ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ లోని అహమదాబాద్ లో గల ఎస్జివిపి గురుకులం లో  భావ వందన పర్వ్ ను నిర్వహించిన సందర్భం లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం


‘‘పూజ్య శాస్త్రీజీ మహారాజ్ జీవిత చరిత్రజ్ఞాన అన్వేషణ కు మరియు సమాజ సేవ కు అంకితం అయినటువంటి ఒక మహా వ్యక్తిత్వం యొక్కనిస్వార్థ జీవనాన్ని గురించి తెలియజేస్తుంది’’

‘‘కాలానుగుణ అవసరాల కు తగినట్లు గా ప్రాచీనమేధ ను స్వీకరించాలనిచ, జడత్వాన్ని విడచిపెట్టాలని శాస్త్రీజీ స్పష్టం చేశారు’’

‘‘స్వాతంత్య్ర పోరాటానికి పునాది ని వేయడంలో  ప్రముఖ పాత్ర ను పోషించిన సాధువులుమరియు భక్తి ఉద్యమం’’ 

Posted On: 20 MAR 2022 10:51PM by PIB Hyderabad

గుజరాత్ లోని అహమదాబాద్ లో గల ఎస్ జివిపి గురుకులం లో ఈ రోజు న భావ వందన పర్వ్ ను నిర్వహించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పూజ్య శాస్త్రీజీ మహారాజ్ జీవిత చరిత్ర గ్రంథం అయిన శ్రీ ధర్మజీవన్ గాథఆవిష్కరణ ను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మహానుభావుల కార్యాలు మరియు గాథ లు గ్రంథస్తం అయ్యే కంటే చాలావరకు కేవలం స్మృతి గా, మాట్లాడుకొనేందుకు మాత్రమే మిగిలి పోతాయి అన్నారు. పూజ్య శాస్త్రీజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర ఒక మహా వ్యక్తిత్వం యొక్క నిస్వార్థ జీవనాన్ని గురించి చెబుతుందని, ఆ మహనీయ వ్యక్తిత్వం జ్ఞానాన్వేషణ కు మరియు సామాజిక సేవ కు అంకితం అయిందన్నారు. అటువంటి జీవనాన్ని అక్షరబద్ధం చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘అందరు బాగుండాలి’ అనేటటువంటి పూజ్య శాస్త్రీజీ మహారాజ్ మూల మంత్రాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్తాలూకు తన దృష్టి కోణం అనేది శాస్త్రీజీ మహారాజ్ వంటి మహానుభావుల నుంచి ప్రేరణ ను పొందిందని, అంతేకాకుండా సర్వజన హితాయ, సర్వ జన సుఖాయతాలూకు తత్వం పైన ఆధారపడిందని పేర్కొన్నారు.

ప్రాచీన భారతదేశం యొక్క గురుకుల సంప్రదాయం సర్వజన హితాయను బోధించిందని, అది ఎలాగంటే గురుకుల విద్యార్థుల లో అన్ని జీవన రంగాల కు చెందిన వారు ఒక చోటు లో విద్య ను అభ్యసించే వారు అని ప్రధాన మంత్రి చెప్పారు. ఇదే సంప్రదాంయ తన లోపల గౌరవశాలి అయినటువంటి గతం యొక్క, భవ్యమైనటువంటి భవిష్యత్తు యొక్క బీజాల ను ఇముడ్చుకొందని ఆయన అన్నారు. ఈ సంప్రదాయం దేశం లోని సామాన్య ప్రజల కు ధార్మికమైన, సాంస్కృతికమైన మరియు సామాజికమైన ప్రేరణ ను అందిస్తుంది అని ఆయన అన్నారు. శాస్త్రి గారు వారి గురుకులం మాధ్యమం ద్వారా ప్రపంచం అంతటా ఎందరి జీవితాలనో తీర్చిదిద్దారు. ‘‘వారి జీవనం ఉపదేశాత్మకమో, లేదా ఆదేశాలు ఇవ్వడానికో కాక క్రమశిక్షణ మరియు తపస్సుల తో కూడిన నిరంతర ప్రవాహం లా సాగింది.. మరి వారు కర్తవ్య పథం లో ఎప్పటికీ మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఎస్ జివిపి గురుకులం తో తనకు ఉన్న స్వీయ బంధాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొంటూ, గొప్ప సంస్థలన్నిటిలో ప్రాచీన మేధ లో ఆధునికత్వం యొక్క తత్వాలు కూడా కలసి ఉంటాయి అని వివరించారు. కాలం అవసరాల కు తగ్గట్టు గా ప్రాచీన మేధ ను స్వీకరించాలని మరియు జడత్వాన్ని వీడాలని శాస్త్రీజీ నొక్కి చెప్పారు అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్ర పోరాటాని కి పునాది ని వేయడం లో భక్తి ఉద్యమం తో పాటు సాధువు లు ఒక ప్రముఖ పాత్ర ను పోషించారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో, అమృత కాలం లో తోడ్పాటు ను అందించడం కోసం గురుకుల పరివారం ముందుకు రావచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి, ఇంకా యూక్రేన్ స్థితి వంటి సంక్షోభాల వల్ల రేకెత్తిన అనిశ్చితుల ను గురించి ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఆత్మనిర్భరత కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి పునరుద్ఘాటించారు. గురుకుల కుటుంబం వోకల్ పార్ లోకల్(స్థానిక వస్తువుల ను సమర్ధించాలి) అని ఆయన కోరారు. ప్రతి రోజు ఉపయోగించే వస్తువుల తో కూడిన ఒక జాబితా ను తయారు చేసి, దిగుమతి చేసుకొనే వస్తువుల పై ఎంతవరకు ఆధారపడవచ్చో అనేది అంచనా వేయాలని వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. భారతీయుల శ్రమ ద్వారా తయారు అయ్యేటటువంటి ఒక వస్తువు అందుబాటు లో ఉన్నప్పుడు ఆ వస్తువుకే ఎల్లవేళలా ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు. అదే మాదిరి గా ఒకసారి వాడే ప్లాస్టిక్ జోలికి పోకుండా ఈ కుటుంబం స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు తోడ్పాటు ను అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఏకతా విగ్రహం) లేదా స్థానిక ప్రతిమా స్థలాల వద్ద కు వెళ్లి ఆయా ప్రాంతాల లో శుభ్రత స్థితి ని మెరుగు పరచడానికి కొన్ని సమూహాల ను క్రమం తప్పక పంపిస్తూ ఉండవలసిందని ఆయన అందరికి సూచన చేశారు. రసాయనాలు, తదితర నష్టాల బారి నుంచి ధరణి మాత ను కాపాడుకోవడం కోసం ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ దిశ లో గురుకులం ఒక ప్రముఖ భూమిక ను పోషించ గలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో, పూజ్య శాస్త్రీజీ మహారాజ్ బోధనల ను పాటిస్తూ సరికొత్త పద్ధతి లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకోవాలని గురుకుల పరివారాన్ని అభ్యర్థించారు.

 

***



(Release ID: 1807628) Visitor Counter : 163