రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎలక్ట్రిక్ వాహనాల‌లో లోపభూయిష్ట బ్యాచ్‌ల‌న్నింటినీ రీకాల్ చేయడానికి కంపెనీలు ముందస్తు చర్య తీసుకోవాలిః శ్రీ నితిన్ గడ్కరీ


- ఇలాంటి సంఘటనలపై విచారణ మరియు నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు

Posted On: 22 APR 2022 11:45AM by PIB Hyderabad

గ‌డిచిన రెండు నెలల కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన అనేక దుర్ఘటనలు వెలుగులోకి వచ్చాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోగా, పలువురు గాయపడడం అత్యంత దురదృష్టకరం. గురువారం కేంద్ర మంత్రి  శ్రీ గడ్కరీ ఈ అంశంపై వరుస ట్వీట్లు చేశారు. కంపెనీలు అన్ని లోపభూయిష్ట బ్యాచ్‌ల వాహనాలను వెంటనే రీకాల్ చేయడానికి ముందస్తు చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలో మా ప్ర‌భుత్వం ప్ర‌తీ ప్ర‌యాణికుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు కట్టుబడి ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ ఘటనలపై విచారణ జరిపి పరిష్కార చర్యలపై సిఫార్సులు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నివేదికల ఆధారంగా డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని, ఎలక్ట్రిక్ వాహనాలకు నాణ్యత ఆధారిత మార్గదర్శకాలను కూడా త్వరలో జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భారీ జరిమానా విధించబడుతుందని మరియు అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయాలని కూడా ఆదేశించబడుతుందని శ్రీ గడ్కరీ తెలిపారు.
                                                           

******


(Release ID: 1819140) Visitor Counter : 137