ఆయుష్
యోగా మరియు సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ అగ్రగామి దేశం గా భారతదేశం - శ్రీ సర్బానంద సోనోవాల్
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 నిర్వహణకు 100 రోజుల సన్నాహాలు ప్రారంభించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
Posted On:
13 MAR 2022 4:34PM by PIB Hyderabad
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కేంద్ర ఆయుష్, రేవులు, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సదానంద్ సోనోవాల్ ఈ రోజు న్యూఢిల్లీలో యోగా మహోత్సవ్ 2022ను ప్రారంభించారు. కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమంగ, కేంద్ర కార్మిక ఉపాధి మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ మరియు విదేశీ వ్యవహారాలు మరియు సంస్కృతి శాఖ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి మరియు స్వామి చిదానంద సరస్వతి జీ, పరమార్థ నికేతన్, రిషికేశ్ కూడా పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 ప్రచార కార్యక్రమాలు 100 రోజుల పాటు సాగుతాయి. 100 నగరాలలో 100 సంస్థలు ఈ ప్రచార కార్యక్రమాలను 2022 జూన్ 21వ తేదీ వరకు నిర్వహిస్తాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణలో ఆయుష్ మంత్రిత్వ శాఖ 2022 జూన్ 21న వారసత్వ కేంద్రాలుగా గుర్తించిన 75 హెరిటేజ్ /ఐకానిక్ సాంస్కృతిక ప్రదేశాలలో యోగాను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ యోగా భాగంగా యోగాకి సంబంధించిన కార్యక్రమాలు, ప్రదర్శనలు, వర్క్ షాపులు, సదస్సులు నిర్వహిస్తారు. వీటిని దేశం వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. హూ ఎం యోగా యాప్ , నమస్తే యాప్, Y-బ్రేక్ యాప్‌ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తుంది. ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేలా చూసే విధంగా ఫోటో పోటీ, క్విజ్, చర్చ, ప్రతిజ్ఞ, పోల్ సర్వే, జింగిల్ లాంటి కార్యక్రమాలు MyGov ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభించబడతాయి.
ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన శ్రీ సర్బానంద సోనోవాల్ వరుసగా ఎనిమిదో సారి భారతదేశం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 ను నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, సంక్షేమం మరియు శాంతిని పెంపొందించే సామూహిక ఉద్యమాన్ని ప్రారంభించేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవం అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. వ్యాధులు , ఒత్తిడి మరియు నిరాశ నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు చేపట్టనున్న కార్యక్రమాలు 100 రోజుల పాటు సాగుతాయి. ఈ రోజు ప్రారంభమైన యోగా మహోత్సవ్ 2022 దీనికి నాంది పలికిందని మంత్రి వివరించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ తన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ భారతదేశంలో నెలకొల్పడానికి అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఈ కేంద్రంలో యోగా మరియు సాంప్రదాయ ఆరోగ్య పద్ధతులపై పరిశోధనలు సాగుతాయని మంత్రి అన్నారు. వీటిద్వారా ప్రపంచ ప్రజలందరికీ శాంతి, మెరుగైన ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు అవకాశం కలుగుతుందని శ్రీ సదానంద్ సోనోవాల్ అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో యోగా ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది శ్రీ సదానంద్ సోనోవాల్ అన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు పాల్గొంటున్న కార్యక్రమంగా యోగా గుర్తింపు పొందిందని అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఉమ్మడి యోగా ప్రోటోకాల్‌ను 250 మిలియన్లకు పైగా ప్రజలు అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రపంచ శాంతి కోసం యోగాను భారతీయ బ్రాండ్‌గా అందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” ప్రచార నినాదాన్ని ప్రోత్సహించడానికి కూడా చర్యలు అమలు చేస్తున్నామని అన్నారు.
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ భారతదేశంలో యోగా కమిషన్‌ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. హర్యానాలోని దాదాపు 2000 ప్రజారోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యుడిని తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమంగ్ మాట్లాడుతూ సిక్కింలోని కృతుంగ సరస్సు సమీపంలో జాతీయ యోగా మరియు ధ్యాన సంస్థను నెలకొల్పాలని కోరారు. ఇది యోగాకి సంబంధించిన జ్ఞానాన్ని అందించే ప్రపంచ సంస్థగా పని చేస్తుందని అన్నారు. సిక్కిం పాఠశాల పాఠ్యాంశాల్లో యోగా భాగంగా ఉందని తెలిపిన శ్రీ ప్రేమ్ సింగ్ తమంగ్ సుమారు 500 మంది ఉపాధ్యాయులు ఈ సేవలను అందిస్తున్నారని వివరించారు.
కేంద్ర కార్మిక ఉపాధి మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పర్యావరణ అనుకూల జీవనశైలిని పాటించేందుకు యోగా మరియు ఆయుష్ దోహద పడతాయని అన్నారు. ఆయుష్ వ్యవస్థల పురోగతిపై శాశ్వత ప్రభావాన్ని చూపే విధంగా జీవవైవిధ్య చట్టానికి సవరణలు చేస్తామని చెప్పారు. ఈసన్నాహక కార్యక్రమాలను ఎంపిక చేసిన 49 సరస్సులు మరియు 52 టైగర్ రిజర్వ్‌ల వంటి ప్రదేశాలలో యోగా కార్యక్రమాలను కూడా నిర్వహించాలని ఆయన సూచించారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా ప్రస్తుత పరిస్థితుల్లో యోగాకి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. , సంపూర్ణ ఆరోగ్యంలో యోగా సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం నిర్వహించిందని ఆయన తెలిపారు. జిమ్‌కు వెళ్లే వారితో యోగా చేస్తున్న వారిపై ఎయిమ్స్ అధ్యయనం చేసిందని అన్నారు. రెండు వర్గాలలో శారీరక మెరుగుదల దాదాపుగా ఒకే విధంగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. జిమ్‌కు వెళ్తున్న వారిలో 'రజో-గుణం ' మరియు 'తమో-గుణం ' మెరుగు పడ్డాయని , యోగా సాధన చేస్తున్న వారిలో 'సతో -గుణం 'మెరుగు పడిందని అధ్యయనం వెల్లడించింది.
***
(Release ID: 1805610)
Visitor Counter : 233