ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధార్ వివ‌రాల‌ను పంచుకొనే విష‌య‌మై యుఐడీఏఐ స్పష్టత

Posted On: 29 MAY 2022 2:07PM by PIB Hyderabad

ఫోటోషాప్ చేసిన ఆధార్ కార్డును దుర్వినియోగం చేసేందుకు గాను కొంద‌రు ప్రయత్నించిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ నేపథ్యంలో యుఐడీఏఐ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయం, 27 మే 2022 నాటి పత్రికా ప్రకటనకు అనుగుణంగా తాజాగా మ‌రింత స్ప‌ష్ట‌త‌  సంబంధించి ప్ర‌క‌ట‌న‌ను  జారీ చేసిసింది. ఆధార్ ఫోటో కాపీని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున ప్రజలు తమ  కార్డును  ఏ సంస్థతోనూ పంచుకోవద్దని యుఐడీఏఐ ఈ ప్రకటనలో ప్రజలకు సూచించింది. ప్రత్యామ్నాయంగా ఆధార్ నంబర్‌లోని చివరి 4 అంకెలను మాత్రమే ప్రదర్శించే మాస్క్‌డ్ ఆధార్‌ను ఉపయోగించవచ్చ‌ని సూచించింది.  అయితే, ఈ పత్రికా ప్రకటనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా, తక్షణం అమల్లోకి వచ్చేలా అదే స్టాండ్‌ను ఉపసంహరించుకుంది. యుఐడీఏఐ జారీ చేసిన ఆధార్ కార్డుదారుల‌ వారి యుఐడీఏఐ ఆధార్ నంబర్‌లను ఉపయోగించడం మరియు ఇత‌రుల‌తో పంచుకోవ‌డం చేసే ముందు  సాధారణ వివేకాన్ని పాటించాలని సూచించింది. ఆధార్ సంఖ్య గుర్తింపు ప్రమాణీకరణకు గాను  త‌గిన  వ్యవస్థ  ఏర్పాటు చేయ‌బ‌డి ఉంద‌ని.. ఆధార్ హోల్డర్ యొక్క గుర్తింపు. గోప్యతను రక్షించడానికి మరియు ప‌రిక్షించడానికి తగిన ఏర్పాట్ల‌ను క‌లిగి ఉంద‌ని తెలిపింది. 

***


(Release ID: 1829225) Visitor Counter : 455