నౌకారవాణా మంత్రిత్వ శాఖ
రేవులు నౌకా నిర్మాణం, జలమార్గాల మంత్రిత్వ శాఖ (MoPSW)లో యువ నిపుణుల నియామకం కోసం సాగరమాల యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్
Posted On:
03 JUN 2022 11:25AM by PIB Hyderabad
ఓడరేవులు, నౌక నిర్మాణం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలలో ప్రతిభావంతులైన, ముందు చూపు క్రియాశీల ఆలోచనలు గల యువ నియమించడానికి ఓడరేవులు, నౌక నిర్మాణం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ పథకాన్ని రూపొందించింది.
ఈ పథకం యువ నిపుణులకు క్షేత్ర స్థాయిలో నైపుణ్యం అందించే అంశానికి ప్రాధాన్యత ఇస్తుంది. శిక్షణలో యువ నిపుణులకు ప్రభుత్వ పనితీరు తో పాటు సంబంధిత అభివృద్ధి విధానాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మంత్రిత్వ శాఖ అవసరాల మేరకు నిపుణులు మౌలిక సదుపాయాలు, సమాచార విశ్లేషణ, ప్రాజెక్ట్ యాజమాన్యం , అంకుర సంస్థలు, వినూత్నత, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ మార్పిడి, పర్యావరణం వంటి రంగాలలో అధిక-నాణ్యత సేవలు అందించాల్సి ఉంటుంది.
విధాన నిర్ణయం లో యువత యువత చురుకైన పాత్ర పోషించేలా చూసే అంశానికి ఈ పథకం ప్రాధాన్యత ఇస్తుంది.దీనివల్ల ఆత్మగౌరవం మరియు సాధికారత సామాజిక భావం పెంపొంది వ్యక్తిగత స్థాయిలో సామాజిక శ్రేయస్సుకు మరింత దోహదపడే విధంగా యువతను తీర్చిదిద్దుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పొందే యువ నిపుణులు వీటి పరిష్కారం కోసం దీర్ఘకాలం పరిష్కార మార్గాలను గుర్తించడానికి వీలవుతుంది. సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా సాగే కృషి దీర్ఘ కాలంలో అనేక . కీలక ప్రయోజనాలను అందిస్తుంది.
తొలుత ఈ పథకం కింద 25 మందికి పైగా యువ నిపుణులను నియమించడం జరుగుతుంది. అభ్యర్థులు బీఈ /బి టెక్ బి ప్లానింగ్ మరియు/లేదా ఎంబీఏ లేదా తత్సమాన డిగ్రీ విద్యార్హతలు కలిగి సంబంధిత సబ్జెక్ట్/ ఫీల్డ్‌లో మరియు కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. అకౌంటెన్సీ, ఫైనాన్స్, లీగల్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్/కామర్స్, డేటా అనలిటిక్స్‌లో నిపుణులు కూడా మంత్రిత్వ శాఖ అవసరాల మేరకు నియమించబడతారు. తొలుత వీరిని 2 సంవత్సరాల పాటు నియమిస్తారు. పనితీరు ఆధారంగా అదనపు 2 సంవత్సరాలకు పొడిగించబడుతుంది
దరఖాస్తులను ఆహ్వానిస్తూ జారీ అయ్యే ప్రకటన మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్ మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో పోస్ట్ చేయబడుతుంది.
రేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు మరియు జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ “ప్రభుత్వ కార్యక్రమాల్లో యువకులను నియమించడం వల్ల పరిపాలన పనితీరుపై వారికి అవగాహన , ఆసక్తి పెరుగుతుంది, క్రియాశీల పౌరసత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది యువతలో సముద్ర రంగం గురించి అవగాహన కూడా పెంచుతుంది" అని అన్నారు.
***
(Release ID: 1830851)