సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దూరదర్శన్ న్యూస్ లో శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రత్యక్షప్రసారం
క్షేత్రస్థాయినుంచి ఎప్పటికప్పుడు సాధికారిక తాజాసమాచారం
Posted On:
09 MAR 2022 12:21PM by PIB Hyderabad
5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ప్రజలు తెలుసుకునేందుకు ఆతృతతో ఉన్న దృష్ట్యా ప్రసార భారతికి చెందిన ప్రజా ప్రసార వ్యవస్థ అయిన డిడిన్యూస్, ఆలిండియా రేడియో న్యూస్‌లు 2022 మార్చి 10 వ తేదీన నిమిష నిమిషానికి ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశాయి.
విస్తృత క్షేత్రస్థాయి రిపోర్టర్లు, స్ట్రింగర్ల నెట్ వర్క్ ద్వారా కచ్చితమైన, వాస్తవాలను సరిచూసుకుని ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు గణాంకాలను అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. డిడి న్యూస్ అత్యంత కచ్చితమైన రియల్‌టైమ్ వార్తలను ఈ పై 5 రాష్ట్రాలనుంచి అందించనుంది. రాజకీయ నిపుణులు, సెఫాలజిస్టులు డిడి న్యూస్ షో జనాదేశ్ ప్రత్యక్ష ప్రసారంలో ఓట్ల లెక్కింపు గణాంకాలను ఉదయం 7 గంటల తర్వాతనుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించనున్నారు.
లైవ్ డాటా హబ్ క్షేత్రస్థాయి బృందాలు పంపిన సమాచారంతో డిడి న్యూస్ ప్రతి సెకను తాజా సమాచారం అందించనుంది. డిడి న్యూస్ ఛానల్ బృందాలు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న 5 రాష్ట్రాల నుంచి ఈ డాటా హబ్‌కు అను క్షణం సమాచారం పంపనున్నారు.ఆ వెంటనే ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించనున్నారు. లైవ్ లో వచ్చే సమాచారం, ఆధిక్యాలు, ఫలితాలను ప్రతినిమిషం, ప్రతి సెకను అప్ డేట్ చేస్తారు. దీనికి తోడు 3 డి గ్రాఫిక్ మద్దతుతో వీక్షకులు కౌంటింగ్, ఫలితాల సరళిని సులభంగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
దూరదర్శన్ న్యూస్ ఛానల్ రిపోర్టింగ్ లో క్షేత్రస్థాయి సమాచారం లైవ్ కవరేజ్ తోపాటు, స్టుడియోలో రాజకీయ విశ్లేషకులు, రాజకీయనాయకులతో చర్చలు ఉంటాయి.
దూరదర్శన్ కు చెందిన ప్రాంతీయ వార్తా విభాగాలు ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు సంబంధించి ఉదయం 7 గంటలనుండి ప్రత్యేక కార్యక్రమాలను, లైవ్ షోలను ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కౌంటింగ్ సరళి, ఫలితాలను తెలియజేయడంతో పాటు ప్రముఖ రాజకీయ నిపుణులు, రాజకీయ నాయకుల విశ్లేషణలను ప్రసారం చేస్తుంది.
ఆలిండియా రేడియో న్యూస్ నెట్ వర్క్ ఎప్పటికప్పుడు సాధికారిక తాజా సమాచారాన్ని మార్చి 10 వతేదిన 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు సందర్భంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలోనే అతిపెద్ద రేడియో నెట్ వర్క్ కలిగిన ఆలిండియా రేడియో మార్చి 10 వ తేదీన ఉదయ 9 గంటలనుంచి ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక బులిటన్లను ప్రసారం చేయనుంది. ఈ కార్యక్రమాలు ఎఐఆర్ ఎఫ్ ఎం గోల్డ్ 100.1 ఎం.హెచ్.జెడ్ పైన, ఎఫ్.ఎం రెయిన్ బో నెట్‌వర్క్ పైన, వివిధభారతి, ఆలిండియా రేడియో కు చెందిన ఇతర స్థానిక ఛానళ్లపైన వినవచ్చు. ఈ ప్రసారాలు ఎఐఆర్ యూ ట్యూబ్ ఛానల్ https://www.youtube.com/NEWSONAIROFFICIAL ద్వారా ప్రజలకు అందుతాయి.
మొత్తం ఐదు రాష్ట్రాలకు చెందిన ఆలిండియా రేడియో కరస్పాండెంట్లు కౌంటింగ్ కు సంబంధించి తాజా ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తారు. స్టూడియోలలోని నిపుణులు ఫలితాలపై సమగ్ర మైన ,లోతైన విశ్లేషణను అందిస్తారు.
ప్రత్యేక ఎన్నికల బులెటిన్‌లతో పాటు, రాత్రి 7:20 నుండి 8 గంటల వరకు ప్రత్యక్ష చర్చ ప్రసారమవుతుంది. 5 రాష్ట్రాల నిపుణులతో ప్రత్యేక రేడియో బ్రిడ్జ్ కార్యక్రమం రాత్రి 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారం చేస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఆలిండియా రేడియోకి చెందిన అన్ని 46 ప్రాంతీయ వార్తా విభాగాలు తమ తమ రాష్ట్రాల ప్రాంతీయ భాషలలో ప్రత్యేక కార్యక్రమాలు , వార్తల బులెటిన్‌లను ప్రసారం చేస్తాయి. ఎఫ్ ఎం గోల్డ్, ఎఫ్.ఎం రెయిన్‌బో, వివిధ్ భారతి , ఆలిండియా రేడియో ఇతర స్థానిక ఛానెల్‌ల వంటి వాటి ద్వారా దేశవ్యాప్తంగా గంటకు ఒకసారి వార్తా బులెటిన్‌లు అందుబాటులో ఉంటాయి.
***
(Release ID: 1804770)
Visitor Counter : 156