ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గత 24 గంటల్లో 913 కొత్త కేసులు నమోదు; 715 రోజుల తర్వాత వెయ్యి కంటే తక్కువ
రోజువారీ కొవిడ్ మరణాలు 10 కంటే తక్కువ నమోదు
12-14 ఏళ్ల వారికి 1.86 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ
Posted On:
04 APR 2022 11:47AM by PIB Hyderabad
రోజురోజుకూ తగ్గుతూ వస్తున్న దేశవ్యాప్త కేసుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 714 తర్వాత దేశవ్యాప్త క్రియాశీల కేసులు 13,000 కంటే తగ్గి, 12,597 కు దిగివచ్చాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసులు 0.03 శాతం. రెండేళ్ల క్రితం, 2020 ఏప్రిల్ 18వ తేదీన 12,974 కేసులు నమోదయ్యాయి.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, దేశవ్యాప్త రోజువారీ కొత్త కేసులు కూడా వెయ్యి కంటే దిగివచ్చి, 913 నమోదయ్యాయి. 715 రోజుల తర్వాత వెయ్యి కంటే తగ్గాయి. 2020 ఏప్రిల్ 18వ తేదీన 991 కొత్త కేసులు నమోదయ్యాయి.
భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,316 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,95,089 కి పెరిగింది. రోజువారీ కొవిడ్ మరణాలు 10 కంటే తక్కువ నమోదయ్యాయి.
గత 24 గంటల్లో మొత్తం 3,14,823 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79.10 కోట్లకు పైగా ( 79,10,79,706 ) పరీక్షలు నిర్వహించారు.
వారపు, రోజువారీ పాజిటివ్ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.22 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతం వద్ద ఉంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం 184.70 కోట్ల ( 1,84,70,83,279 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,21,87,532 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
12-14 ఏళ్ల వారికి కొవిడ్-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.86 కోట్లకు పైగా ( 1,86,39,260 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
మొత్తం టీకా డోసులు
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10403809
|
రెండో డోసు
|
10001647
|
ముందు జాగ్రత్త డోసు
|
4483046
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18413439
|
రెండో డోసు
|
17513757
|
ముందు జాగ్రత్త డోసు
|
6915586
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
18639260
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
57333277
|
రెండో డోసు
|
38548306
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
554759695
|
రెండో డోసు
|
467231694
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
202775699
|
రెండో డోసు
|
185636455
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
126757912
|
రెండో డోసు
|
115626977
|
ముందు జాగ్రత్త డోసు
|
12042720
|
ముందు జాగ్రత్త డోసులు
|
2,34,41,352
|
మొత్తం డోసులు
|
1,84,70,83,279
|
****
(Release ID: 1813103)
Visitor Counter : 184