ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        నేపాల్‌లోని లుంబినిలో బుద్ధజయంతి వేడుకలు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                16 MAY 2022 4:21PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                   నేపాల్‌లోని లుంబినీలోగల అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
   గౌరవనీయులైన నేపాల్ సాంస్కృతిక-పర్యాటకం, పౌర విమానయాన శాఖ మంత్రి, లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఎల్‌డీటీ) చైర్మన్ శ్రీ ప్రేమ్ బహదూర్ అలే, గౌరవనీయులైన లుంబిని  ముఖ్యమంత్రి శ్రీ కుల్ ప్రసాద్ కెసి, ఎల్‌డీటీ వైస్-చైర్మన్, పూజనీయ మెట్టెయ్య శాక్య పుట్టా సహా నేపాల్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బౌద్ధ సన్యాసులు, పండితులు, అంతర్జాతీయ ప్రతినిధులు మొత్తం దాదాపు 2500 మందిని ఉద్దేశించి రెండు దేశాల ప్రధానమంత్రులు ప్రసంగించారు.
                
                
                
                
                
                (Release ID: 1825902)
                Visitor Counter : 175
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam