సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేన్స్ లో ఇండియా : డీడీ ఇండియా ద్వారా కళ్ళకు కట్టేలా రోజూ నివేదిక

Posted On: 19 MAY 2022 12:46PM by PIB Hyderabad

ఫెస్టివల్ డి కేన్స్‌కు దగ్గరగా ఉండడం, మనఃస్ఫూర్తిగా ఆ వేడుకలను ఆస్వాదించడం ఎంతో మందికి ఒక కల. భారతీయ చలనచిత్ర ప్రేమికులకు, ఇది గొప్ప చలనచిత్ర ప్రయాణంలో విలక్షణమైన జీవిత అనుభవం కంటే కూడా పెద్దది. దూరదర్శన్ అంతర్జాతీయ ఛానెల్ డీడీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర ప్రపంచం నుండి గొప్ప వైవిధ్యమైన స్వరాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రయాణంలో మిమ్మల్ని తీసుకువెళుతుంది. పండుగ జరుగుతున్న ప్రదేశం నుండి ప్రత్యక్షంగా నివేదిస్తూ, కేన్స్‌ ఉత్సవాల్లో అను క్షణం, ప్రతి కోణంలో కళ్ళకు కట్టేలా చూపెట్టే భారతదేశంలోని ఏకైక టీవీ న్యూస్ ఛానెల్ డీడీ ఇండియా.

ఇండియా పెవిలియన్ ఓపెనింగ్‌లో దిగ్గజ నటీనటుల పాలుపంచుకున్న దృశ్యాలను డీడీ ఇండియాలో 360 డిగ్రీల కవరేజీని ప్రేక్షకుల ముందుంచింది. 'ఇండియా ఎట్ కేన్స్' పేరుతో డీడీ ఇండియా, డీడీ న్యూస్‌లో ప్రతిరోజూ అరగంట ప్రసారం ఇస్తూ విశేషంగా అలరిస్తోంది. ఈ కార్యక్రమం కేన్స్ అసాధారణ అనుభవాన్ని అందిస్తుంది - శక్తి మరియు భావోద్వేగాలు, ఉద్భవిస్తున్న పోకడలు, 21వ శతాబ్దంలో చలనచిత్రోత్సవాల ఔచిత్యం, చలన చిత్రాల ఉన్నతమైన అనుభవాలను ఈ ఉత్సవాలు డీడీ ఇండియా ద్వారా ప్రతిబింబించాయి. ఇది భారతదేశాన్ని కంటెంట్ హబ్‌గా కూడా హైలైట్ చేస్తుంది. డీడీ ఇండియా ద్వారా సెలబ్రిటీల స్పాట్ ఇంటర్వ్యూలు, లోతైన విశ్లేషణలు ఆసక్తి కలిగించాయి.

ఈ ఫెస్టివల్ ఎడిషన్‌లో కేన్స్ ఫిల్మ్ మార్కెట్‌లో భారతదేశం అధికారిక గౌరవ దేశంగా ఉండటంతో, కేన్స్ ఫిల్మ్ సర్క్యూట్‌లో ఉన్నత స్వరాలతో డీడీ ఇండియా వీక్షకులను కనెక్ట్ చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రాలను నిర్మించే దేశంగా భారతదేశం అన్వేషించిన కథలపై శేఖర్ కపూర్ ఆలోచనలు దీనిలో ప్రతిబింబించాయి. ప్రపంచంలోని కంటెంట్ హబ్‌గా మారడానికి భారతదేశం అపారమైన సంభావ్యత గురించి నవాజుద్దీన్ సిద్ధిఖీ సంక్షిప్త విశేషాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకుల ఉత్తేజంపై గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ పాయింట్ గ్రౌండ్ జీరో నుండి ఆకర్షణీయమైన చాట్‌లతో ఉత్సవ వాతావరణాన్ని ఈ బుల్లి తెర విస్తృతంగా ఆవిష్కరించింది.

ఈ షో రోజూ ‘ఇండియా ఎట్ కేన్స్’ అని రాత్రి 10 గంటలకు డీడీ ఇండియాలో, రాత్రి 10:30 గంటలకు డీడీ న్యూస్‌లో ప్రసారం ఆవుతోంది. డీడీ ఇండియాలో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ని చూడటానికి దిగువన ఉన్న QR కోడ్‌ని స్కాన్ చేయండి.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FNOY.jpg

******


(Release ID: 1826795) Visitor Counter : 152