ప్రధాన మంత్రి కార్యాలయం
క్వాడ్ నేతల శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం జపాన్ ను సందర్శించనున్నప్రధాన మంత్రి (మే 23-25, 2022)
Posted On:
19 MAY 2022 10:00PM by PIB Hyderabad
జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం మే 24వ తేదీ న టోక్యో లో జరిగే క్వాడ్ నేత ల మూడో శిఖర సమ్మేళనం లో యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ మరియు ఆస్ట్రేలియా ప్రధాని లతో పాటు పాలుపంచుకోనున్నారు.
క్వాడ్ నేత లు 2021వ సంవత్సరం మార్చి నెల లో మొట్టమొదటిసారి గా వర్చువల్ పద్ధతి లో సమావేశమయ్యారు. ఆ తరువాత అదే సంవత్సరం సెప్టెంబర్ లో వాశింగ్ టన్ డి.సి. లో జరిగిన శిఖర సమ్మేళనం లో స్వయం గా పాల్గొన్నారు. వారు మళ్ళీ 2022వ సంవత్సరం లో మార్చి నెల లో వర్చువల్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. టోక్యో లో జరుగనున్న క్వాడ్ నేతల సమావేశం వారి యొక్క నాలుగో సమావేశం.
ఇండో-పసిఫిక్ రీజియన్ లో చోటు చేసుకొంటున్న ఘటన క్రమాల పై మరియు పరస్పర హితం ముడిపడి ఉన్నటువంటి సమకాలీన ప్రపంచ అంశాల పై నేత లు వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు తెలియజెప్పుకొనేందుకు ఒక అవకాశాన్ని రాబోయే క్వాడ్ సమిట్ అందిస్తోంది.
నేత లు క్వాడ్ కార్యక్రమాలు మరియు వర్కింగ్ గ్రూపుల తాలూకు పురోగతి ని సమీక్షించడం తో పాటు సహకారానికి కొత్త రంగాలను గుర్తించి, ముందు ముందు కలసి చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల కు సంబంధించిన వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని, అవలంబించవలసిన దృష్టికోణాన్ని అందిస్తారు.
జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో మే 24వ తేదీ నాడు జరిగే ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశం శ్రీ కిశిదా ఈ సంవత్సరం మార్చి నెల లో 14వ తేదీ న ఇండియా-జపాన్ యాన్యువల్ సమిట్ జరిగిన సందర్భం లో భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఉభయ నేతల మధ్య జరిగిన సంభాషణల ను మరింతగా ముందుకు తీసుకుపోవడం కోసం ఒక అవకాశాన్ని ఇవ్వబోతోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పర్యటన లో భాగం గా, జపాన్ వ్యాపార రంగ ప్రముఖుల తో ఏర్పాటయ్యే ఒక బిజినెస్ ఈవెంట్ లో పాల్గొని, ప్రసంగిస్తారు. జపాన్ లో ప్రవాసీ భారతీయుల తో మమేకం అవుతారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ జూనియర్ తో ఈ నెల 24వ తేదీ నాడు ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఏప్రిల్ 11వ తేదీ నాడు వర్చువల్ పద్ధతి లో వీరు ఉభయులు జరిపిన సంభాషణల కు ఒక కొనసాగింపు గా ఈ సమావేశం ఉంటుంది. భారతదేశం-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నేత లు ఇరువురు సమీక్షించే అవకాశం ఉంది. 2021వ సంవత్సరం సెప్టెంబర్ లో అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో ప్రధాన మంత్రి జరిపిన ద్వైపాక్షిక సమావేశాని కి అనుసరణ గా ఈ సమావేశం ఉండనుంది. వారు ఉమ్మడి హితం ముడిపడి ఉన్న ప్రపంచ పరిణామాలు మరియు ప్రాంతీయ ఘటనక్రమాల పట్ల సైతం వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకోనున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని తో ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొనే సూచన లు ఉన్నాయి. ఆస్ట్రేలియా లో ఈ నెల 21వ తేదీ నాడు ఎన్నిక లు జరుగనున్నాయి. ఉభయ నేతలు భారతదేశం- ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గురించి సమీక్షించేందుకు, పరస్పర హితం తో ముడిపడిన ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాల పై ఒకరి అభిప్రాయాల ను మరొకరి దృష్టి కి తీసుకు వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇద్దరు ప్రధాన మంత్రుల మధ్య కడపటి ద్వైపాక్షిక సమావేశం ఈ సంవత్సరం మార్చి 21వ తేదీ నాడు వర్చువల్ మాధ్యమం ద్వారా చోటుచేసుకొంది. దాని తరువాత, ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాడు ఇండియా- ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (ఇసిటిఎ) పై సంతకాలయ్యాయి.
***
(Release ID: 1826934)
Visitor Counter : 169
Read this release in:
Kannada
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam