ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం

12 ఏళ్లు దాటిన బాలబాలికలకు ఈ నెల 16 నుంచి కొవిడ్‌-19 టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

60 దాటినవారికి తీవ్ర అనారోగ్య నిబంధన రద్దు; 60 ఏళ్లు పైబడిన వారంతా ఈ నెల 16 నుంచి 'ముందు జాగ్రత్త టీకా'కు అర్హులు

Posted On: 14 MAR 2022 1:55PM by PIB Hyderabad

కొవిడ్‌-19 టీకాల పరిధిని, తాజాగా, 12 ఏళ్లు దాటినవాళ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. 12-14 ఏళ్ల వయస్సున్న బాలబాలికలందరికీ (2008, 2009, 2010 సంవత్సరాల్లో జన్మించినవాళ్లు) ఈ నెల 16 నుంచి కొవిడ్‌-19 టీకా డోసులు ఇవ్వనున్నారు. శాస్త్రీయ సంస్థలతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ. లిమిటెడ్ సంస్థ తయారు చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ 'కార్బెవాక్స్‌' తొలి డోసుగా ఇస్తారు.

14 ఏళ్ల వయస్సు దాటిన జనాభా మొత్తానికి ఇప్పటికే కొవిడ్‌-19 టీకా డోసులు ఇస్తున్నారు.

60 దాటినవారికి తీవ్ర అనారోగ్యాలుంటేనే ముందు జాగ్రత్త డోసు ఇవ్వాలన్న నిబంధనను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 60 ఏళ్లు పైబడిన వారంతా, ఈ నెల 16 నుంచి, ఎలాంటి నిబంధనలు లేకుండా 'ముందు జాగ్రత్త టీకా'కు అర్హులు.

****(Release ID: 1805868) Visitor Counter : 106