ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేపాల్ లోని లుంబిని ని మే 16, 2022 న సందర్శించనున్న ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ

Posted On: 12 MAY 2022 7:09PM by PIB Hyderabad

బుద్ధ పూర్ణిమ 2022వ సంవత్సరం మే 16 న వస్తున్న సందర్భం లో నేపాల్ ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లుంబిని కి ఆధికారిక పర్యటన జరుపనున్నారు. ఇది 2014వ సంవత్సరం తరువాత నుంచి చూస్తే ప్రధాన మంత్రి నేపాల్ ను సందర్శించడం అయిదో సారి కానుంది.
లుంబిని లో ప్రధాన మంత్రి పవిత్ర మాయాదేవి ఆలయం లో పూజ- అర్చన కార్యక్రమాల లో పాలుపంచుకోవడం కోసం వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నేపాల్ ప్రభుత్వ ఆధ్వర్యం లో గల లుంబిని డెవెలప్ మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసేటటువంటి బుద్ధజయంతి కార్యక్రమం లో కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనితో పాటు విడి గా నిర్ధారించినటువంటి ఒక కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి లుంబిని మఠం క్షేత్రం లోపల ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కన్ఫెడరేశన్ (ఐబిసి), న్యూ ఢిల్లీ కి చెందిన ఒక స్థలం లో బౌద్ధ సంస్కృతి మరియు వారసత్వాల కు ఉద్దేశించిన ఒక కేంద్రాన్ని నిర్మించడానికి గాను ‘శంకుస్థాపన’ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. ఇద్దరు ప్రధానమంత్రుల మధ్య ఒక ద్వైపాక్షిక సమావేశం కూడా జరుగనుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క ఈ యాత్ర మన నైబర్ హుడ్ ఫస్ట్పాలిసీ ని ముందుకు తీసుకుపోయే క్రమం లో భారతదేశాని కి మరియు నేపాల్ కు మధ్య క్రమం తప్పక చోటు చేసుకొంటున్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల పరంపర ను కొనసాగించబోతోంది. ఈ యాత్ర రెండు దేశాల ప్రజల ఉమ్మడి నాగరకత సంబంధి వారసత్వాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని చాటిచెప్తుంది.

***

 


(Release ID: 1825092) Visitor Counter : 167