథకాలు మారుమూల ప్రాంతాల లో అమలవుతూ ఉండటం వల్ల జీవనాల లో మార్పు చోటు చేసుకొంటోంది అని మంత్రి అన్నారు. ప్రాకృతిక వ్యవసాయాన్ని అవలంబించినందుకు గాను దక్షిణ గుజరాత్ మరియు డాంగ్ జిల్లా ను ఆయన ప్రశంసించారు. వైద్యం మరియు ఇంజినీరింగ్ ల వంటి సాంకేతిక పాఠ్య క్రమాల కు కూడా మాతృ భాష లోనే విద్య బోధన జరగడం అనేది ఒబిసి, ఆదివాసీ బాలల కు అవకాశాల ను అందిస్తుంది అని ఆయన అన్నారు. వన్ బంధు యోజనలో కొత్త దశ ను అమలు చేస్తున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. మేం సంపూర్ణమైనటువంటి, అన్ని వర్గాల కు ఫలాలు అందేటటువంటి మరియు సమానత్వం ప్రాతిపదిక గా కలిగినటువంటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం అని చెప్తూ, మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

తాపీ, నవ్ సారీ మరియు సూరత్ జిల్లా ల నివాసుల కోసం ఉద్దేశించిన 961 కోట్ల విలువైన 13 నీటి సరఫరా పథకాల కు ప్రధాన మంత్రి భూమి పూజ చేశారు. సుమారు 542 కోట్ల రూపాయల వ్యయం తో నవ్ సారీ జిల్లా లో నిర్మాణం జరగవలసిన ఒక వైద్య కళాశాల కు ఆయన భూమి పూజ ను కూడా చేశారు. ఈ కళాశాల ఆ ప్రాంతం లో ప్రజల కు తక్కువ ఖర్చు లో, నాణ్యమైన వైద్య సంరక్షణ సేవల ను అందించడం లో తోడ్పడనుంది.

 

 

దాదాపు గా 586 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరిగినటువంటి ఎస్టోల్ ప్రాంతీయ నీటి సరఫరా ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇది నీటి సరఫరా సంబంధి ఇంజినీరింగ్ నైపుణ్యాల కు ఒక అత్యుత్తమ నిదర్శనం గా ఉంది. దీనితో పాటు, 163 కోట్ల రూపాయల విలువ కలిగిన నల్ సే జల్ప్రాజెక్టుల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు లు సూరత్, నవ్ సారీ, వల్ సాడ్ మరియు తాపీ జిల్లా ల నివాసుల కు సురక్షితమైనటువంటి మరియు తగినంత త్రాగునీటి ని సమకూర్చనున్నాయి.

 

 

తాపీ జిల్లా లో నివసించే వారి కోసం విద్యుత్తు ను అందించేటందుకు 85 కోట్ల రూపాయల పై చిలుకు వ్యయం తో నిర్మాణం పూర్తి అయిన వీర్ పుర్ వ్యారా సబ్ స్టేశన్ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. వల్ సాడ్ జిల్లాలోని వాపీ పట్టణం లో వ్యర్థ జలాల శుద్ధి కి మార్గాన్ని సులభం చేసేటటువంటి ఒక మురుగు శుద్ధి ప్లాంటు ను కూడా ప్రారంభించడం జరిగింది. 20 కోట్ల రూపాయల విలువైన ఈ ప్లాంటు కు 14 ఎమ్ఎల్ డి సామర్ధ్యం ఉంది. 21 కోట్ల రూపాయల పై చిలుకు వ్యయం తో నవ్ సారీ లో నిర్మాణం పూర్తి అయిన ప్రభుత్వ గృహాల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. అలాగే, పిప్ లాదేవీ-జునేర్- చిచ్ విహిర్- పీపలాదాహడ్ నుంచి నిర్మితమైన రహదారుల ను మరియు డాంగ్ లో ఒక్కొక్కటీ ఇంచుమించు 12 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరిగిన పాఠశాల భవనాల ను కూడా ఆయన ప్రారంభించారు.

 

 

సూరత్, నవ్ సారీ, వల్ సాడ్ మరియు తాపీ జిల్లా ల నివాసుల కు స్వచ్ఛమైన తాగునీటి ని అందుబాటులోకి తీసుకు రావడం కోసం 549 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించే 8 నీటి సరఫరా ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. నవ్ సారీ జిల్లా లో 33 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరగవలసి ఉన్న ఖేర్ గామ్ మరియు పీపల్ ఖేడ్ ను కలిపే విశాలమైన రహదారి కి కూడా శంకుస్థాపన చేయడమైంది. సుమారు 27 కోట్ల రూపాయల వ్యయం తో సుపా మీదుగా నవ్ సారీ మరియు బార్ డోలీ ల మధ్య మరొక నాలుగు దోవ ల రహదారి ని నిర్మించడం జరుగుతుంది. సుమారు 28 కోట్ల రూపాయల వ్యయం తో డాంగ్ లో జిల్లా పంచాయతీ భవనం నిర్మాణాని కి మరియు 10 కోట్ల రూపాయల వ్యయం తో చేపట్టేటటువంటి ఒక రోలర్ క్రాశ్ బేరియర్ ను అందుబాటులోకి తీసుకు రావడం తో పాటు దానిని ఫిక్స్ చేసే కార్ఖానా కు కూడా ప్రధాన మంత్రి శంకు స్థాపన లు చేశారు.

***

DS/AK

 



(Release ID: 1832978) Visitor Counter : 165