ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ్య సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల కు వీడ్కోలు పలికిన ప్రధాన మంత్రి


‘‘అనుభవం ఉన్న సభ్యులు సభ ను విడిచి వెళితే దాని వల్ల సభ కు నష్టం కలుగుతుంది’’

‘‘సభ యావత్తు దేశం యొక్క భావోద్వేగాల కు, ఉత్సాహాని కి, వ్యథ కు మరియు ఆనందాని కి అద్దం పడుతుంది’’

Posted On: 31 MAR 2022 1:12PM by PIB Hyderabad

రాజ్య సభ లో రిటైర్ అవుతున్న సభ్యులంతా అందించినటువంటి తోడ్పాటుల కు గాను వారిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసిస్తూ, వారు రాబోయే కాలం లో బాగుండాలి అనే ఆకాంక్ష ను వ్య్తం చేశారు. రిటైర్ అవుతున్న సభ్యుల అనుభవం యొక్క విలువ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, వారి నిష్క్రమణ తో సభ లో మిగిలిన సభ్యుల బాధ్యత అధికం అవుతుంది, మరి వారు బయట కు వెళుతున్న సభ్యులు చేసిన కృషి ని ముందుకు తీసుకు పోవలసి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

సభ దేశం లోని అన్ని ప్రాంతాల భావోద్వేగాల ను, ఉత్సాహాన్ని, వ్యథ ను, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఒక సభ్యుడు లేదా ఒక సభ్యురాలు గా మనం సభ కు ఎంతో తోడ్పాటు ను అందిస్తాం, అయితే సభ కూడా మనకు ఎంతో ఇస్తుంది అనేది కూడా యదార్థమే ఎలాగంటే సభ ప్రతి రోజూ భారతదేశం లోని విభిన్న స్వరూపాలతో కూడిన సమాజం తాలూకు వర్తమాన వ్యవస్థల ను అర్థ: చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

కొంత మంది సభ్యులు సభ ను వీడి వెళుతున్నప్పటి కీ వారు వారి యొక్క ఘనమైన అనుభవాన్ని దేశం లో అన్ని మూలల కు తీసుకు పోతారు అని ప్రధాన మంత్రి అన్నారు.

సభ్యులు వారి జ్ఞాపకాల ను భావి తరాల వారికి ఉపయోగకరమైనటువంటి పరిశీలనాంశం గా అక్షరబద్ధం చేయాలి అని కూడా ప్రధాన మంత్రి సూచించారు. సభ్యులు దేశాని కి దిశ ను ఇచ్చి దానిని ప్రభావితం చేస్తారని, వారి స్మృతుల ను ఒక సంస్థాగతమైన పద్ధతి లో దేశం అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకోవడం లో ప్రజల కు ప్రేరణ ను కలిగించండి అంటూ రిటైర్ అవుతున్న సభ్యుల ను ప్రధాన మంత్రి అభ్యర్థించారు.

 

 

 



(Release ID: 1812214) Visitor Counter : 128