ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులకు ప్రైవేటు కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలలో ప్రికాషినరీ డోస్ వేసేందుకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాయంత్రాంగాలకు పునశ్చరణ కార్యక్రమం నిర్వహణ
ప్రైవేటు కోవిడ్ -19 వాక్సినేషన్ కేంద్రాలు సర్వీసు చార్జీల కింద గరిష్ఠంగా వాక్సిన్ ధరపై నూటయాభై రూపాయల వరకు మాత్రమే వసూలు చేయాలి
Posted On:
09 APR 2022 12:17PM by PIB Hyderabad
18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులకు ప్రైవేటు కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలలో ప్రికాషినరీ డోస్ వేసేందుకు సంబంధించి,రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శుల పునశ్చరణ కార్యక్రమం 2022 ఏప్రిల్ 9 వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగింది.
ప్రికాషినరీ డొస్ గా తొలి, రెండవ డోస్ వేసిన వాక్సిన్‌నే వేస్తారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి తెలిపారు. లబ్ధిదారుల పేర్లు ఇప్పటికే కోవిన్ లో రిజిస్టర్ అయి ఉన్నందున, ప్రికాషనరీ డోసుకు సంబంధించి తాజాగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
అన్నివాక్సినేషన్ లను తప్పకుండా కోవిన్ ప్లాట్ ఫారంలో రికార్డు చేయాలని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ అపాయింట్ మెంట్, వాక్ ఇన్ రిజిస్ట్రేషన్, వాక్సినేషన్ ప్రైవేట్ కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాలలో ఉంటాయన్నారు.
ప్రైవేటు సివిసిలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇంతకుముందు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం వాక్సినేషన్ సైట్‌లను నిర్వహిస్తాయన్నారు. వీరు వాక్సిన్ ధరకు మించి సేవా రుసుం కింద గరిష్ఠంగా 150 రూపాయల వరకు వసూలు చేయవచ్చన్నారు. హెచ్‌సిడబ్ల్యులు, ఎఫ్ ఎల్ డబ్ల్యులు, 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లకు ప్రికాషనరీ డోస్‌ను ఏ సివిసిలో అయినా పొందవచ్చు. అలాగే ఉచితంగా ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రాలలో వాక్సిన్ వేయించుకోవచ్చు..
ప్రికాషన్ డోస్ కు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ఉపయోగపడే పలు కొత్త ప్రొవిజన్లపై రాష్ట్రస్థాయి అధికారులకు సవివరంగా తెలియజేయడం జరిగింది. అర్హులైన వారికి ప్రికాషన్ డోస్ వేయడం, పౌరులు తాము పొందిన సర్టిఫికెట్లలో ఏవైనా తప్పులు దొర్లితే వాటి సవరణకు ఏర్పాటు చేసిన విషయం తెలిపారు.
ప్రస్తుత ఉచిత కోవిడ్ 19 వాక్సినేషన్ కు సంబంధించి డోస్ 1, డోస్ 2 అలాగే 12 సంవత్సరాలు పైబడిన వారికి రెండో డోస్, హెచ్‌సిడబ్ల్యులు, ఎఫ్ ఎల్ డబ్ల్యులకు 60 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వ సివిసిలలో వాక్సిన్ వేయడాన్ని వేగవంతం చేయాలనీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది..
.ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనొహర్ అగ్నాని, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శితోపాటు నేషనల్ హెల్త్ మిషన్ డైరక్టర్‌లు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1815215)
Visitor Counter : 183