ప్రధాన మంత్రి కార్యాలయం

డెన్మార్క్‌ ప్రధానితో ప్రధానమంత్రి సమావేశంపై పత్రికా ప్రకటన

Posted On: 03 MAY 2022 6:20PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డెన్మార్క్‌ ప్రధాని గౌరవనీయ శ్రీమతి మెట్టీ ఫ్రెడరిక్సన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

   ముందుగా ప్రధానమంత్రులిద్దరూ ముఖాముఖి సంభాషించిన తర్వాత ప్రతినిధుల స్థాయి చర్చలు సాగాయి.

   భారత-డెన్మార్క్‌ హరిత వ్యూహాత్మక భాగస్వామ్య ప్రగతిపై ప్రధానులిద్దరూ సమీక్షించారు. పునరుత్పాదక ఇంధనం.. ముఖ్యంగా జలవనరుల తీరంలో పవన విద్యుత్‌, హరిత ఉదజని సహా నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, నౌకా రవాణా, నీరు, ఆర్కిటిక్‌ తదితరాలు ఈ చర్చల్లో ప్రధానాంశాలుగా ఉన్నాయి.

   భారతదేశంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు డెన్మార్క్‌ కంపెనీలు సానుకూల సహకారం అందించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. అదేవిధంగా డెన్మార్క్‌లో భారత కంపెనీలు సానుకూల పాత్ర పోషిస్తుండటాన్ని ప్రధాని ఫ్రెడరిక్సన్‌ కొనియాడారు.

   రెండుదేశాల మధ్య ప్రజల స్థాయిలో సంబంధాల విస్తరణపై ప్రధానమంత్రులు ఇద్దరూ హర్షం వ్యక్తం చేశారు. తదనుగుణంగా వలస, ప్రతినిధుల పరస్పర ప్రయాణ భాగస్వామ్యంపై ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనను వారు స్వాగతించారు.

   ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

   ప్రతినిధుల స్థాయి సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటనను ఆమోదించారు.

ఈ ప్రకటనతోపాటు రెండుదేశాల మధ్య ఒప్పందాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

 

***



(Release ID: 1822483) Visitor Counter : 118