ఆర్థిక మంత్రిత్వ శాఖ
14 రాష్ట్రాలకు రూ.7183.42 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్‌ను విడుదల
రాష్ట్రాలు 2022-23లో రూ.86,201 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్‌ను పొందుతాయి
Posted On:
08 APR 2022 12:35PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం గురువారం 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్ల పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు (పీడీఆర్డి) గ్రాంట్ కు సంబంధించి 1వ నెలవారీ వాయిదాను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ గ్రాంట్ విడుదలైంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాలకు మొత్తం రూ.86,201 కోట్ల డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్‌ను పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. సిఫార్సు చేసిన గ్రాంట్‌ని 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు చేసిన రాష్ట్రాలకు వ్యయ విభాగం విడుదల చేస్తుంది.
విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు అందిస్తారు. విభజన తర్వాత రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలోని అంతరాన్ని తీర్చడానికి వరుసగా ఆర్థిక కమీషన్ల సిఫార్సుల మేరకు గ్రాంట్లు రాష్ట్రాలకు విడుదల చేస్తారు.
2020-21 నుండి 2025-26 వరకు ఈ గ్రాంట్‌ను స్వీకరించడానికి రాష్ట్రాల అర్హత, గ్రాంట్ పరిమాణాన్ని పదిహేనవ కమీషన్ అంచనా వేసిన డెవల్యూషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ సమయంలో.రాష్ట్రం రాబడి, వ్యయాల అంచనా మధ్య అంతరం ఆధారంగా నిర్ధారించారు.
2022-23లో పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ ద్వారా డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్ కోసం సిఫార్సు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్.
2022-23కి సిఫార్సు చేసిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్, మొదటి విడతగా రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
రాష్ట్రాల వారీగా విడుదలైన డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్లు (పీడీఆర్డిజి)
(రూ.కోట్లలో)
క్రమసంఖ్య
|
రాష్ట్రం
|
2022-23 సంవత్సరానికి ఎఫ్సి-ఎక్స్వి సిఫార్సు చేసిన పీడీఆర్డిజి
|
2022 ఏప్రిల్ లో విదులైన మొదటి వాయిదా
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
10,549
|
879.08
|
2
|
అస్సాం
|
4,890
|
407.50
|
3
|
హిమాచల్ ప్రదేశ్
|
9,377
|
781.42
|
4
|
కేరళ
|
13,174
|
1097.83
|
5
|
మణిపూర్
|
2,310
|
192.50
|
6
|
మేఘాలయ
|
1,033
|
86.08
|
7
|
మిజోరాం
|
1,615
|
134.58
|
8
|
నాగాలాండ్
|
4,530
|
377.50
|
9
|
పంజాబ్
|
8,274
|
689.50
|
10
|
రాజస్థాన్
|
4,862
|
405.17
|
11
|
సిక్కిం
|
440
|
36.67
|
12
|
త్రిపుర
|
4,423
|
368.58
|
13
|
ఉత్తరాఖండ్
|
7,137
|
594.75
|
14
|
పశ్చిమ బెంగాల్
|
13,587
|
1132.25
|
****
(Release ID: 1814823)
Visitor Counter : 177