ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అసమ్ లోని దీఫూ లో జరిగిన ‘శాంతి, ఏకత మరియు అభివృద్ధి ర్యాలీ’ ని ఉద్ధేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


‘‘దేశభక్తి కి మరియు రాష్ట్ర శక్తి కి ఒక ప్రేరణ గా శ్రీ ల‌చిత్ బోర్ ఫుకాన్ జీవనం ఉంది’’

‘‘ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్’ స్ఫూర్తి తో ‘డబల్ ఇంజన్’ ప్రభుత్వం పని చేస్తోంది’’

‘‘అమృత్ సరోవర్ ల పథకం పూర్తి గా ప్రజల భాగస్వామ్యం పై ఆధారపడింది’’

‘‘2014వ సంవత్సరం నుంచి ఈశాన్య ప్రాంతం లో కష్టాలు తగ్గుతున్నాయి;  అభివృద్ధి చోటు చేసుకొంటోంది’’

‘‘2020వ సంవత్సరం లో సంతకాలైన బోడో ఒప్పందం శాశ్వత శాంతి కి తలుపులు తెరచింది’’

‘‘గడచిన 8 సంవత్సరాల లో మేము ఈశాన్య ప్రాంతం లో శాంతి, ఇంకా మెరుగైన చట్టం మరియు వ్యవస్థస్థితులు ఏర్పడినందు వల్ల ఎఎఫ్ఎస్ పిఎ ను చాలా ప్రాంతాల లో రద్దు చేశాం’’

‘‘అసమ్ కు, మేఘాలయ కు మధ్య జరిగిన ఒప్పందం ఇతర అంశాల ను సైతంప్రోత్సహించగలదు;  ఇది యావత్తు ప్రాంతం లో అభివృద్ధిఆకాంక్షల కు దన్ను గా ఉండగలదు’’

‘‘ఇదివరకటి దశాబ్దాల లో మనం సాధించలేకపోయిన అభివృద్ధి ని మనం తప్పక సాధించవలసివుంది’’

Posted On: 28 APR 2022 12:40PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోని దీఫూ లో జరిగిన శాంతి, ఏకత మరియు అభివృద్ధి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే కార్యక్రమం లో ఆయన వేరు వేరు ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. దీఫూ లో పశు చికిత్స కళాశాల కు, పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ లో డిగ్రీ కళాశాల కు మరియు పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోనే గల కోలోంగ లో వ్యవసాయ కళాశాల కు ప్రధాన మంత్రి పునాది రాళ్ళు వేశారు. 500 కోట్ల రూపాయల కు పైగా విలువైన ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో నైపుణ్యాల సాధన కు మరియు ఉపాధి కల్పన కు కొత్త కొత్త అవకాశాల ను తీసుకు రానున్నాయి. 2950 కి పైగా అమృత్ సరోవర్ పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అమృత్ సరోవర్ లను మొత్తం సుమారు 1150 కోట్ల రూపాయల వ్యయం తో అసమ్ అభివృద్ధి చేయనుంది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో అసమ్ గవర్నర్ శ్రీ జగదీశ్ ముఖీ మరియు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కార్బీ ఆంగ్ లోంగ్ ప్రజలు తనకు స్నేహపూర్ణమైనటువంటి ఆహ్వానాన్ని పలికినందుకు గాను ధన్యవాదాల ను తెలియ జేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మరియు అసమ్ ముద్దుబిడ్డ శ్రీ ల‌చిత్ బోర్ ఫుకాన్ 400వ వార్షికోత్సవం ఒకే కాలం లో జరుగుతుండడం ఒక సంయోగం అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘దేశభక్తి కి మరియు రాష్ట్రశక్తి కి ఒక ప్రేరణ గా శ్రీ ల‌చిత్ బోడ్ ఫుకన్ జీవనం ఉంది. కార్బీ ఆంగ్ లోంగ్ లో పుట్టిన ఈ దేశ వీర పుత్రుని కి నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

జోడు ఇంజిన్ ల ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, మరియు సబ్ కా ప్రయాస్యొక్క స్ఫూర్తి తో కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ రోజు న ఈ సంకల్పం కార్బీ ఆంగ్ లోంగ్ గడ్డ పైన అదనపు బలాన్ని అందుకొంది. అసమ్ సత్వర అభివృద్ధి కి మరియు అసమ్ లో చిర శాంతి కి ఉద్దేశించిన ఒప్పందాన్ని అమలుపరచే కృషి శర వేగం గా సాగుతోంది’’ అని ఆయన అన్నారు.

ఈ రోజు న 2600కు పైగా సరోవరాల నిర్మాణం పనులు మొదలవుతున్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి గా ప్రజల భాగస్వామ్యం పై ఆధారపడిందని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీ సముదాయాల లో ఆ తరహా సరోవరాల తాలూకు ఘనమైనటువంటి సంప్రదాయాలు ఉండనే ఉన్నాయి అని ఆయన అంగీకరించారు. ఈ సరోవరాలు నీటి ని నిల్వ చేయడం ఒక్కటే కాకుండా ఆదాయ మాధ్యమం గా కూడా మారుతాయి అనేటటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

దేశం లోని ఈశాన్య ప్రాంతం లో 2014వ సంవత్సరం నుంచి కష్టాలు తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాదు, అభివృద్ధి చోటు చేసుకొంటోంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ‘‘ప్రస్తుతం ఎవరైనా అసమ్ లోని ఆదివాసీ ప్రాంతాల కు విచ్చేస్తే, లేదా ఈశాన్య ప్రాంతం లోని ఇతర రాష్ట్రాల కు వెళ్తే వారు కూడాను మారుతున్న స్థితి ని మెచ్చుకొంటారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కార్బీ ఆంగ్ లోంగ్ నుంచి అనేక సంస్థల ను కిందటి సంవత్సరం లో శాంతి మరియు అభివృద్ధి ప్రక్రియ లో చేర్చడమైంది అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. 2020వ సంవత్సరం లో కుదిరినటువంటి బోడో ఒప్పందం సైతం చిర శాంతి కి తలపుల ను తెరచింది. అదే విధం గా, త్రిపుర లో ఎన్ఐఎఫ్ టి శాంతి దిశ లో చొరవ తీసుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. రెండున్నర దశాబ్దాలు గా ఉన్న బ్రూ-రియాంగ్ చిక్కుముడి కూడా వీడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెశల్ పవర్ యాక్ట్ (ఎఎఫ్ఎస్ పిఎ) ను ఈశాన్య ప్రాంతం లోని అనేక రాష్ట్రాల లో చాలా కాలం పాటు రుద్దడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఏమైనప్పటికీ గత 8 సంవత్సరాల కాలం లో శాశ్వతమైనటువంటి శాంతి మరియు ఉత్తమమైన చట్టం, ఇంకా వ్యవస్థ ల తాలూకు స్థితిగతులు ఏర్పడినందు వల్ల ఈశాన్యం లోని అనేక ప్రాంతాల లో ఎఎఫ్ఎస్ పిఎ ను మేం ఉపసంహరించాం’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. సరిహద్దు ప్రాంతాల లో సమస్యల కు పరిష్కారాన్ని సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ తాలూకు స్ఫూర్తి తో అన్వేషించేందుకు ప్రయత్నం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘అసమ్ కు మరియు మేఘాలయ కు మధ్య కుదిరిన ఒప్పందం ఇతర అంశాల ను కూడా ప్రోత్సహించ గలుగుతుంది. ఇది యావత్తు ప్రాంతం లో అభివృద్ధి ఆకాంక్షల కు ఉత్తేజాన్ని ఇస్తుంది’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

ఆదివాసీ సముదాయాల ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఆదివాసీ సమాజం యొక్క సంస్కృతి, ఆ సమాజం యొక్క భాష, ఆ సమాజం యొక్క ఆహారం, కళ లు, చేతివృత్తులు.. ఇవి అన్నీ భారతదేశం సంపన్న వారసత్వం గా ఉన్నాయి. ఈ విషయం లో అసమ్ మరింత సమృద్ధం గా ఉంది. ఈ సాంస్కృతిక వారసత్వం భారతదేశాన్ని జోడిస్తోంది. ఇది ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి ని బలపరుస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆజాదీ కా అమృత్ కాల్ లో కార్బీ ఆంగ్ లోంగ్ కూడా శాంతి మరియు అభివృద్ధి ల తాలూకు ఒక సరికొత్త భవిష్యత్తు వైపునకు సాగిపోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇక ఇక్కడి నుంచి మనం వెనుదిరిగి చూడవలసిన పని లేదు. రానున్న కొన్ని సంవత్సరాల లో మనం ఇంతకు మునుపు దశాబ్దుల లో ఏ అభివృద్ధి ని అయితే సాధించలేకపోయామో, ఆ అభివృద్ధి ని ఇక మీదట సాధించవలసి ఉంది అని ఆయన చెప్పారు. కేంద్రం యొక్క పథకాల ను సేవా భావం తో, సమర్పణ భావం తో అమలు పరుస్తున్నందుకు గాను అసమ్ ను మరియు ఈ ప్రాంతం లోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ను ప్రధాన మంత్రి అభినందించారు. మహిళ లు అంత పెద్ద సంఖ్య లో తరలి వచ్చినందుకు గాను ఆయన ధన్యవాదాలు పలికారు. మహిళల స్థాయి, మహిళల గౌరవం, వారు జీవించడం లో సుగమత వంటి వాటిపై తాను శ్రద్ధ వహిస్తూనే ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు.

అసమ్ ప్రజల ప్రేమ ను, మరియు ఆదరణ ను వడ్డీ తో తిరిగి చెల్లిస్తాను అంటూ భరోసా ఇస్తానంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఆ ప్రాంతం అభివృద్ధి కి కృషి చేయడం లో తనను తాను పునరంకితం చేసుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇటీవల కార్బీ తీవ్రవాద సంస్థలు ఆరిటి తో భారత ప్రభుత్వం మరియు అసమ్ ప్రభుత్వం ఒక మెమోరాండమ్ ఆఫ్ సెటిల్ మెంట్ (ఎమ్ఒఎస్) పై సంతకాలు చేయడం అనేది ఆ ప్రాంతం యొక్క శాంతి మరియు అభివృద్ధి ల పట్ల ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి అచంచలమైన నిబద్ధత ను వెల్లడిస్తున్నది. ఈ మెమోరాండమ్ ఆఫ్ సెటిల్ మెంట్ ఆ ప్రాంతం లో శాంతి యొక్క నవ యుగానికి బాట ను పరచింది.

 

*******

DS/AK

 

 


(Release ID: 1820956) Visitor Counter : 164