ప్రధాన మంత్రి కార్యాలయం
డబ్ల్యు హెచ్ ఒ గ్లోబల్ సెంటర్ ఫార్ట్రెడిశనల్ మెడిసిన్ ను ఏర్పాటు చేయడంకోసం డబ్ల్యు హెచ్ఒ తో ఆయుష్ మంత్రిత్వ శాఖ కలసి ఆతిథేయ దేశం అంశం లో ఒకఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని స్వాగతించిన ప్రధాన మంత్రి
Posted On:
26 MAR 2022 9:14AM by PIB Hyderabad
డబ్ల్యు హెచ్ ఒ గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్ కు భారతదేశం నిలయం అవుతూ ఉండడం అనే అంశం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వెలిబుచ్చారు. భూగ్రహాన్ని ఆరోగ్యవంతం గా తీర్చిదిద్దడం తో పాటు ప్రపంచ హితం లో మన సమృద్ధ సాంప్రదాయిక అభ్యాసాల ను వినియోగించుకోవడం లో ఈ కేంద్రం తోడ్పాటు ను అందించగలుగుతుందన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.
ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక ఆతిథేయ దేశం సంబంధి ఒప్పందాన్ని డబ్ల్యు హెచ్ ఒ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ కుదుర్చుకొన్నాయి.
ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు డబ్ల్యు హెచ్ ఒ లు చేసినటువంటి ట్వీట్ లకు సమాధానం గా ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం ఒక అత్యంత ఆధునికమైనదైనటువంటి @WHO Global Centre for Traditional Medicine కు నిలయం గా అవుతున్నందుకు గర్వపడుతోంది. ఈ కేంద్రం ఒక ఆరోగ్యవంతమైనటువంటి భూగ్రహాన్ని తీర్చిదిద్దే దిశ లో మరియు మా సమృద్ధియుక్త సాంప్రదాయిక అభ్యాసాల ను ప్రపంచ హితం కోసం వినియోగించే దిశ లో తోడ్పాటు ను అందించగలుగుతుంది.
భారతదేశాని కి చెందిన సాంప్రదాయిక ఔషధాలు మరియు ఆరోగ్య సంరక్షణ సంబంధి అభ్యాసాలు ప్రపంచవ్యాప్తం గా బహుళ జనాదరణ కు పాత్రం అయ్యాయి. ఈ @WHO Centre మన సమాజం లో ఆహ్లాదాన్ని వ్యాపింపచేసే దిశ లో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST