సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతీయ సినిమా కంటెంట్ ప్రపంచ ప్రేక్షకుల హృదయాలను, మనసులను శాసిస్తోంది: కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
"భారతదేశం కోసం స్వంత ఓటిటిని ఏర్పాటు చేయడానికి బ్రాడ్ కాస్టర్లు, టెల్కోల మధ్య గోల్డ్ రష్"
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కో ప్రొడక్షన్ కొలాబరేషన్స్ ను వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం: శ్రీ అనురాగ్ ఠాకూర్
ఐదు సంవత్సరాలలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన కంటెంట్ ఉత్పత్తి చేసే దేశాలలో అగ్రగామిగా నిలుస్తుంది
2025 నాటికి ఏటా 53 బిలియన్ డాలర్ల ఆదాయం రాబట్టేలా మీడియా , వినోద పర్యావరణ వ్యవస్థకు సహాయపడే ప్రభుత్వ విధానాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ' ప్రభావశీల ఆర్థిక వ్యవస్థ 'గా భారత్ అవతరించబోతోంది: శ్రీ శేఖర్ కపూర్
Posted On:
19 MAY 2022 4:31PM by PIB Hyderabad
భారత్ కథలను ప్రస్తావిస్తూ, కేంద్ర
సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు కేన్స్ లో జరిగిన ప్రముఖ
పలైస్ డెస్ ఫెస్టివల్స్ లో ఇండియా ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగించారు.6000 సంవత్సరాల నాటి సంస్కృతికి, 1.3 బిలియన్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ, విదేశీ, భారతీయ చలనచిత్ర నిర్మాతలు, పాత్రికేయులు, ప్రతినిధులతో కూడిన అశేష ప్రేక్షకుల ముందు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తన కీలకోపన్యాసాన్ని చేశారు. .
శ్రీమతి వాణీ త్రిపాఠి మోడరేట్ చేసిన సెషన్‌లో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, రచయిత, కవి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్ శ్రీ ప్రసూన్ జోషి, భారతీయ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత శ్రీ ఆర్ మాధవన్, భారతీయ చిత్రనిర్మాత, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత , పారిశ్రామిక వేత్త, వ్యవస్థాపకుడు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ శేఖర్ కపూర్, ఎడిటర్, హాలీవుడ్ రిపోర్టర్ స్కాట్ రాక్స్ బరో, నిర్మాత ఫిలిప్ అవ్రిల్ వేదిక పై ఉన్నారు.
ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, భారత-ఫ్రాన్స్ దౌత్య సంబంధాల ఏర్పాటు రెండింటికీ 25 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. కేన్స్ ప్రాముఖ్యత గురించి మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా, ఇండో-ఫ్రెంచ్ సంబంధాలను బలోపేతం చేయడంలో 'ఫెస్టివల్ డి కేన్స్' గణనీయమైన పాత్ర పోషించిందని అన్నారు.
భారతీయ సినిమా చారిత్రాత్మక శిఖరాలను మంత్రి ప్రస్తావించారు. భారతీయ సినిమా ఇతివృత్తాలు (కంటెంట్) ప్రపంచ ప్రేక్షకుల హృదయాలను ,మనస్సులను శాసిస్తున్నదని, 1946 లో భారతీయ చిత్రనిర్మాత చేతన్ ఆనంద్ చిత్రం నీచా నగర్ కు పాల్మే డి ఓర్ ను బహూకరించడం ఒక మైలు రాయి అని, తిరిగి దశాబ్దం తరువాత 1956 లో సత్యజిత్ రే పథేర్ పాంచాలి పామే డి ఓర్ ను గెలుచుకుందని గుర్తు చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభ దేశాన్ని 'ప్రపంచంలోని కంటెంట్ హబ్'గా మార్చేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.
కేన్స్‌లో భారతదేశ ప్రస్తుత ఉనికి గురించి మంత్రి మాట్లాడుతూ, "భారతదేశం ప్రపంచ ప్రేక్షకులకు, భారతీయ సినిమా శ్రేష్ఠత, సాంకేతిక నైపుణ్యం, సంపన్న సంస్కృతి , కథాకథనాల గొప్ప వారసత్వాన్ని
అందించాలని భావిస్తోంది" అని అన్నారు.
“భారతదేశ రెడ్ కార్పెట్ ఉనికి వివిధ భాషలు ,ప్రాంతాలకు చెందిన నటీనటులు ,చలనచిత్ర నిర్మాతల ప్రాతినిధ్య పరంగా మాత్రమే కాకుండా, సంగీత స్వరకర్తలు , ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జానపద కళాకారుని బలమైన ఉనికితో ఓ టి టి ప్లాట్‌ఫారమ్‌ల పరంగా మన సినిమా నైపుణ్యం వైవిధ్యాన్ని గ్రహించింది. యువ వృద్ధ ప్రేక్షకులను ఆకర్షించింది" అని మంత్రి అన్నారు.కేన్స్‌లో భారతీయ స్టార్టప్‌ల ఉనికి గురించి మంత్రి ప్రేక్షకులకు తెలియజేసారు మీడియా , ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి చెందిన స్టార్టప్‌లు తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయని ,ఇంకా ఏ వి జి సి ప్రపంచంలోని ఉత్తమమైన యానిమేషన్ నిపుణుల బృందంతో ఉత్తమమైన వాటిని ప్రదర్శిస్తాయని చెప్పారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల గురించి మంత్రి ప్రేక్షకులకు తెలియజేసారు. భారతదేశంలో సహ-నిర్మాణాలు, సినిమా షూట్‌లు ,చలనచిత్ర సౌకర్యాలను పెంచడానికి కేంద్రం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రధాన కార్యక్రమాలను రూపొందించిందని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ సొంత ఫిల్మ్ ఫెసిలిటేషన్ విధానాలను రూపొందించాయని, కో-ప్రొడక్షన్ అవకాశాలను అందించాయని తెలిపారు.
ఈ ప్రయత్నాలు భారత దేశ మీడియా, వినోద వ్యవస్థ ను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఇది 2025 నాటికి వార్షికంగా 53 బిలియ న్ డాలర్ల ఆదాయాన్ని రాబట్టగలవని ఆయన పేర్కొన్నారు.
అటువంటి చర్యలో, “భారత ప్రభుత్వం అధికారికంగా ఆడియోవిజువల్ సేవలను 12 'ఛాంపియన్ సర్వీస్ సెక్టార్‌లలో' ఒకటిగా గుర్తించింది. ఈ రంగంలో భారతదేశం ఒక పెద్ద ముందడుగు ను తీసుకోవడానికి , విధాన మార్గదర్శిని సిద్ధం చేయడానికి, ప్రపంచంలో పోస్ట్ ప్రొడక్షన్ హబ్ గా మార్చేందుకు .పరిశ్రమ ప్రముఖులతో ఏ వి జి సి టాస్క్‌ఫోర్స్‌ను ఇటీవల ఏర్పాటు చేసింది‘‘
అన్నారు.
ఒకవైపు కృత్రిమ మేధస్సు, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్ వంటి ఇమ్మర్సివ్ టెక్నాలజీలు భారతదేశ ఐటి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని, మరోవైపు 2024 నాటికి భారతదేశంలో ఓటిటి మార్కెట్ వార్షికంగా 21% వృద్ధి చెంది దాదాపు 2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
భారత దేశాన్ని గ్లోబల్ కంటెంట్ ఉప ఖండంగా మార్చడానికి ప్రభుత్వం
అవసరమైన అన్ని చర్యలు
తీసుకుంటుందని, భారత దేశాన్ని ఎవిజిసి రంగానికి ప్రాధాన్యత తో పోస్ట్ ప్రొడక్షన్ హబ్ గా తీర్చిదిద్దడానికి మన యువతకు ఉన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడం కోసం
ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని, అందుకోసం ప్రభుత్వం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కో ప్రొడlక్షన్
సహకారాన్ని వేగవంతం చేయడంతో పాటు ఫిల్మ్ షూట్ ల కోసం భారతదేశంలో ఉన్న ఉత్తమ ప్రదేశాలను కూడా అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే 5
సంవత్సరాలలో భారత్ ను ప్రపంచ వ్యాప్తంగా నాణ్య మైన కంటెంట్ ను ఉత్ప త్తి చేసే దేశాల వరస లోకి తీసుకువస్తుందని శ్రీ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశంలో సినిమాలను చిత్రీకరించడానికి, దాని ఆతిథ్యంలో మునిగితేలడానికి , దాని ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడానికి విదేశీ చిత్ర నిర్మాతలకు ఆహ్వానం పలుకుతూ శ్రీ ఠాకూర్ తన ప్రసంగాన్ని ముగించారు.
చౌక బ్రాడ్ బ్యాండ్ ,మొబైల్ డివైజ్ ల ప్రాప్యత ప్రభావం గురించి శ్రీ శేఖర్ కపూర్ మాట్లాడుతూ, చలన చిత్ర పరిశ్రమ పై అంతరాయం కలిగించే ప్రభావం గురించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద 'ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ'గా మారబోతోందని, త్వరలోనే సినిమాని యువ చలనచిత్ర నిర్మాతలు పునర్నిర్వచించ బోతున్నారని అన్నారు.
భారతదేశం అవిశ్రాంత కలల కొలను. అలాంటి వాటిని సాకారం చేయడానికి ఎదురు చూడాలని శ్రీ శేఖర్ కపూర్ చేసిన ప్రస్తావన పై శ్రీ ప్రసూన్ జోషి వ్యాఖ్యానించారు.
మిస్టర్ స్కాట్ రాక్స్ బరో, భారతీయ కథా కథన శైలి ప్రపంచ మార్కెట్ కు ఆకర్షణీయంగా ఇంకా మారాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీ అపూర్వ చంద్ర, మిస్టర్ స్కాట్ రాక్స్ బరో వ్యాఖ్య తో విబెదిస్తూ, లంచ్ బాక్స్, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్ ,రాకెట్రీ వంటి చిత్రాలను ఉదహరించారు, అవి వారి కథలో సాధారణంగా భారతీయమైనవి కాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను స్పందింప చేసాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర నిర్మాత లకు భారత ప్రభుత్వం నిన్న
ప్రకటించిన ప్రోత్సాహకాలను ఆయన
పునరుద్ఘాటించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రపంచానికి చెప్పడానికి భారతదేశం వద్ద ఎంతో ఉందని, సినిమా ప్రపంచం ఈ ఆలోచనను అన్వేషించాలని శ్రీ ఆర్. మాధవన్ సూచించారు. ‘ఆర్యభట్ట నుండి సుందర్ పిచాయ్ వరకు భారతదేశంలో అసాధారణమైన కథలు ఉన్నాయి, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఆకాంక్షలు‘ అన్నారు.
***
(Release ID: 1826776)
Visitor Counter : 181
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam