హోం మంత్రిత్వ శాఖ

2021-22 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన (ఎస్ఎస్ఎస్‌వై) కొనసాగింపున‌కు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం


- కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఎస్ఎస్ఎస్‌వై కొనసాగింపు ప్రతిపాదన అందింది, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడానికి మరియు వారి నుండి స్ఫూర్తిని పొందేందుకు ప్రభుత్వం నిబద్ధతను చూపింది

- మొత్తం ఆర్థిక వ్యయం రూ. 3,274.87 కోట్లు

Posted On: 07 MAR 2022 3:09PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన (ఎస్ఎస్ఎస్‌వై) మరియు దాని విభాగాలకు 31.03.2021 తర్వాత కూడా..  2021-22 నుండి 2025-26 వరకు ఆర్థిక సంవత్సరాలకు కొనసాగించడానికి ఆమోదించింది, దీని మొత్తం ఆర్థిక వ్యయం రూ. 3,274.87 కోట్లు. ఎస్ఎస్ఎస్‌వై కొనసాగింపు ప్రతిపాదన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి స్వీకరించబడింది. ప్ర‌స్తుత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం మరియు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలనే ప్రభుత్వ త‌న నిబద్ధతను తెలియజేస్తోంది.
నేపథ్య
స్వాతంత్ర్య సమరయోధులు మరియు వారిపై ఆధారపడిన అర్హులైన వారికి స్వతంత్రత సైనిక్ సమ్మాన్ పెన్షన్ మంజూరు చేయబడింది. ప్రస్తుతం ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 23,566 మంది లబ్ధిదారులు ఉన్నారు. పింఛను మొత్తం కాలానుగుణంగా సవరించబడింది మరియు 15.08.2016 నుండి డియర్నెస్ రిలీఫ్ కూడా ఇవ్వబడింది.
                                                                               

******



(Release ID: 1803746) Visitor Counter : 324