ప్రధాన మంత్రి కార్యాలయం
యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సు లా వాన్ డేర్ లేయెన్ కు ఈ రోజు న స్వాగతం పలికిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
25 APR 2022 4:49PM by PIB Hyderabad
ఈ సంవత్సరం రైసీనా డైలాగ్ లో ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వడాని కి సమ్మతి ని వ్యక్తం చేసినందుకు గాను యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు న జరుగబోయే కార్యక్రమం లో ఆమె ఉపన్యాసాన్ని వినాలని తాను ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.
భారతదేశం మరియు యూరోప్ పెద్ద, చైతన్యవంతమైన ప్రజాస్వామ్య సమాజాలు గా అనేక ప్రపంచ అంశాల పైన ఒకే విధమైన విలువల ను మరియు ఉమ్మడి దృష్టి కోణాలను కలిగి ఉన్న మాట నిజమేనని నేత లు ఇద్దరూ అంగీకరించారు.
ఒక స్వేచ్ఛాయుతమైన వ్యాపార ఒప్పందం మరియు పెట్టుబడి ఒప్పందం అంశం లో సంప్రదింపుల ను త్వరలో తిరిగి మొదలు పెట్టడం సహా, భారతదేశం-ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యం లో పురోగతి పై వారు సమీక్ష జరిపారు. భారతదేశం-ఇయు సంబంధాల తాలూకు అన్ని అంశాల పైన పర్యవేక్షణ కు రాజకీయ స్థాయి లో ఒక ఉన్నతమైన ట్రేడ్ ఎండ్ టెక్నాలజీ కమిశన్ ను నెలకొల్పడాని కి, వేరు వేరు రంగాల లో సహకారాన్ని సమన్వయ పరచుకోవడాని కి కూడా అంగీకారం కుదిరింది.
గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల లో భారతదేశాని కి, ఇయు కు మధ్య సమన్వయాని కి గల అవకాశాలు సహా, జల వాయు సంబంధి అంశాల పై ఇద్దరు నేత లు విస్తృతం గా చర్చించారు. కోవిడ్-19 తాలూకు సవాళ్ళు కొనసాగుతూ ఉండడం, ప్రపంచం లోని అన్ని ప్రాంతాల కు టీకామందు మరియు చికిత్స సాధనాలు సమానం గా లభించేటట్లు పూచీ పడడాని కి తగిన ప్రయాస లు ఎంతైనా అవసరం అని వారు స్పష్టం చేశారు.
దీనికి అదనం గా, ఈ సమావేశం లో యూక్రేన్ లో స్థితి, ఇంకా ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఘటన క్రమాలు సహా సమయోచితమైనటువంటి భౌగోళిక పరిస్థితులు మరియు రాజకీయ స్థితులు కూడా చర్చించడం జరిగింది.
***
(Release ID: 1819893)
Visitor Counter : 228
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam