ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని చంద్రశేఖర్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
17 APR 2022 8:47AM by PIB Hyderabad
భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ చంద్రశేఖర్ జయంతి సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. శ్రీ చంద్రశేఖర్ మహోన్నత వ్యక్తిత్వం గలవారని , ప్రజాస్వామ్య విలువలు, పేదరిక నిర్మూలనపై ఆయన నిబద్ధత, కృషి విస్తృత ప్రశంసలు అందుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
‘‘ప్రజాస్వామ్య విలువలు, పేదరిక నిర్మూలన కోసం ఆయన చేసిన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి. మహోన్నత వ్యక్తిత్వంగల శ్రీ చంద్రశేఖర్ అణగారిన, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి అర్పిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1817550)
आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam