ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఎబిడిఎం) కోసం ఆన్‌లైన్ పబ్లిక్ డ్యాష్‌బోర్డును ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఎ


రాష్ట్రం కేంద్రపాలిత పాలిత ప్రాంత స్థాయి వరకు మిషన్‌ పురోగతిపై సమాచారం అందించనున్న ఎబిడిఎం డ్యాష్‌బోర్డు

Posted On: 30 MAY 2022 1:33PM by PIB Hyderabad

ప్రధాన కార్యక్రమంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఎబిడిఎం) కోసం ఆన్‌లైన్ పబ్లిక్ డ్యాష్‌బోర్డును ఎన్‌హెచ్‌ఎ

 ప్రారంభించింది. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ డాష్‌బోర్డులో లభిస్తుంది.  ఎబిడిఎం   పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ లో మిషన్ కింద కీలకమైన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ( ఎబిహెచ్‌ఎ నంబర్లుఆరోగ్య నిపుణులు  ( హెచ్‌పిఆర్‌ మరియు ఆరోగ్య సంరక్షణ  (హెచ్‌ఎఫ్‌ఆర్‌) లాంటి అంశాలపై వివరణాత్మక సమాచారం లభిస్తుంది. 

 30 మే 2022 నాటికి ఆయుష్మాన్ భారత్ మిషన్ లో  22.1 కోట్ల ఎబిహెచ్‌ఎ ఖాతాలు (గతంలో ఆరోగ్య ఐడీ అని పిలువబడేది)ఉన్నాయని  డ్యాష్‌బోర్డు వెల్లడించింది.   మొత్తం 16.6 వేల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు  హెచ్‌పిఆర్‌  లో నమోదు చేసుకున్నారు, 69.4 వేలకు పైగా ఆరోగ్య సౌకర్యాలు  హెచ్‌ఎఫ్‌ఆర్‌  లో నమోదు చేయబడ్డాయి.  1.8 లక్షలకు పైగా వినియోగదారుల  ఆరోగ్య రికార్డులు  ఇప్పటికే అనుసంధానం అయ్యాయి.   మరియు ఇటీవల పునరుద్ధరించబడిన ఎబిహెచ్‌ఎ   యాప్ 5.1 లక్షల డౌన్‌లోడ్‌లను దాటింది.

సంబంధిత వర్గాలు  ఎబిడిఎం   పబ్లిక్ డాష్‌బోర్డ్‌ను సులభంగా ఎబిడిఎం   వెబ్‌సైట్ నుంచి  లేదా నేరుగా   https://dashboard.abdm.gov.in/abdm/  ద్వారా చూడవచ్చు.   డ్యాష్‌బోర్డ్   ఎబిహెచ్‌ఎ     ఖాతాదారుల  సంఖ్యనమోదు చేసుకున్న  డాక్టర్‌లునర్సులు మొదలైన ఆరోగ్య సంరక్షణ నిపుణుల సంఖ్య ఎబిడిఎం  తో అనుసంధానం అయిన   డిజిటల్ ఆరోగ్య  రికార్డ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఎబిడిఎం స్వీకరిస్తుంది.  డ్యాష్‌బోర్డ్‌లో రోజువారీగా నమోదు చేయబడిన ఆసుపత్రులులేబొరేటరీలు మొదలైన ఆరోగ్య సౌకర్యాల సంఖ్య సంబంధించి  వివరాలు కూడా ఉన్నాయి. అలాగే ఎబిహెచ్‌ఎ   భాగస్వామ్య వర్గాలకు సంబంధించిన  మరియు అనుసంధానం  చేయబడిన డిజిటల్ హెల్త్ రికార్డ్‌లు నిజ సమయంలో డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. నిర్దిష్ట ప్రాంతాలలో పథకం పురోగతిపై నవీకరణలను అందించే అనేక కీలక భాగాలుగా ఈ సమాచారం  మరింతగా విభజించబడింది.

పబ్లిక్ డ్యాష్‌బోర్డు కు సంబంధించిన వివరాలను జాతీయ ఆరోగ్య మిషన్ సీఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ వివరించారు. ' సులభంగా వివరాలు పొందడం , పారదర్శకత, సమ్మిళితత మరియు ఇంటర్-ఆపరేబిలిటీ సూత్రాలపై  డ్యాష్‌బోర్డు ను అభివృద్ధి చేయడం జరిగింది. సంబంధిత వర్గాలు పధకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తాజాగా పొందే విధంగా పబ్లిక్ డొమైన్‌లో పొందవచ్చు. , ఇది పధకం అమలుతో సంబంధం ఉన్నవారందరి సమాచారం   పారదర్శక పద్ధతిలో సమాచారాన్ని గోప్యత కల్పిస్తూ అందుబాటులోకి తెస్తుంది.  వివిధ భాగస్వాములకు చెందిన  ఎబిహెచ్‌ఎ ఖాతాల   సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, వర్గాలవారీగా అనుసంధానం చేయబడిన ఆరోగ్య రికార్డులకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరచడం జరిగింది. దీనితో పథకం సాధించిన పురోగతిపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది" అని డాక్టర్ శర్మ వివరించారు. 

జాతీయ, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత స్థాయిలో    ఎబిహెచ్‌ఎ ఖాతాల   సంఖ్య  పారదర్శక విధానంలో డ్యాష్‌బోర్డ్‌  అందిస్తుంది. లింగం మరియు వయస్సు ఆధారంగా ఖాతాలు  మరింత విభజించబడ్డాయి.  ఎబిహెచ్‌ఎ    నంబర్ జనరేషన్ సదుపాయం కో విన్,పీఎం జె ఆరోగ్య సేతుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ఇ-సుశ్రుత్ రైల్వే హాస్పిటల్ మొదలైన  అనేక ప్రసిద్ధ డిజిటల్ హెల్త్ అప్లికేషన్‌ల ద్వారా కూడా ఎబిహెచ్‌ఎ ఖాతా పొందే సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రతి భాగస్వామి పనితీరును మరియు ప్రతి భాగస్వామ్య యాప్ ద్వారా లింక్ చేయబడిన ఆరోగ్య రికార్డుల సంఖ్యను కూడా డ్యాష్‌బోర్డు ప్రదర్శిస్తుంది. 

 ఆరోగ్య సౌకర్యాల నమోదు కోసం   యాజమాన్యం (ప్రభుత్వ లేదా ప్రైవేటు)వైద్య వ్యవస్థ (ఆధునిక వైద్యం - అల్లోపతిఆయుర్వేదంసోవా-రిగ్పాఫిజియోథెరపీయునానిడెంటిస్ట్రీసిద్ధహోమియోపతి మొదలైనవి) ఆధారంగా ఇన్ఫోగ్రాఫిక్స్ ఫార్మాట్‌లో డాష్‌బోర్డ్ సమాచారాన్ని  ప్రదర్శిస్తుంది. అదేవిధంగా హెచ్‌పిఆర్‌ నమోదు కోసం   ఎబిడిఎం డాష్‌బోర్డ్   రాష్ట్రాల వారీ సౌకర్యాలు.  వారి ఉపాధి రకం - ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగంవైద్య వ్యవస్థ మరియు దరఖాస్తులు స్వీకరించబడిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతం వారీగా  సమాచారాన్ని డాష్‌బోర్డ్  చూపుతుంది.

  ఎబిడిఎం  పబ్లిక్ డాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉన్న వివరణాత్మక సమాచారంతో పాటుప్రధాన  ఎబిడిఎం   వెబ్‌సైట్ (https://abdm.gov.in/అన్ని సంఖ్యలతో సంక్షిప్త పద్ధతిలో ఒక విభాగాన్ని కలిగి ఉంది. అలాగే ఎబిడిఎం   శాండ్‌బాక్స్ పోర్టల్‌ (https://sandbox.abdm.gov.in/applications/Integratorsలో డ్యాష్‌బోర్డ్ విభాగం ఉందిఇది ఇప్పటికే  ఎబిడిఎం  మరియు ఎబిడిఎం   భాగస్వాములుతో అనుసంధానించబడిన మరియు నమోదు చేయబడిన ఇంటిగ్రేటర్‌లు/ హెల్త్ టెక్ సర్వీస్ ప్రొవైడర్లు/ యాప్‌ల వివరాలను అందిస్తుంది. 

***


(Release ID: 1829427) Visitor Counter : 222