ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ డి.సి లో ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివాతో భేటీ
Posted On:
19 APR 2022 10:06AM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ డిసిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి-ప్రపంచ బ్యాంకు (ఐఎంఎఫ్-డబ్ల్యూబి) వసంత కాల సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివాతో ద్వైపాక్షిక భేటీ జరిగింది .
వాషింగ్టన్ డి సిలో కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా
ఈ సమావేశంలో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత వి నాగేశ్వరన్, ఐఎంఎఫ్ ఎఫ్డిఎండి శ్రీమతి గీతా గోపీనాథ్ వంటి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచ, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు భారతదేశ ప్రాముఖ్యత గల అంశాలను చర్చించారు. కోవిడ్-19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం ఎదుగుదలను జార్జివా ప్రముఖంగా ప్రస్తావించారు. జార్జివా భారతదేశం అనుసరించిన సమర్థవంతమైన విధానాలను కూడా ప్రస్తావించారు. ఐఎంఎఫ్ సామర్థ్య అభివృద్ధి కార్యకలాపాలకు భారతదేశం అందించిన సహకారాన్ని ఆమె ప్రశంసించారు. జార్జివా భారతదేశం టీకా కార్యక్రమాన్ని, దాని పొరుగు, ఇతర బలహీన ఆర్థిక వ్యవస్థలకు అందించిన సహాయాన్ని ప్రశంసించారు. ఆమె ముఖ్యంగా శ్రీలంక వారి క్లిష్ట ఆర్థిక సంక్షోభంలో భారతదేశం అందిస్తున్న సహాయాన్ని ప్రస్తావించారు. శ్రీలంకకు ఐఎంఎఫ్ మద్దతు ఇవ్వాలని, అత్యవసరంగా ఆర్థిక సహాయం అందించాలని సీతారామన్ సూచించారు. ఐఎంఎఫ్ శ్రీలంకకు చేదోడుగా ఉంటుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థిక మంత్రికి హామీ ఇచ్చారు.
ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలను చర్చిస్తూ, శ్రీమతి సీతారామన్, జార్జివా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం, దాని కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలతో ముడిపడి ఉన్న సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
***
(Release ID: 1818288)
Visitor Counter : 234