ప్రధాన మంత్రి కార్యాలయం

40వ ‘ప్రగతి’ సమావేశాని కి అధ్యక్షతవహించిన ప్ర‌ధాన మంత్రి


మౌలిక సదుపాయాల రంగం లోపనిచేస్తున్న ఏజెన్సీ లు వాటి ప్రాజెక్టుల ను అమృత్ సరోవర్ లో భాగం గా అభివృద్ధి పరచేజలాశయాల తో తమ ప్రాజెక్టు ల మేపింగ్ ను తయారు చేసుకోవచ్చును: ప్ర‌ధాన మంత్రి

కేంద్రీకరించిన గతి శక్తి సంచార్పోర్టల్ యొక్క లబ్ధి ని పొందాలని రాష్ట్రాలకు సూచించిన ప్రధాన మంత్రి; అలా చేస్తే,రైట్ ఆఫ్ వే దరఖాస్తుల ను సకాలం లో పరిష్కరించడం సాధ్యపడుతుంది

పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ప్లాన్ తరహా లో రాష్ట్రాలు కూడా రాష్ట్రాల స్థాయి లో గతి శక్తి మాస్టర్ ప్లాన్ నురూపొందించుకోవచ్చును: ప్రధాన మంత్రి

Posted On: 25 MAY 2022 7:26PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన నలభయ్యో ముఖాముఖి సమావేశాని కి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాల ను కలుపుకొంటూ పాలన మరియు సకాలంలో అమలు పరచడంకోసం ఉద్దేశించినటువంటి ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ యే ఈ ‘ప్రగతి’ మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ).

 

ఈ సమావేశం లో సమీక్ష కోసం ఎనిమిది ప్రాజెక్టు లు మరియు ఒక కార్యక్రమం సహా తొమ్మిది విషయాల ను తీసుకోవడమైంది. ఎనిమిది ప్రాజెక్టుల లో రైల్వే మంత్రిత్వ శాఖ, రవాణా, రాజమార్గాల మంత్రిత్వ శాఖ, పెట్రోలియమ్ మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ లకు చెందిన రెండేసి ప్రాజెక్టు లతో పాటు గా విద్యుత్తు మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు ఒకటి , ఇంకా జల వనరులు, నదుల వికాసం మరియు గంగ నది సంరక్షణ విభాగాని కి చెందిన ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి. ఈ ఎనిమిది ప్రాజెక్టుల మొత్తం వ్యయం 59,900 కోట్ల రూపాయల కు పైగానే ఉంది. ఈ ప్రాజెక్టు లు 14 రాష్ట్రాలు.. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు, ఛత్తీస్ గఢ్, ఒడిశా, అసమ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరమ్, నాగాలాండ్, సిక్కిమ్ మరియు ఝార్ ఖండ్..లకు సంబంధించినవి.

మౌలిక సదుపాయాల రంగం లో, ఉదాహరణ కు రహదారులు మరియు రైల్ వేల రంగం లో పని చేస్తున్న ఏజెన్సీ లు వాటి ప్రాజెక్టుల ను, అమృత్ సరోవర్ లో భాగం గా అ భివృద్ధిపరుస్తున్న జలాశయాల తో తమ ప్రాజెక్టు ల ఆకృతి ని

రూపొందించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది గెలుపు ను అందించే స్థితి అవుతుంది, ఎందుకంటే అమృత్ సరోవరాల కోసం తవ్వి తీసినటువంటి సామగ్రి ని ఏజెన్సీ లు సివిల్ కార్యాల కోసం ఉపయోగించుకొనేందుకు వీలు ఉంటుంది.

సమావేశం సాగిన క్రమం లో, ‘నేశనల్ బ్రాడ్ బ్యాండ్ మిశన్’ ప్రోగ్రాము ను కూడా ప్రధాన మంత్రి సమీక్షించారు. రైట్ ఆఫ్ వే (ఆర్ఒడబ్ల్యు) దరఖాస్తుల ను సరి అయిన సమయం లోపల పరిష్కరించడం కోసం కేంద్రీకృత‌ గతి శక్తి సంచార్ పోర్టల్ ను వినియోగించి లబ్ధి ని పొందవలసింది గా రాష్ట్రాల కు మరియు ఏజెన్సీ లకు సూచన చేయడమైంది. దీని తో మిశన్ ను ఆచరణ లోకి తీసుకు రావడం లో వేగం అందిరాగలదు. దీనికి అదనం గా, సామాన్య ప్రజానీకం కోసం జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొనే దిశ లో కూడాను రాష్ట్రాలు, ఏజెన్సీలు కృషి చేయాలి.

రాష్ట్రాలు సైతం ఇదే లక్ష్యం తో పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ కోవ లో రాష్ట్ర స్థాయి గతిశక్తి మాస్టర్ ప్లాన్ ను రూపొందించుకోవచ్చని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ఇది మెరుగైన ప్రణాళిక ను సిద్ధం చేసుకోవడం, కీలకమైన అంశాల ను గుర్తించడం తో పాటు వాటి కి పరిష్కారాల ను వెదకడం మరియు ప్రాజెక్టుల ను సకాలం లో అమలుచేయడానికి ఉత్తమమైన సమన్వయాన్ని ఏర్పరచడం లో చాలా తోడ్పాటు ను అందించగలుగుతుంది.

ప్రగతి తాలూకు 39 సమావేశాల లో, మొత్తం 14.82 లక్షల కోట్ల రూపాయల వ్యయం తో కూడిన 311 ప్రాజెక్టుల ను గురించి సమీక్షించడమైంది.

***

 



(Release ID: 1828663) Visitor Counter : 136