ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్య్ర యోధుడు శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ 115వ జయంతి కి ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం కార్యక్రమం మరియు గుజరాత్ లోని బేచరాజీ లో జరిగిన ప్రహ్లాద్ జీ పటేల్ గారి జీవితచరిత్ర గ్రంథం ఆవిష్కరణ


‘‘శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ కార్యాలు వర్తమానతరాని కి ఉపయోగపడతాయి; అంతేకాదు భావి తరాల కు ప్రేరణ ను అందిస్తాయి’’ 

Posted On: 04 APR 2022 8:54PM by PIB Hyderabad

గుజరాత్ లోని బేచరాజీ లో జరిగిన శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ యొక్క 115వ జయంతి మరియు ఆయన (ప్రహ్లాద్ జీ పటేల్ గారి) జీవితచరిత్ర గ్రంథావిష్కరణ సందర్భం లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్ కూడా ఉన్నారు.

ప్రధాన మంత్రి బేచరాజీ యొక్క గౌరవశాలి భూమి మీద శ్రద్ధాంజలి ని ఘటించారు. అంతేకాక స్వాతంత్య్ర యోధుడు, సామాజిక కార్యకర్త శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ కు నమస్కరించారు. సమాజ సేవ లో శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ గారి ఔదార్యం మరియు ఆయన చేసిన త్యాగం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ స్వాతంత్య్ర సమర మహా యోధుడు మహాత్మ గాంధీ ఆహ్వానించిన మీదట స్వాతంత్య్ర సంగ్రామం లో పాలుపంచుకోగా, ఆయన ను బందీ గా పట్టుకొని సాబర్ మతీ లో, యరవాడ లో జైలు శిక్ష విధించడమైంది.

శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ లో దేశాని కే ప్రథమ తాంబూలంఅనేటటువంటి భావన ను పట్టి చూపిన ఒక ఘటన ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. జైలు లో ఉన్న కాలం లో శ్రీ ప్రహ్లాద్ పటేల్ యొక్క తండ్రిగారు చనిపోయారు; అయినా తండ్రి అంతిమ సంస్కారాలను పూర్తి చేయడానికి అనుమతి ని ఇవ్వడం కోసం వలసవాద పాలకులు పెట్టిన క్షమాపణ సంబంధి షరతుల ను శ్రీ ప్రహ్లాద్ పటేల్ స్వీకరించలేదు. గుప్తం గా ఉండి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుపుతూ ఉండినటువంటి అనేక మంది స్వాతంత్య్ర యోధుల కు కూడాను ఆయన సమర్ధన లభించింది. స్వాతంత్య్రం అనంతర కాలం లో సంస్థానాల ను విలీనం చేయడం లో సర్ దార్ పటేల్ గారి కి సాయపడడం లో శ్రీ ప్రహలాద్ జీ పటేల్ పోషించిన పాత్ర ను కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. అటువంటి అనేక మహా స్వాతంత్య్ర సేనానుల ను గురించి చరిత్ర పుస్తకాల లో ఎక్కడా ఏ ప్రస్తావన లేకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీ శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ యొక్క సతీమణి కాశీ బా గారి కి కూడాను ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని అర్పించారు. మహనీయుల జీవనం మరియు కార్యశైలి ని అక్షరబద్దం చేయడం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు అంటే అది యువతరం లో ప్రేరణ ను రగిలిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్ర యోధుల కు సంబంధించిన తెలియని పార్శ్వాల ను గురించి పరిశోధన జరిపి, వాటి ని ప్రచురించవలసిందంటూ విశ్వవిద్యాలయాలు అన్నిటికీ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మనం శ్రీ ప్రహ్లాద్ జీ పటేల్ వంటి స్వాతంత్య్ర యోధుల ను న్యూ ఇండియాను నిర్మించేందుకు శ్రమించిన వారు గా గుర్తు పెట్టుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

 

***


(Release ID: 1813701) Visitor Counter : 233