ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అర్హులందరికీ ఇంటింటికీ టీకాలు ఇచ్చేందుకు నేటి నుంచి రెండు నెలల పాటు ‘హర్ ఘర్ దస్తక్ 2.0’


రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు/కళాశాలలు, జైళ్లు, ఇటుక బట్టీల వద్ద పనిచేసే వారి టీకాల కోసం దృష్టి కేంద్రీకరించాలి

Posted On: 01 JUN 2022 1:16PM by PIB Hyderabad

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ టీకా కార్యక్రమం యొక్క వేగాన్ని మరియు కవరేజీని వేగవంతం చేయడానికి "హర్ ఘర్ దస్తక్ 2.0" కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఇది 'మిషన్ మోడ్'లో అమలు చేయబడుతోంది. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులందరికీ టీకాలు వేయడం ద్వారా పూర్తి కోవిడ్ టీకా కవరేజీ వైపు వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకోబడింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు మరియు ఎన్‌హెచ్ఎం ఎండీలతో గత వారం కోవిడ్ వ్యాక్సినేషన్ స్థితిని సమీక్షించిన సందర్భంగా ఇది అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేయబడింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0031RRJ.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00517WS.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007596T.jpg 

నవంబర్ 2021లో ప్రారంభించబడిన హర్‌ ఘర్‌ దస్తక్” కార్యక్రమ అనుభవం నుండి 'హర్‌ ఘర్‌ దస్తక్ 2.0జూన్ 12022 నుండి జూలై 312022 వరకు నిర్వహించబడుతుంది. ఇంటింటికీ ప్రచారాల ద్వారా మొదటిరెండవ మరియు ప్రికాషనరీ టీకాలను అందజేయడం 'హర్ ఘర్‌ దస్తక్ 2.0అభియాన్ లక్ష్యం. 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులకు సబ్ ఆప్టిమల్ కవరేజి ద్వారా ప్రికాషనరీ డోసులు అందించడం,  వృద్ధాశ్రమాలుపాఠశాలలు/కళాశాలలలో, పాఠశాల పిల్లలు (జనాభా 12-18 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం)జైళ్లుఇటుక బట్టీలలో పనిచేసే వారిపై దృష్టి కేంద్రీకరిస్తూ, 12-14 ఏళ్ల వయసు పిల్లల్లో టీకా కవరేజీ వేగవంతం చేయడంపై దృష్టి కేంద్రీకరించనున్నారు. రాష్ట్రాలు/యూటీలు అర్హులైన లబ్ధిదారులందరి డ్యూ-లిస్ట్‌ల ఆధారంగా సంబంధిత సూక్ష్మ ప్రణాళికలతో సమర్థవంతమైన పర్యవేక్షణను చేపట్టనున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రికాషనరీ డోసు నిర్వహణను క్రమం తప్పకుండా సమీక్షించాలని కూడా వారిని కోరారు.

 

భారత ప్రభుత్వ ప్రణాళికబద్ధమైన, పటిష్టమైన ప్రయత్నాలతో జాతీయ కోవిడ్ టీకా కార్యక్రమం అసమానమైన విజయాన్ని సాధించింది. ఇప్పటివరకుదేశవ్యాప్తంగా 193.57 కోట్ల టీకా డోసులు అందించబడ్డాయి. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో 96.3% మంది కనీసం ఒక డోస్‌ని పొందారు. 86.3% మంది రెండు డోస్‌ల కోవిడ్ టీకా పొందారు. 'హర్‌ ఘర్‌ దస్తక్అభియాన్ మిషన్, ఇంద్రధనుష్ యొక్క విజయవంతమైన వ్యూహంతో ప్రేరణ పొందింది3 నవంబర్ 2021 నుండి టీకా తప్పిన వారికి, 1వ 2వ డోస్ అర్హులైన లబ్దిదారులందరినీ ఇంటింటికి సందర్శించడం ద్వారా టీకా వేయడం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఇందులో ప్రజల సమీకరణఅవగాహన టీకా కార్యకలాపాలు ఉన్నాయి. వృద్ధులువికలాంగులు, టీకా తీసుకోవడంలో వెనుకబడిన జనాభాతో సహా చివరి మైలు లబ్దిదారులను చేరుకోవడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో దోహదపడింది.

 

****



(Release ID: 1830115) Visitor Counter : 210