ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహమదాబాద్ లో జరిగిన గుజరాత్ పంచాయత్మహాసమ్మేళన్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ఈ రోజు న ఎప్పుడైతే మనం అమృత్ మహోత్సవ్ను జరుపుకొంటున్నామో, మనం బాపు కన్నటువంటి ‘గ్రామీణ వికాస్’ తాలూకు కల ను తప్పక నెరవేర్చాలి’’

‘‘ఒకటిన్నర లక్షల పంచాయతీ ప్రతినిధులు కలసికట్టుగాచర్చోపచర్చలు జరపడం అనే సత్యాని కంటే మించిన అటువంటి భారతదేశ ప్రజాస్వామ్య శక్తి తాలూకుప్రతీక మరేదీ లేదు’’

Posted On: 11 MAR 2022 6:23PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అహమదాబాద్ లో జరిగిన గుజరాత్ పంచాయత్ మహాసమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్రం అంతటి నుంచి పంచాయతీ రాజ్ ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.

 

బాపు మరియు సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ ల భూమి గుజరాత్ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘బాపు ఎల్లవేళ ల గ్రామీణ అభివృద్ధి ని గురించి, ఆత్మనిర్భర గ్రామాల ను గురించి మాట్లాడే వారు. ఈ రోజు న ఎప్పుడైతే మనం అమృత్ మహోత్సవాన్ని జరుపుకొంటున్నామో, మనం బాపు కన్నటువంటి గ్రామీణాభివృద్ధి కల ను నెరవేర్చవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

మహమ్మారి కాలం లో క్రమశిక్షణ మరియు మెరుగైన నిర్వహణ లకు గాను గుజరాత్ కు చెందిన పంచాయతీలు మరియు గ్రామాలు పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. గుజరాత్ లో పురుష పంచాయతీ ప్రతినిధుల కంటే మహిళా పంచాయతీ ప్రతినిధుల సంఖ్య ఎక్కువ గా ఉంది అని కూడా ఆయన అన్నారు. ఒకటిన్నర లక్షల కంటే ఎక్కువ మంది పంచాయతీ ప్రతినిధులు కలసి చర్చోపచర్చలు జరపడం అనేది భారతదేశ ప్రజాస్వామ్యం బలం తాలూకు ప్రతీక కు మించింది మరొకటి ఉండజాలదు అని ఆయన అన్నారు.

 

చిన్నవి అయినప్పటికి అతి మౌలికం అయిన కార్యక్రమాల ద్వారా గ్రామీణ అభివృద్ధి కి ఏ విధం గా పూచీ పడవచ్చు అనే విషయాల పై పంచాయతీ సభ్యుల కు ప్రధాన మంత్రి మార్గదర్శనం చేశారు. వారు వారి యొక్క పాఠశాల జన్మదినాన్ని గానీ లేదా స్థాపన దినాన్ని గానీ లేదా జరుపుకోవాలంటూ ఆయన సలహాను ఇచ్చారు. ఈ రకం గా చేసినందువల్ల పాఠశాల పరిసరాలను, తరగతి గదులను శుభ్రం చేయవచ్చు, బడి కోసం మంచి మంచి కార్యక్రమాల ను ఆరంభించవచ్చు అంటూ ఆయన సూచించారు. దేశం 2023వ సంవత్సరం ఆగస్టు వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకొంటోంది అని ఆయన చెప్తూ, ఈ కాలం లో పల్లె లో 75 ప్రభాతఫేరీ (ఉదయం పూట ఊరేగింపు) ని నిర్వహించవలసింది గా సూచన చేశారు.

 

అలాగే, ఈ కాలం లో 75 కార్యక్రమాల ను కూడా నిర్వహించాలని ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల లో గ్రామస్తులు అంతా కలసి కూర్చొని గ్రామాన్ని అన్ని విధాలు గా అభివృద్ధి పరచడాన్ని గురించి ఆలోచించాలి అని కోరారు. భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భం లో పల్లెల లో 75 మొక్కల ను నాటి, ఒక చిన్న వనాన్ని తయారు చేయాలి అంటూ మరో సూచన ను ఆయన చేశారు. ప్రతి ఊళ్లో కనీసం 75 మంది రైతు లు ప్రాకృతిక వ్యవసాయాన్ని చేపట్టాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ధరణి మాత కు ఎరువుల మరియు రసాయనాల తాలూకు విషం బారి నుంచి ముక్తి ని ఇవ్వాలి అని ఆయన అన్నారు. వాన నీటి ని సంరక్షించడం కోసం 75 వ్యవసాయ క్షేత్ర చెరువులను తవ్వాలని, ఇలా చేస్తే భూమి లోపలి నీటి మట్టం స్థాయి పెరగవచ్చని, దీని ద్వారా వేసవి రోజుల లో ప్రజల కు సహాయం అందవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.

 

పశువుల లో ఏ ఒక్కటి కూడా గాలికుంటు వ్యాధి బారి న పడకుండా ఉండటానికి గాను వాటి కి టీకామందు ను వేసేందుకు చొరవ తీసుకోవాలి అని కూడా ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు. విద్యుత్తు ను ఆదా చేయడం కోసం పంచాయతీ భవనం లో, వీధుల లో ఎల్ఇడి బల్బుల ను అమర్చాలి అని ఆయన కోరారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఊళ్ల కు వెళ్లాలని, గ్రామం యొక్క పుట్టిన రోజు ను జరుపుకోవాలని, ఆ కార్యక్రమం లో ఊళ్లోని వారందరు పోగై గ్రామనివాసుల సంక్షేమాన్ని గురించి చర్చించాలని ఆయన అన్నారు. పంచాయతీ సభ్యులలో ఒకరు రోజు లో 15 నిమిషాల పాటు కనీసం ఒకసారి స్థానిక పాఠశాల కు తప్పక వెళ్లాలి, తత్ఫలితం గా ఊరి బడి పైన గట్టి పర్యవేక్షణ సాధ్యపడవచ్చు, దీని వల్ల విద్య ప్రమాణాల ను, శుచి-శుభ్రత స్థాయి ని నిలబెట్టవచ్చు అని ప్రధాన మంత్రి సలహా ను ఇచ్చారు. ప్రభుత్వాని కి రాజమార్గాలు గా అనదగ్గ ఉమ్మడి సేవా కేంద్రాల (సిఎస్ సి స్) నుంచి గరిష్ఠ లబ్ధి ని పొందడం కోసం ప్రజల లో చైతన్యం అలవరచవలసింది గా పంచాయతీ సభ్యుల కు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. దీనితో రైల్ వే బుకింగ్ మొదలైన పనుల కోసం ప్రజలు పెద్ద నగరాల కు వెళ్ళవలసిన అగత్యాన్ని నివారించడానికి వీలు అవుతుందన్నారు. ఎవరూ బడి కి వెళ్లడాన్ని మధ్య లోనే మానివేయకుండా చూడాలి, అలాగే ఏ బాలుడు లేదా ఏ బాలిక వారి వారి అర్హత ప్రకారం అయితే బడి లో గాని, లేదా ఆంగన్ వాడీ లో గాని చేరకుండా ఉండిపోకూడదు అంటూ పంచాయతీ సభ్యుల కు ప్రధాన మంత్రి ఉద్భోదించారు. సభ కు హాజరైన పంచాయతీ సభ్యులు ఈమేరకు వాగ్దానం చేయాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేయడం తోనే శ్రోత లు పెద్దపెట్టు న చప్పట్లు చరుస్తూ వారి సమ్మతి ని తెలియజేశారు.

***

DK/DS

 


(Release ID: 1805885) Visitor Counter : 165