ప్రధాన మంత్రి కార్యాలయం

ఫిన్ లాండ్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం అయ్యారు

Posted On: 04 MAY 2022 4:35PM by PIB Hyderabad

ఇండియా-నార్డిక్ సమిట్ రెండోసారి జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఫిన్‌ లాండ్ ప్ర‌ధాని స‌నా మారిన్ గారి తో సమావేశమయ్యారు. నేతలు ఇరువురి మధ్య ముఖాముఖి సమావేశం చోటుచేసుకోవడం ఇది ఒకటోసారి.

ఇరు పక్షాలు 2021వ సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నాడు వర్చువల్ మాధ్యమం ద్వారా జరిగిన ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం లో తీర్మానాలు అమలు చేయడం లో నమోదు అయిన పురోగతి పట్ల సంతృప్తి ని వ్యక్తం చేశారు.

విజ్ఞాన శాస్త్రం మరియు విద్యా బోధన రంగాల లో డిజిటలైజేశన్ మరియు సహకారం అనేది ద్వైపాక్షిక భాగస్వామ్యాని కి ముఖ్యమైనటువంటి ఆధారాలు గా ఉన్నాయి అని నేతలు ఇద్దరు పేర్కొన్నారు. ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, భవిష్యత్తు కాలం లో వాడుక లోకి వచ్చేటటువంటి మొబైల్ సంబంధిత సాంకేతికతలు, క్లీన్ టెక్నాలజీ, ఇంకా స్మార్ట్ గ్రిడ్ వంటి సరికొత్త మరియు పురోగమన శీలమైన సాంకేతిక రంగాల లో సహకారాన్ని విస్తరించుకొనేందుకు ఉన్న అవకాశాల ను గురించి వారు చర్చించారు.

 

భారతదేశం లోని కంపెనీల తో ఫిన్ లాండ్ కు చెందిన కంపెనీలు చేతులు కలిపి, మరి ప్రస్తుతం భారతదేశ బజారు ఇవ్వజూపుతున్న అపారమైన అవకాశాల ను సద్వినియోగ పరచుకోవాల్సింది గా, మరీ ముఖ్యం గా టెలికం ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇంకా డిజిటల్ ట్రాన్స్ ఫార్మేశన్ లలో ముందంజ వేయాలని ప్రధాన మంత్రి ఆహ్వానాన్ని పలికారు.

ప్రాంతీయ పరిణామాల పైన, ప్రపంచ పరిణామాల పైన కూడా చర్చలు జరిగాయి; అలాగే అంతర్జాతీయ సంస్థల లో మరింత గా సహకరించుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

 

***



(Release ID: 1822814) Visitor Counter : 126