ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తోసమావేశమైన రష్యన్ ఫెడరేశన్ విదేశాంగ మంత్రి శ్రీ సర్గెయి లావ్ రోవ్ 

प्रविष्टि तिथि: 01 APR 2022 7:01PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రష్యన్ ఫెడరేశన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సర్గెయి లావ్ రోవ్ ఈ రోజు న సమావేశమయ్యారు.


యూక్రేన్ లో స్థితి ని గురించి, ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి సంప్రదింపులను గురించి ప్రధాన మంత్రి కి శ్రీ లావ్ రోవ్ వివరించారు. హింస ను త్వరలో అంతం చేయాలంటూ ప్రధాన మంత్రి తాను లోగడ ఇచ్చిన పిలుపు ను పునరుద్ఘాటించడం తో పాటుగా శాంతి ప్రయాసల కు ఏ విధమైన తోడ్పాటు ను అయినా సరే అందించడానికి భారతదేశం తయారు గా ఉంది అని చాటిచెప్పారు.

 

2021వ సంవత్సరం డిసెంబరు లో జరిగిన భారతదేశం-రష్యా ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం లో తీసుకొన్న నిర్ణయాల లో నమోదు అయిన పురోగతి ని గురించి కూడా ప్రధాన మంత్రి దృష్టి కి రష్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తీసుకు వచ్చారు.

 

**


(रिलीज़ आईडी: 1812901) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam