సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

గత రికార్డులను తిరగరాసి పీఎంఈజీపీ కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించిన కెవిఐసి

Posted On: 19 APR 2022 2:38PM by PIB Hyderabad

అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం (పీఎంఈజీపీ) అమలులో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంస్థ  (కెవిఐసి) చిరస్మరణీయ గణాంకాలను నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కెవిఐసి దేశంలో 1.03 లక్షల ఉత్పత్తి, సర్వీస్ యూనిట్లను నెలకొల్పేందుకు సహకారం అందించింది. వీటి ద్వారా దేశంలో 8.25 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. కోవిడ్-19 రెండో దశ కారణంగా  2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో దేశంలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ  కెవిఐసి లక్ష్య సాధన దిశలో పని చేసి విజయం సాధించింది. స్వావలంబన సాధించేందుకు దేశంలో జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారం అందించింది.  

2008 నుంచి పీఎంఈజీపీ పథకాన్ని  కెవిఐసి అమలు చేస్తోంది. తొలిసారిగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కెవిఐసి సహకారంతో దేశంలో లక్షకి పైగా యూనిట్లు ఏర్పాటు అయ్యాయి. 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,03,219 యూనిట్లు దేశంలో ఏర్పాటు అయ్యాయి. దీనిలో కెవిఐసి మార్జిన్ మనీ సబ్సిడీగా 2978 కోట్ల రూపాయలను సమకూర్చింది. మిగిలిన 9,000 కోట్ల రూపాయలను బ్యాంకులు రుణాలుగా అందించాయి. కెవిఐసి  2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా మార్జిన్ మనీ సమకూర్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 2978 కోట్ల రూపాయల మార్జిన్ మనీ సబ్సిడీ ని అందించి కెవిఐసి రికార్డు సృష్టించింది. ఇంత పెద్ద మొత్తంలో 2008 నుంచి ఇంతవరకు  కెవిఐసి అందించలేదు.  పీఎంఈజీపీ కింద ఏర్పాటైన యూనిట్లలో దేశం వివిధ ప్రాంతాల్లో 8,25,752  ఉద్యోగాలు లభించాయి. ఉపాధి కల్పనలో కూడా  కెవిఐసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

2020-21 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో  పీఎంఈజీపీ కింద ఏర్పాటైన యూనిట్ల సంఖ్య 39% వరకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 36% ఎక్కువగా మార్జిన్ మనీ ని కెవిఐసి విడుదల చేసింది. 

2014-15 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే  పీఎంఈజీపీ కింద ఏర్పాటైన యూనిట్ల సంఖ్య 114% వృద్ధి సాధించింది. ఉపాధి కల్పనలో 131%, మార్జిన్ మనీ విడుదలలో 165% వృద్ధి నమోదయ్యింది. 

  స్వయం సమృద్ధి సాధించడానికి స్థానిక ఉత్పత్తులకు  ప్రధాన మంత్రి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల రికార్డు స్థాయిలో ఉద్యోగాలు లభించాయని  కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా అన్నారు. " కోవిడ్-19 ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఉత్పత్తులు, స్వయం ఉపాధి కల్పనకు ఇచ్చిన ప్రాధాన్యత అద్భుతాలు సృష్టించింది.  పీఎంఈజీపీ కింద స్వయం ఉపాధి కార్యకలాపాలు చేపట్టాలని పెద్ద సంఖ్యలో యువకులుమహిళలు మరియు వలసదారులను ప్రోత్సహించడం జరిగింది. పిఎంఇజిపి కింద ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయడానికి ఎంఎస్ఎంఈ  మరియు కెవిఐసి మంత్రిత్వ శాఖ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కెవిఐసి తన అత్యుత్తమ పనితీరును సాధించడంలో సహాయపడింది. ” అని శ్రీ సక్సేనా వివరించారు. 

పీఎంఈజీపీ సమర్థవంతంగా అమలు చేయడం కోసం కెవిఐసి ఇటీవలి సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. పిఎంఇజిపి పథకాన్ని  అమలు చేసేందుకు  2016లో కెవిఐసి   ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. 2016కి ముందు వ్యక్తిగతంగా దరఖాస్తులు దాఖలు చేయాల్సి వచ్చేది. దీనితో  ఏడాదికి సగటున 70,000 దరఖాస్తులు మాత్రమే అందేవి.ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టిన తరువాత ప్రతి సంవత్సరం సగటున దాదాపు 4 లక్షల దరఖాస్తులు అందుతున్నాయి. ఆన్‌లైన్ వ్యవస్థ మరింత పారదర్శకతను తీసుకొచ్చింది. పీఎంఈజీపీ పోర్టల్ దరఖాస్తుదారులు ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా వారి దరఖాస్తు స్థాయి తెలుసుకునేందుకు  వీలు కల్పిస్తుంది.

కెవిఐసి అన్నిపిఎంఇజిపి యూనిట్ల  జియో-ట్యాగింగ్‌ను కూడా ప్రారంభించింది. దీనివల్ల  యూనిట్‌ల వాస్తవ భౌతిక స్థితిని మరియు ఏ సమయంలోనైనా వాటి పనితీరును ధృవీకరించడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు 1 లక్ష కంటే ఎక్కువ పీఎంఈజీపీ యూనిట్లు జియో-ట్యాగ్ చేయబడ్డాయి. ఇది మొబైల్ యాప్‌ని ఉపయోగించి ఏ వ్యక్తి అయినా పిఎంఇజిపి యూనిట్‌లను గుర్తించేలా చేస్తుంది.

 కెవిఐసి అందించిన వివరాల ఆధారంగా పిఎంఇజిపి ప్రాజెక్ట్‌లను ఆమోదించడంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ పాత్రను  ఎంఎస్ఎంఈ   మంత్రిత్వ శాఖ తొలగించింది.  ప్రాజెక్ట్‌ల ఆమోదం కోసం   కెవిఐసి  రాష్ట్ర డైరెక్టర్‌లకు అధికారం కల్పించి వాటిని నేరుగా బ్యాంకు కి పంపడం జరుగుతుంది. 

  దరఖాస్తులను పరిశీలించి వాటిని  బ్యాంకులకు పంపేందుకు  తన రాష్ట్ర డైరెక్టర్లకు విధించిన కాలపరిమితిని కెవిఐసి 90 రోజుల నుంచి కేవలం 26 రోజులకు తగ్గించింది. ఇంకా, బ్యాంకులతో నెలవారీ సమన్వయ సమావేశాలు వివిధ స్థాయిలలో ప్రారంభించబడ్డాయి.  దీని ఫలితంగా లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందుతున్నాయి.  

 

 

సంవత్సరం

     పీఎంఈజీపీ కింద సంవత్సరాల వారీగా కెవిఐసి విజయాలు

స్థాపించబడి ప్రాజెక్ట్‌ల సంఖ్య

పంపిణీ చేయబడి

మార్జిన్ మనీ(రూ. కోట్లలో)

ఉపాధి (సంఖ్యలు)

2014-15

48,168

1122.54

3,57,502

2015-16

44,340

1020.06

3,23,362

2016-17

52,912

1280.94

4,07,840

2017-18

48,398

1312.4

3,87,184

2018-19

73,427

2070.00

5,87,416

2019-20

66,653

1950.81

5,33,224

2020-21

74,415

2188.78

5,95,320

2021-22

1,03,219

2977.61

8,25,752

మొత్తం

5,11,532

13,923.14

40,17,600

వృద్ధి % 2020-21 నుంచి

39%

36%

39%

వృద్ధి % 2014-15 నుంచి 

114%

165%

131%

 

***



(Release ID: 1818173) Visitor Counter : 208