ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

186.90 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.50 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,340

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,067

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.38%

Posted On: 20 APR 2022 9:22AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 186.90 కోట్ల ( 1,86,90,56,607 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,28,31,901  సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.50 కోట్లకు పైగా ( 2,50,83,940 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 2,11,000 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404482

రెండో డోసు

10009606

ముందు జాగ్రత్త డోసు

4630405

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18414509

రెండో డోసు

17527996

ముందు జాగ్రత్త డోసు

7203573

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

25083940

రెండో డోసు

862840

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57970064

రెండో డోసు

40745861

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555342528

రెండో డోసు

473731551

ముందు జాగ్రత్త డోసు

46960

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202863074

రెండో డోసు

187006387

ముందు జాగ్రత్త డోసు

164040

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126823517

రెండో డోసు

116490199

ముందు జాగ్రత్త డోసు

13735075

ముందు జాగ్రత్త డోసులు

2,57,80,053

మొత్తం డోసులు

1,86,90,56,607

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 12,340. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,547 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,13,248 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,067 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,21,183 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.29 కోట్లకు పైగా ( 83,29,27,938 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.38 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.49 శాతం వద్ద ఉంది.

 

****



(Release ID: 1818361) Visitor Counter : 130