ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్) కు మరియు జర్మనీ కిచెందిన డాయ్ శే ఫోర్స్ చుంగ్స్ జెమయింషాఫ్ట్ ఇ.వి. (డిఎఫ్ జి) కి మధ్య సంతకాలైన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కిఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
09 MAR 2022 1:36PM by PIB Hyderabad
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్) కు, జర్మనీ కి చెందిన డాయ్ శే ఫోర్స్ చుంగ్స్ జెమయింశాఫ్ట్ ఇ.వి. (డిఎఫ్ జి) కి మధ్య 2021వ సంవత్సరం డిసెంబర్ లో సంతకాలైనటువంటి మరియు భారత ప్రభుత్వ (వ్యాపార లావాదేవీ) నియమాలు, 1961 తాలూకు రెండో షెడ్యూలు లోని నియమం 7 (డి) (i) కి అనుగుణం గా ఉన్నటువంటి అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) గురించిన వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గాని కి తెలియ జేయడమైంది.
ఎమ్ఒయు యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు:
టాక్సికాలజీ, ఉపేక్ష కు లోనైన (ఉష్ణదేశ సంబంధి) వ్యాధి, అసాధారణమైనటువంటి వ్యాధులు మరియు పరస్పర హితం ముడిపడ్డ మరే ఇతర రంగాలు సహా చికిత్స సంబంధి విజ్ఞానం / ఆరోగ్య పరిశోధన రంగాల లో సహకరించుకోవాలి అనేవి ఈ ఎమ్ఒయు ముఖ్య ఉద్దేశ్యాలు గా ఉన్నాయి. విజ్ఞాన శాస్త్ర సంబంధి పరిశోధనల లో, సాంకేతిక విజ్ఞాన పరమైన అభివృద్ధి లో సహకారం అనే దానిలో సంయుక్త ఆర్థిక నిధులతో పాటు పరిశోధకుల సేవ ల ఆదాన ప్రదానం, సంయుక్త సదస్సుల, గోష్ఠుల, కార్యశాలల నిర్వహణ కు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కూడా కలసి ఉన్నాయి. అవి ఉన్నత విజ్ఞాన శాస్త్ర ప్రమాణాల ను ఏర్పరచగలవు. అంతేకాక వైజ్ఞానిక దృష్టికోణం లో నుంచి చూస్తే మహత్వపూర్ణ విజ్ఞాన సంబంధి ప్రగతి కి లాభసాటి గానూ పరిణమించగలవు.
ఆర్థిక పరమైన ప్రభావం:
విజ్ఞాన శాస్త్ర పరిశోధన లలోను, సాంకేతిక విజ్ఞానం సంబంధి అభివృద్ధి లోను సహకరించుకోవడం లో శాస్త్రీయ పరిశోధన పథకాల కు సంయుక్తం గా నిధుల ను అందించడంతో పాటు పరిశోధకుల సేవల ను ఇరు పక్షాలు వినియోగించుకోవడం, సంయుక్త సదస్సు లకు, గోష్ఠులకు, వర్కుషాపుల కు ఆర్థిక సహాయం వంటివి భాగం గా ఉంటాయి. ఈ తరహా కార్యక్రమాలు ఉన్నత వైజ్ఞానిక ప్రమాణాలను ఏర్పరచడమే గాక వైజ్ఞానిక దృష్టికోణం లో నుంచి చూస్తే మహత్వపూర్ణ విజ్ఞాన సంబంధి ప్రగతి కి లాభసాటి గానూ పరిణమించగలవు.
***
(Release ID: 1804478)
Visitor Counter : 163