యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పూణెలోని విమాన్ నగర్‌లో తక్షశిల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
సిఎస్‌ఆర్ నిధుల ద్వారా స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చాలని పూణేలోని కార్పొరేట్లకు విజ్ఞప్తి
Posted On:
29 MAY 2022 1:19PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ శనివారం సాయంత్రం విమాన నగర్‌లో పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) నిర్మించిన తక్షశిల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అట్టడుగు స్థాయిలో స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల ద్వారా క్రీడా సౌకర్యాలకు నిధులు ఇవ్వాలని ఈ మేరకు పూణేలోని కార్పొరేట్‌లు ముందుకు రావాలని శ్రీఠాకూర్ విజ్ఞప్తి చేశారు.
క్రీడలు మరియు ఫిట్‌నెస్‌లో పాల్గొనాలని యువకులకు పిలుపునిచ్చారు. "ఖేలోగే తో ఖిలోగే!" అనే ప్రధాని నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేసుకున్న మంత్రి "క్రీడలు పట్టుదలను నేర్పుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి" అని చెప్పారు. భారతదేశంలోనే ఊబకాయులు ఎక్కువగా ఉన్నారని, నిశ్చల జీవనశైలి ప్రజలను మార్చిందని, అందుకే ప్రతి ఒక్కరికీ ఫిట్‌నెస్ ముఖ్యమని ఆయన అన్నారు.
ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఈ ప్రాంత యువకులు, సామాన్యుల కోసం నిర్మించామని, ఏసీ గదుల్లోంచి బయటకు వచ్చి.. ఇక్కడ అరగంట పాటు ఆటలు ప్రాక్టీస్ చేయాలని.. అప్పుడే ఫిట్‌గా తయారవుతారని మంత్రి చెప్పారు. క్రీడల పట్ల ఇష్టం పెంచుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆస్పత్రి చికిత్స బిల్లులు తగ్గుతాయని మంత్రి చెప్పారు.
దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించడం గురించి శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, "మన పిల్లలకు ఆడటానికి అవకాశం వచ్చినప్పుడు వారు క్రీడల పట్ల అభిరుచిని పెంచుకుంటారు. అప్పుడు వారు దేశ మరియు విదేశాలలో మ్యాచ్‌లు గెలవడానికి తమంతట తాముగా ముందుకు వెళతారు. . స్పోర్టింగ్ టోర్నమెంట్ అనేది నరుల పోరు అని, ఇది మనిషి మానసికంగా ఎంత దృఢంగా ఉంటుందో తెలియజేస్తుందని అన్నారు.
ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు రాష్ట్రాలతో కేంద్రం చాలా సన్నిహితంగా పనిచేస్తోందని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. గతంలో 1,200 కోట్ల రూపాయలతో ఉన్న క్రీడల బడ్జెట్‌ను 3,000 కోట్ల రూపాయలకు పెంచామని, తద్వారా క్రీడాకారులకు ఎక్కువ నిధులు వెచ్చించామని చెప్పారు.
వీటితో పాటు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టీఓపిఎస్) కింద ఎలైట్ అథ్లెట్ల విదేశీ శిక్షణకు భారత ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ఇందులో వారి వసతి, పోషకాహారం, పరికరాలు, విదేశాలలో అంతర్జాతీయ పోటీలు ఉంటాయన్నారు. అలాగే నెలవారీ ప్రతి అథ్లెట్‌కు రూ. 50,000/- అందిస్తున్నట్టు చెప్పారు. "ఇప్పుడు ఆటగాళ్లు కేవలం వారి ఆటపైనే దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఇక దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అందుకే వారు కష్టపడుతున్నారని మరియు దేశం కోసం పతకాలు సాధిస్తున్నారు" అని మంత్రి తెలిపారు.
అంతకుముందు రోజు, కేంద్ర మంత్రి పూణెలోని ప్రసిద్ధ గుల్షాచి తాలిమ్ అఖాడాను సందర్శించారు. అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) కేంద్రాన్ని ప్రారంభించారు. మరియు శిక్షణ పొందిన రెజ్లర్లతో సంభాషించారు. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో రెజ్లింగ్ అఖాడాలను సాయ్ స్వీకరించింది. ఈ సందర్భంగా శ్రీ ఠాకూర్ ధోల్-తాషా క్రీడాకారులకు జాతీయ స్థాయి గేమ్స్‌లో ఆడేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తక్షశిల స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి:
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను సృష్టించే లక్ష్యంతో పూణె మున్సిపల్ కార్పొరేషన్ సుమారు రూ. 2.1 కోట్ల పెట్టుబడితో విమాన నగర్‌లోని తక్షశిల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసింది.
• క్రీడా ప్రాంగణంలో బాస్కెట్ బాల్, వాలీ బాల్ మరియు కబడ్డీ కోసం అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అభివృద్ధి చేయబడ్డాయి.
• క్రీడాకారుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు కాంప్లెక్స్‌లో ఓపెన్-ఎయిర్ జిమ్నాసియం కూడా ఉంది. అదేవిధంగా మినీ ఫుట్‌బాల్ మైదానాన్ని కూడా అభివృద్ధి చేశారు.
• స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు పొరుగున ఉన్న అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ అరేనాను కలుపుతూ హైటెక్ వంతెన ఉంది.
• సుమారు ఒక ఎకరం స్థలంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 1500 మంది సీటింగ్ కెపాసిటీతో ప్రేక్షకుల గ్యాలరీ త్వరలో అభివృద్ధి చేయబడుతుంది.
• సమీప భవిష్యత్తులో 400 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
****
(Release ID: 1829224)
Visitor Counter : 122