ప్రధాన మంత్రి కార్యాలయం
రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
12 MAY 2022 8:18PM by PIB Hyderabad
అధ్యక్షుడు శ్రీ బైడెన్
ఉపాధ్యక్షురాలు హారిస్ గారు
శ్రేష్ఠులారా,
నమస్కారం.
కోవిడ్ మహమ్మారి జన జీవనాల కు, సరఫరా వ్యవస్థల కు అంతరాయాలను కలిగిస్తూనే ఉంది; సముదాయాల ప్రతిఘాతుకత్వాని కి అది పరీక్షలు పెడుతూనే ఉంది. భారతదేశం లో మేం మహమ్మారి కి వ్యతిరేకం గా ప్రజల ను కేంద్ర స్థానం లో ఉంచిన వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. మేం మా వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెటు కు ఇదివరకు ఎన్నడూ చేయనంత అధిక కేటాయింపు ను చేశాం.
ప్రజలకు టీకామందు ను ఇప్పించే మా కార్యక్రమం ప్రపంచం లోనే అత్యంత పెద్ద స్థాయి కలిగిన కార్యక్రమం. మేం వయోజనుల లో దాదాపు గా 90 శాతం మంది కి, అలాగే బాలల్లో 50 మిలియన్ కు పైగా టీకామందు తాలూకు పూర్తి రక్షణ ను అందించాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ) ఆమోదించిన నాలుగు టీకామందుల ను భారతదేశం తయారు చేస్తున్నది; మరి ఈ సంవత్సరం లో అయిదు బిలియన్ డోజుల ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం భారతదేశానికి ఉంది.
మేం 200 మిలియన్ కు పైగా డోజుల ను ద్వైపాక్షికం గాను, కోవాక్స్ ద్వారాను 98 దేశాల కు సరఫరా చేశాం. భారతదేశం కోవిడ్ సంబంధి పరీక్షల ను నిర్వహించడాని కి, చికిత్స ను అందించడాని కి, డాటా మేనేజ్ మెంట్ కు అతి తక్కువ ఖర్చు తో కూడిన కోవిడ్ ఉపశమనకారి సాంకేతికతల ను అభివృద్ధి పరచింది. ఈ సామర్ధ్యాల ను ఇతర దేశాల కు కూడా మేం ఇవ్వజూపాం.
వైరస్ కు సంబంధించిన గ్లోబల్ డాటా బేస్ కు భారతదేశం యొక్క జినోమిక్స్ కన్సార్టియమ్ చెప్పుకోదగినటువంటి విధం గా తోడ్పడింది. ఈ నెట్ వర్క్ ను మా ఇరుగు పొరుగున ఉన్నటువంటి దేశాల కు కూడా అందిస్తాం అని మీకు తెలియజేస్తున్నందుకు నాకు సంతోషం వేస్తోంది.
భారతదేశం లో, మేం కోవిడ్ కు వ్యతిరేకం గా మేం చేస్తున్న పోరాటాని కి పూరకాలు గా మా సాంప్రదాయిక మందులను విరివి గా ఉపయోగించాం. మానవుల లో వ్యాధినిరోధక శక్తి ని పెంపొందింప చేయడాని కి, ఎన్నో ప్రాణాల ను కాపాడటాని కి ఇలా చేశాం.
కిందటి నెల లో, ఈ పురాతనమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచ దేశాల కు అందుబాటు లోకి తీసుకు రావాలి అనేటటువంటి లక్ష్యం తో భారతదేశం లో ‘‘డబ్ల్యుహెచ్ఒ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్’’ కు మేం శంకుస్థాపన చేశాం.
శ్రేష్ఠులారా,
లో ఆరోగ్య సంబంధి అత్యవసర పరిస్థితి తో పోరాడడం కోసం సమన్వయ భరితమైనటువంటి ప్రపంచ స్థాయి ప్రతిస్పందన అవసరపడుతుంది అనేది స్పష్టం. ఆటుపోటుల కు తట్టుకొని నిలచి ఉండే ఒక గ్లోబల్ సప్లయ్ చైన్ ను మనం నిర్మించాలి. దానితో పాటు గా అందరికి టీకామందులు మరియు మందులు లభించేటట్ట చూడవలసి ఉంది.
డబ్ల్యుటిఒ నియమాలు, మరీ ముఖ్యం గా టిఆర్ఐపిఎస్ ని సరళతరం గా తప్పక మార్చవలసి ఉంది. ప్రపంచవ్యాప్తం గా మరింత శక్తివంతమైన ఆరోగ్య భద్రత సంబంధి వ్యవస్థ ను నిర్మించడం కోసం డబ్ల్యు హెచ్ఒ లో సంస్కరణలు తీసుకువచ్చి పటిష్టపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సరఫరా వ్యవస్థల ను నిలకడ గా, మార్పులకు లోనవకుండా ఉండేలా చూడటానికి వాక్ సీన్ ల కు , చికిత్స పద్ధతుల కు డబ్ల్యుహెచ్ఒ ఆమోద ప్రక్రియ ను సువ్యవస్థితం చేయాలి అని కూడా మేం కోరుతున్నాం. ఈ ప్రయాసల లో ఒక కీలకమైన పాత్ర ను పోషించడాని కి ప్రపంచ సముదాయం లో ఒక బాధ్యతయుతమైన సభ్యత్వ దేశం గా భారతదేశం తయారు గా ఉంది.
మీకు ఇవే ధన్యవాదాలు.
మీకు అనేక అనేక ధన్యవాదాలు.
***
(Release ID: 1825100)
Visitor Counter : 142
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam