ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి సమక్షంలో ది ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’) పై సంతకాలు చేయడం జరిగింది


ప్రధాని శ్రీ మారిసన్కు మరియు పూర్వ ప్రధాని శ్రీ టోనీ ఎబట్ కు వారి నాయకత్వానికి గాను ధన్యవాదాలనుతెలిపిన ప్రధాన మంత్రి

"ఇంత తక్కువ వ్యవధి లో IndAus ECTA పైసంతకాలు జరగడం అనేది రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం యొక్క తోతు కు అద్దంపడుతోంది’’

‘‘ఈ ఒప్పందం ప్రాతిపదిక న మనం సప్లయ్ చైన్ లను మరింత శక్తియుక్తం గాతీర్చిదిద్దడం తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్ లో స్థిరత్వాని కి తోడ్పాటు ను ఇవ్వడంలో సమర్ధులం అవుతాం’’

‘‘ఈ ఒప్పందం మన మధ్య విద్యార్థుల, వృత్తినిపుణుల తో పాటు పర్యటకుల రాక పోకల కుమార్గాన్ని సుగమం చేస్తుంది,తత్ఫలితం గా ఇరు దేశాల ప్రజల సంబంధాలను కూడా బలపరుస్తుంది’’

త్వరలో జరుగనున్నప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ల జట్టు కు శుభాకాంక్ష లు తెలియజేసినప్రధాన మంత్రి

Posted On: 02 APR 2022 11:07AM by PIB Hyderabad

వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమం లో భారతదేశం ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ ల సమక్షం లో భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమ, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, సార్వజనిక వితరణ మరియు వస్త్రాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో వ్యాపారం, పర్యటన, ఇంకా పెట్టుబడి శాఖ మంత్రి శ్రీ డాన్ తెహాన్ లు ఈ రోజు న ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’)పై సంతకాలు చేశారు.

సంతకాలు ముగిసిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కిందటి నెల రోజుల లో ఆస్ట్రేలియా ప్రధాని తో తాను జరిపిన మూడో సంభాషణ ఇది అని తెలిపారు. ఆయన ప్రధాని శ్రీ మారిసన్ నాయకత్వం పట్ల, ఆయన వ్యాపార దూత మరియు పూర్వ ప్రధాని శ్రీ టోనీ ఎబట్ ల ప్రయాసల పట్ల ప్రశంస ను వ్యక్తం చేశారు. ఒక సఫలమైనటువంటి మరియు ప్రభావవంతమైనటువంటి భాగస్వామ్యం కోసం ఉద్దేశించిన కార్యాన్ని ఫలప్రదం చేసినందుకు వ్యాపార మంత్రుల ను మరియు వారి జట్ల ను కూడా ఆయన అభినందించారు.

ఇంత తక్కువ సమయం లో ఇండ్ ఆస్ ఇసిటిఎ పై సంతకాల ఘట్టం ముగియడం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం యొక్క లోతు ను చూపుతున్నది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఒక దేశం అవసరాల ను మరొక దేశం తీర్చేందుకు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల లో నెలకొన్న భారీ అవకాశాల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ ఈ ఒప్పందం రెండు దేశాల కు ఈ అవకాశాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకొనేందుకు వీలు కల్పిస్తుంది అన్నారు. ‘‘ఇది మన ద్వైపాక్షిక సంబంధాల లో ఒక మహత్తరమైన క్షణం ’’ అని ఆయన నొక్కి చెప్పారు. ‘‘ఈ ఒప్పందం ఆధారం గా, మనం కలసికట్టు గా సప్లయ్ చైన్ లను మరింత అధిక శక్తియుక్తం గా తీర్చిదిద్దడం తో పాటు గా ఇండో-పసిఫిక్ రీజియన్ లో స్థిరత్వాని కి కూడాను తోడ్పడగలుగుతాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రజా సంబంధాలు అనేవి భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య గల సంబంధాల లో ప్రముఖ స్తంభం అని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, ‘‘ఈ ఒప్పందం ద్వారా మన రెండు దేశాల మధ్య విద్యార్థుల, వృత్తినిపుణుల మరియు పర్యటకుల రాక పోకల కు మార్గం సుగమం అవుతుంది, దానివల్ల ఈ సంబంధాలు మరింత గా బలపడతాయి’’ అన్నారు.

రాబోయే ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా మహిళ ల క్రికెట్ జట్టు కు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను కూడా తెలియజేశారు.

ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మారిసన్ కూడా ఇటీవలి కొన్ని సంవత్సరాల లో రెండు దేశాల మధ్య చెప్పుకోదగిన స్థాయి లో చోటు చేసుకొంటున్న సహకారం గురించి చర్చించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఆయన నాయకత్వం పట్ల శ్రీ మారిసన్ ధన్యవాదాలు వ్యక్తం చేశారు. ఇండ్ ఆస్ ఇసిటిఎ పై సంతకాలు భారతదేశాని కి, ఆస్ట్రేలియా కు మధ్య పెంపొందుతున్న సంబంధాల లో మరొక మైలు రాయి అని ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొంటూ, ఈ ఒప్పందం సంబంధాల ను ఇతోధికం గా పటిష్టరుస్తుందన్నారు. వ్యాపార పరం గా, ఆర్థిక పరం గా సహకారం లో వృద్ధి కి తోడు ఇండ్ ఆస్ ఇసిటిఎ రెండు దేశాల మధ్య పనుల ను, విద్యావకాశాల ను, యాత్రావకాశాల ను విస్తరింప జేయడం ద్వారా ఉభయ దేశాల ప్రజల మధ్య స్నేహపూర్ణమైనటువంటి మరియు సన్నిహితమైనటువంటి బంధాల ను మరింత గాఢతరం గా మార్చుతుంది అని శ్రీ మారిసన్ అన్నారు. అతి పెద్ద తలుపుల లో ఒక తలుపుఇప్పుడు తెరచుకొంది అనే గొప్ప సందేశం మన వ్యాపార సంస్థల కు అందుతుంది; ఎందుకంటే రెండు సశక్త ప్రాంతీయ, ఆర్థిక వ్యవస్థ లు మరియు భావ సారూప్య ప్రజాస్వామ్యాలు పరస్పర ప్రయోజనం కోసం కలసి కృషి చేస్తున్నాయి కాబట్టి అని ఆయన అన్నారు. ఈ ఒప్పందం ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది అది ఏమిటి అంటే ప్రజాస్వామిక వ్యవస్థ లు కలసి పని చేస్తున్నాయి, మరి సప్లయ్ చైన్ ల సురక్ష కు, సశక్తత కు పూచీ పడుతున్నాయి అనేదే అని శ్రీ మారిసన్ అన్నారు.

భారతదేశం, ఇంకా ఆస్ట్రేలియా మంత్రులు కూడా ఒప్పందం పై సంతకాలు చేయడాని కంటే ముందు రెండు దేశాల మధ్య గల సంబంధాల యొక్క శక్తి పెరుగుతోందన్న అంశం పై వారి అభిప్రాయాల ను వెల్లడి చేశారు.

భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య పెంపొందుతున్న ఆర్థిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఈ రెండు దేశాల మధ్య శరవేగం గా వివిధీకరణ మరియు లోతయిన సంబంధాల స్థిరత్వం లోను, శక్తి లోను తోడ్పాటు ను ఇస్తున్నాయి. వస్తువులు మరియు సేవల రంగం లో వ్యాపారాన్ని చేర్చుతూ, ఇండ్ ఆస్ ఇసిటిఎ ఒక సంతులితమైన మరియు సమానావకాశాలతో కూడిన వ్యాపార ఒప్పందం గా రూపుదిద్దుకొంది. ఇది రెండు దేశాల మధ్య ఈసరికే ఉన్న లోతయిన, సన్నిహితమైన మరియు వ్యూహాత్మక సంబంధాల ను మరింత పటిష్టపరుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాల ను అందిస్తుంది, జీవన స్థాయి ని పెంచుతుంది, అంతే కాకుండా రెండు దేశాల ప్రజల సామాన్య సంక్షేమంలో మెరుగుదల కు తోడ్పడుతుంది.

 



(Release ID: 1813484) Visitor Counter : 217