ప్రధాన మంత్రి కార్యాలయం
సివిల్ సర్వీసెస్ (ప్రధాన) పరీక్ష, 2021 లో ఉత్తీర్ణులైన వారందరికీ అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAY 2022 2:43PM by PIB Hyderabad
సివిల్ సర్వీసెస్ (ప్రధాన) పరీక్ష, 2021 లో కృతకృత్యులైన వారు అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘సివిల్ సర్వీసెస్ (ప్రధాన) పరీక్ష, 2021 ను పరిష్కరించిన వారు అందరికి అభినందన లు. భారతదేశం అభివృద్ధి ప్రయాణం లో ఒక ముఖ్యమైన కాలం లో ఎప్పుడైతే మనం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్నామో, ఈ వేళ పాలన పరమైన వృత్తి జీవనాన్ని ఆరంభిస్తున్నటువంటి యువతీ యువకులు అందరికీ నా శుభాకాంక్ష లు.’’
‘‘సివిల్ సర్వీసెస్ పరీక్ష లో సఫలం కాలేక పోయిన వారి కి కలిగే నిరుత్సాహాన్ని నేను పూర్తి గా అర్థం చేసుకోగలను. అయితే, విశేష ప్రతిభ కలిగినటువంటి ఈ యువతీ యువకులు వారు అనుసరించే ఏ రంగం లో అయినా వారిదైన ముద్ర ను చూపుతారని మరి భారతదేశాన్ని గర్వపడేటట్లు చేస్తారనే సంగతి ని కూడా నేను ఎరుగుదును. వారికి ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1829485)
Read this release in:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia