మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఫాస్ఫారిక్ మరియు పొటాసిక్ (పి అండ్ కే) ఎరువులకు ఖరీఫ్ సీజన్‌లో (01.04.2022 నుండి 30.09.2022 వరకు) పోషకాల ఆధారిత సబ్సిడీ ( ఎన్ బి ఎస్ ) రేట్లకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం


ఖరీఫ్ సీజన్‌ 2022లో 60,939.23 కోట్ల రూపాయల మేరకు ఎన్ బిఎస్ కు మంత్రివర్గం ఆమోదం

గత ఏడాదితో పోల్చి చూస్తే ఒక్క బ్యాగ్ పై 50% వరకు పెరిగిన సబ్సిడీ

Posted On: 27 APR 2022 4:52PM by PIB Hyderabad

ఖరీఫ్ సీజన్ - 2022 (01.04.2022 నుంచి 30.09.2022   వరకు)లో ఫాస్ఫేట్ మరియు పొటాసిక్ (పి అండ్ కే)   ఎరువుల పోషకాహార ఆధారిత సబ్సిడీ రేట్లకు సంబంధించిన ఎరువుల శాఖ రూపొందించిన ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 

ఆర్థిక పరమైన అంశాలు :

 ఖరీఫ్-2022 (01.04.2022 నుంచి 30.09.2022 వరకు)లో అందించనున్న ఎన్ బి ఎస్ సబ్సిడీ 60,939.23 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దీని ద్వారా  దేశీయ ఎరువుల ఎరువుల ఉత్పత్తి ని ప్రోత్సహించేందుకు , డిఎపి  దిగుమతులకు అదనపుసహకారం అందించడం జరుగుతుంది. 

ప్రయోజనాలు :

అంతర్జాతీయంగా పెరిగిన డి-అమ్మోనియం ఫాస్పేట్ ( డిఎపిమరియు దాని ముడి పదార్థాల  ధరల పెరుగుదలను ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతం  ఒక బ్యాగ్‌కు రూ.1650గా ఉన్న సబ్సిడీకి బదులుగా డీఏపీపై బ్యాగ్‌కు రూ.2501లను అందిస్తుంది. ఇది  గత ఏడాది అందించిన సబ్సిడీ రేట్ కంటే 50% ఎక్కువ. డిఎపి దాని   దాని ముడిసరుకు ధరలు దాదాపు 80% వరకు పెరిగాయి. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల  రైతులకు రాయితీసరసమైన మరియు సహేతుకమైన ధరలపై నోటిఫైడ్ పి కె ఎరువులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల  వ్యవసాయ రంగానికి ప్రయోజనం కలుగుతుంది. 

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:

రైతులకు సరసమైన ధరలకు  ఎరువులు సజావుగా సకాలంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు  ఖరీఫ్ సీజన్ -2022 (01.04.2022 నుంచి 30.09.2022 వరకు వర్తిస్తుంది) ఎన్ బి ఎస్   రేట్ల ఆధారంగా  పి కె    ఎరువుల పై సబ్సిడీ అందించబడుతుంది.

నేపథ్యం :

ప్రభుత్వం ఎరువుల తయారీదారులు/దిగుమతిదారుల ద్వారా యూరియా మరియు 25 గ్రేడ్‌ల పి కె   ఎరువులను రైతులకు సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచుతోంది. పి కె   ఎరువుల పై అందిస్తున్న సబ్సిడీ 01.04.2010 నుంచి ఎన్ బి ఎస్    పథకం ప్రకారం అందించడం జరుగుతోంది.  రైతుల సంక్షేమం, అభివృద్ధికి అమలు చేస్తున్న స్నేహపూర్వక విధానాలకు అనుగుణంగా  రైతులకు సరసమైన ధరలకు పి అండ్ కె ఎరువులు లభ్యమయ్యేలా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ ఎరువులు అంటే యూరియాడిఎపిఎంఓపి మరియు గంధకం లాంటి ముడి పదార్థాల  ధరలు బాగా పెరిగిన దృష్ట్యాడిఎపితో సహా పి అండ్ కె ఎరువులపై అందిస్తున్న సబ్సిడీని పెంచడం ద్వారా పెరిగిన ధరల భారాన్ని భరించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఆమోదించబడిన ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు సబ్సిడీ విడుదల చేయబడుతుంది.  దీనివల్ల   రైతులకు ఎరువులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు ఉత్పత్తిదారులకు అవకాశం కలుగుతుంది.

 

****


(Release ID: 1820844) Visitor Counter : 266