ఆర్థిక మంత్రిత్వ శాఖ
14 రాష్ట్రాలకు 7,183.42 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు గ్రాంట్ విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్ 14,366.84 కోట్ల రూపాయలు
మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్ గా 2022-23లో 86,201 కోట్ల రూపాయలు పొందనున్న రాష్ట్రాలు
Posted On:
06 MAY 2022 4:30PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం శుక్రవారం పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు (పిడిఆర్‌డి) గ్రాంట్ 2వ నెలవారీ విడతగా 14 రాష్ట్రాలకు 7,183.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది . 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ గ్రాంట్ విడుదలైంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం మొత్తం 86,201 కోట్ల రూపాయలను డెవల్యూషన్ అనంతరం రెవెన్యూ లోటు గ్రాంటును సిఫార్సు చేసింది. సిఫార్సు చేసిన గ్రాంట్‌ని 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు చేసిన రాష్ట్రాలకు వ్యయ విభాగం విడుదల చేస్తుంది. తాజా విడుదలతో 2022-23లో రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ లోటు గ్రాంట్ల మొత్తం 14,366.84 కోట్ల రూపాయలకు చేరింది. .
విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం అందిస్తున్నది. ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు గ్రాంట్లు రాష్ట్రాలకు విడుదల చేయబడతాయి. విభజన తర్వాత రాష్ట్రాల రెవెన్యూ ఖాతాల్లోని లోటు భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు గ్రాంట్లు విడుదల చేయబడతాయి.
2020-21 నుంచి 2025-26 వరకు ఈ గ్రాంట్‌ను స్వీకరించడానికి రాష్ట్రాల అర్హత మరియు గ్రాంట్ పరిమాణాన్ని పదిహేనవ కమీషన్ అంచనా వేసిన డెవల్యూషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సంబంధిత రాష్ట్రం రాబడి మరియు వ్యయ అంచనా మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేయడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 2022-23లో డివల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్‌ను విడుదల చేయాలని పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.
2022-23కి రాష్ట్రాలకు సిఫార్సు చేయబడిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్ మరియు 2 వ విడత గా విడుదల చేసిన మొత్తం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
రాష్ట్రాల వారీగా విడుదల అయిన డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్లు ( పిడిఆర్‌డిజి )
(కోటిలో)
క్ర.స
|
రాష్ట్రం పేరు
|
2022-23 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన పిడిఆర్‌డిజి
|
మే, 2022 నెలలో 2వ విడత విడుదల చేసిన మొత్తం .
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
10,549
|
879.08
|
2
|
అస్సాం
|
4,890
|
407.50
|
3
|
హిమాచల్ ప్రదేశ్
|
9,377
|
781.42
|
4
|
కేరళ
|
13,174
|
1097.83
|
5
|
మణిపూర్
|
2,310
|
192.50
|
6
|
మేఘాలయ
|
1,033
|
86.08
|
7
|
మిజోరం
|
1,615
|
134.58
|
8
|
నాగాలాండ్
|
4,530
|
377.50
|
9
|
పంజాబ్
|
8,274
|
689.50
|
10
|
రాజస్థాన్
|
4,862
|
405.17
|
11
|
సిక్కిం
|
440
|
36.67
|
12
|
త్రిపుర
|
4,423
|
368.58
|
13
|
ఉత్తరాఖండ్
|
7,137
|
594.75
|
14
|
పశ్చిమ బెంగాల్
|
13,587
|
1132.25
|
(Release ID: 1823398)
Visitor Counter : 189