ప్రధాన మంత్రి కార్యాలయం

యూక్రేన్ లో ఘర్షణ కొనసాగుతూ ఉన్న సందర్భంలో ప్రస్తుతం ప్రపంచ ముఖచిత్రాన్ని గురించి మరియు భారతదేశం యొక్క భద్రత సంబంధి సన్నాహాలను గురించి సమీక్షించడం కోసం ఏర్పాటైన సిసిఎస్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్ర‌ధానమంత్రి

Posted On: 13 MAR 2022 2:29PM by PIB Hyderabad

యూక్రేన్ లో ప్రస్తుతం ఘర్షణ సాగుతున్న సందర్భం లో ప్రపంచ ముఖచిత్రాన్ని గురించి మరియు భారతదేశం యొక్క భద్రత సంబంధి సన్నద్ధత ను గురించి సమీక్షించడం కోసం ఏర్పాటైన సిసిఎస్ సమావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.


సరిహద్దు ప్రాంతాల తో పాటుగా సముద్ర ప్రాంతాలలోను మరియు వాయు రంగం లోను భారతదేశం యొక్క భద్రత సంబంధి సన్నాహాల తాజా స్థితి, ఇంకా దీనితో ముడిపడ్డ వేరు వేరు అంశాల ను ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది.

యూక్రేన్ నుంచి భారతీయ పౌరులతో పాటు భారతదేశం యొక్క ఇరుగుపొరుగు దేశాల లో ఉంటున్న కొంతమంది పౌరుల ను వెనుక కు తీసుకు రావడం కోసం మొదలుపెట్టిన టువంటి ఆపరేశన్ గంగ సహా యూక్రేన్ లోని తాజా ఘటనల ను గురించిన సమాచారాన్ని ప్రధాన మంత్రి కి తెలియజేయడమైంది.


ఖార్ కివ్ లో చనిపోయిన శ్రీ నవీన్ శేఖరప్ప పార్థివ శరీరాన్ని తిరిగి తీసుకురావడం కోసం సాధ్యమైన అన్ని విధాలుగాను ప్రయాస లు చేయండి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశించారు.

 

***

 



(Release ID: 1805656) Visitor Counter : 154