ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఖల్సా సాజ్నా దివస్’ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 14 APR 2022 5:39PM by PIB Hyderabad

   ‌ల్సా సాజ్నా దివ‌స్’ సంద‌ర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ.. ముఖ్యంగా సిక్కులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖాల్సా మార్గం ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజానీకానికి స్ఫూర్తినిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రేరణ వల్లనే సిక్కులు అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని కొనియాడారు.

ఈ మేరకు ట్విట్టర్‌ద్వారా ఇచ్చిన సందేశంలో: 

   “ఖల్సా సాజ్నా దివస్ ప్రత్యేక సందర్భంగా ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా సిక్కులకు నా శుభాకాంక్షలు. ఖాల్సా పంథ్‌ ప్రపంచంలో అసంఖ్యాక ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తోంది. ఆ స్ఫూర్తితోనే సిక్కులు విభిన్న రంగాల్లో అంతర్జాతీయంగా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.” అని పేర్కొన్నారు.

 

**********

DS


(Release ID: 1816966) Visitor Counter : 194