పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అబిడ్జాన్, కోట్ డి ఐవోర్‌లో ఎడారుల విస్తరణను అరికట్టేందుకు అమలు చేయాల్సిన చర్యలపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP 15) 15వ సదస్సులో శ్రీ భూపేందర్ యాదవ్ నాయకత్వంలో పాల్గొనున్న భారత బృందం దేశాధినేతలతో సహా ఉన్నతాధికార వర్గాలను ఉద్దేశించి ప్రసంగించనున్న మంత్రి


కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ, UNCCD COP 14 అధ్యక్ష హోదాలో భూమి క్షీణతను అరికట్టి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలన్న ప్రపంచ లక్ష్య సాధనకు దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారతదేశం గణనీయమైన కృషి చేసింది: శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 10 MAY 2022 10:16AM by PIB Hyderabad

అబిడ్జాన్కోట్ డి ఐవోర్‌లో 2022 మే 9 నుంచి 20 వరకు  ఎడారుల విస్తరణను అరికట్టేందుకు అమలు చేయాల్సిన చర్యలను చర్చించేందుకు  ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP 15) 15వ సదస్సులో పాల్గొనేందుకు భారత పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్  నాయకత్వంలో భారత బృందం  అబిడ్జాన్కోట్ డి ఐవోర్‌ చేరుకుంది. 

  ఎడారుల విస్తరణను అరికట్టేందుకు అమలు చేయాల్సిన చర్యలపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP 15) 15వ సదస్సులో పాల్గొనేందుకు  అబిడ్జాన్కోట్ డి ఐవోర్‌ చేరుకున్నాం. 

 

కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ  @UNCCD COP 14   14 అధ్యక్ష హోదాలో భూమి క్షీణతను అరికట్టి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలన్న ప్రపంచ లక్ష్య సాధనకు  దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారతదేశం  గణనీయమైన కృషి చేసింది: శ్రీ భూపేందర్ యాదవ్  pic.twitter.com/9RxL6anvSy

 

 — భూపేందర్ యాదవ్ (@byadavbjp) మే 9, 2022

 2019 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎడారుల విస్తరణను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్  14వ సదస్సుకు  అధ్యక్ష హోదాలో భారతదేశం  న్యూఢిల్లీలో  ఆతిథ్యం ఇచ్చింది. అధ్యక్ష పదవిలో భారతదేశం కొనసాగుతున్నది. 

COP 14 సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. "  భూమి క్షీణత అరికట్టి భూములను తిరిగి వినియోగంలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో భారతదేశం పని చేస్తోంది. ఇప్పటి నుంచి 2030 మధ్య కాలంలో ఇరవై ఒక మిలియన్ హెక్టార్ల నుండి ఇరవై ఆరు మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించి వినియోగం తీసుకుని వస్తాము." అని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో వివరించారు. " ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భూ  పునరుద్ధరణ విధానాన్ని అవలంబించడం ద్వారా క్షీణించిన వ్యవసాయంఅటవీ మరియు ఇతర బంజరు భూములను గుర్తించి దీనిలో అత్యంత క్షీణించిన మరియు దుర్బలమైన  26 మిలియన్ హెక్టార్ల భూమికి ప్రాధాన్యత ఇచ్చి  ఉత్పాదకత మరియు పర్యావరణ వ్యవస్థ సేవలను పునరుద్దరించే అంశాలపై  దృష్టి సారిస్తాము" అని  ప్రధాన మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 

 కోవిడ్-మహమ్మారి రూపంలో సమస్యలు ఎదురైనప్పటికీ   భూమి క్షీణతను అరికట్టడం, భూమిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశాలపై ప్రపంచ లక్ష్యాలను సాధించేందుకు అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గణనీయమైన కృషి చేసి విజయం సాధించింది. 

ఎడారుల విస్తరణ,  భూమి క్షీణత మరియు కరువుపై 14 జూన్ 2021న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో  భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుదీనిలో భూమి క్షీణతను ఎదుర్కోవడానికి భారతదేశం చేపట్టిన విజయగాథలు మరియు కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించారు. 

 ఎడారీకరణభూమి క్షీణత మరియు కరువుపై 14 జూన్ 2021 న జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యొక్క ఉన్నత-స్థాయి సంభాషణను భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుదీనిలో భూమి క్షీణతను ఎదుర్కోవడానికి భారతదేశం చేపట్టిన విజయగాథలు మరియు కార్యక్రమాలను హైలైట్ చేశారు.

భూసార క్షీణత అరికట్టి, కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో భారతదేశం అధ్యక్ష పదవిలో కొనసాగిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష కోట్ల మొక్కలను నాటాలని జీ 20 దేశాల నాయకులు నిర్ణయించారు. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు జీ 20 దేశాలతో కలిసి పని చేయాలని ఇతర దేశాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. 

ఇంతేకాకుండా, కరువును ఎదుర్కొని, నివారించేందుకు ఐక్యరాజ్య సమితి ఎడారుల విస్తరణ అరికట్టేందుకు ఏర్పాటైన సదస్సు  (UNCCD) కింద  సమర్థవంతమైన విధాన రూపకల్పన  మరియు అమలు చర్యలపై ఒక ఇంటర్‌గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ (IWG) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  23/COP.14లో తీసుకున్న నిర్ణయం మేరకు  ముసాయిదా నివేదిక తయారు చేయబడింది. ప్రస్తుత  COP 15 సదస్సులో ఈ నివేదిక చర్చకు వస్తుంది. 

2022 మే 9 నుంచి  20 వరకు అబిడ్జాన్, కోట్ డి ఐవోర్‌లో ఎడారుల విస్తరణపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన  కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP15) పదిహేనవ సదస్సులో వివిధ దేశాల నాయకులు, , ప్రైవేట్ రంగంప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో  భవిష్యత్తులో స్థిరమైన భూముల  నిర్వహణలో సాధించవలసి ఉన్న  పురోగతిని చర్చిస్తారు. సుస్థిర అభివృద్ధికి సంబంధించి భూమి మరియు ఇతర కీలకమైన స్థిరత్వ సమస్యల మధ్య సంబంధాలను గుర్తించడం జరుగుతుంది. 

ఈ ముఖ్యమైన అంశాలను 2022 మే 9,10 తేదీల్లో  జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి వివిధ దేశాలకు చెందిన నేతలు హాజరవుతారు. దీనితో పాటు వివిధ అంశాలపై ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, చర్చా కార్యక్రమాలను ఇతర ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. 

 

సదస్సులో  కరువుభూ పునరుద్ధరణ మరియు భూమి హక్కులులింగ సమానత్వం మరియు యువత సాధికారత వంటి  ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి.  UNCCD లో సభ్యత్వం ఉన్న  197 దేశాలు  తీసుకునే నిర్ణయాల ద్వారా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూమి పునరుద్ధరణ మరియు కరువు పరిస్థితులు  ఎదుర్కోవడం లాంటి అంశాలపై   COP15 తీసుకునే నిర్ణయాలు వేగంగా అమలు జరిగి  స్థిరమైన పరిష్కారాలను అందిస్తాయని  భావిస్తున్నారు.

 

***



(Release ID: 1824086) Visitor Counter : 150