ప్రధాన మంత్రి కార్యాలయం
పూణె సందర్శించి, మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధానమంత్రి
పూణె మునిసిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఆవిష్కరణ
పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ఆర్.కె.లక్ష్మణ్ ఆర్ట్ గ్యాలరీ- మ్యూజియం ప్రారంభం
"ఈ విగ్రహం శివాజీ మహరాజ్ ది. ఆయన మనందరి హృదయాలలో ఎల్లప్పుడూ ఉంటారు.యువతలో దేశభక్తి ప్రేరణను ఇది చైతన్యపరుస్తుంది."
"పూణె విద్య, పరిశోధన అభివృద్ధి, ఐటి, ఆటోమొబైల్ రంగంలో తన గుర్తింపును నిరంతరం బలోపేతం చేసుకుంటూ వస్తున్నది. ఇలాంటి పరిస్థితిలో, ప్రజలకు ఆధునిక సదుపాయాలు అవసరం. ప్రభుత్వం పూణె ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం పనిచేస్తున్నది."
"ఈ మెట్రో పూణెలో ప్రజల రవాణా ఇబ్బందులు తొలగిస్తుంది. ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం లేకుండా చూస్తుంది. పూణు ప్రజల సులభతర జీవనానికి వీలు కల్పిస్తుంది."
"ఇవాళ సత్వరం పురోగమిస్తున్న ఇండియాలో మనం వేగంపైన, పరిమాణంపైన దృష్టి పెట్టవలసి ఉంది. అందుకే మన ప్రభుత్వం పిఎం- గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను సిద్దం చేసింది."
"ఆధునికతతోపాటు, పూణె పురా
Posted On:
06 MAR 2022 2:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీఈ రోజు పూణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారు. మరికొన్ని అభివృద్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారి, ఉప ముఖ్యమంత్రి శ్రీ అజిత్ పవార్, కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే, పార్లమెంటు సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ తదితరులు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, స్వాతంత్రోద్యమంలో పూణె పాత్రను స్మరించుకున్నారు. లోకమాన్య తిలక్, చాపేకర్ సోదరులు, గోపాల్ గణేష్అగర్కర్,సేనాపతి బాపట్, గోపాల్ కృష్ణ దేశ్ ముఖ్, ఆర్.జి భండార్కర్, మహదేవ్ గోవింద్ రణడే లను ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రామ్‌బావు మహల్గే, బాబా సాహెబ్ పురందరేలను స్మరించుకున్నారు.
ప్రధానమంత్రి, అంతకుముందు పూణె మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ శివాజీ మహరాజ్ విగ్రహం మనందరి హృదయాలలో ఉంటుంది. ఇది దేశభక్తి స్ఫూర్తిని యువతలో మేల్కొల్పడానికి ప్రేరణగా నిలుస్తుంది. అని ఆయన అన్నారు.
పూణె మెట్రో ప్రాజెక్టును అంతకు ముందు తాను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, పూణె మెట్రొ శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను అప్పట్లో ఆహ్వానించారు. ఇప్పుడు ప్రారంభోత్సవానికి నాకుఅ వకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు , ప్రాజెక్టు ప్రణాళికలను సకాలంలో పూర్తి చేయవచ్చన్న సందేశం కూడా ఇందులో ఉంది. అని ఆయన అన్నారు. విద్య, పరిశోధన అభివృద్ధి,ఐటి, ఆటోమొబైల్స్ వంటి రంగాలలో పూణె తన గుర్తింపును పటిష్టం చేసుకుంది. పూణె ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం కృషి చేస్తున్నది అని ప్రధానమంత్రి అన్నారు.
2014 వరకుమెట్రో సర్వీసులు దేశంలొని కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇవాళ రెండు డజన్లకు పైగా నగరాలు మెట్రో సేవల వల్ల ప్రయోజనం పొందుతున్నాయని, మరి కొన్ని ప్రయోజనం పొందబోతున్నాయని ఆయన అన్నారు. మెట్రో విస్తరణలో మహారాష్ట్రకు చెప్పుకోదగిన వాటా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ముంబాయి, థానే, నాగపూర్, పింప్రి చించ్‌వాడ పూణెలను చూస్తే ఇది తెలుస్తుందన్నారు. దీనివల్ల పూణెలో ప్రజల రాకపోకల రద్దీ తగ్గుతుందని కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌ల ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఇది పూణె ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతుందని ప్రధానమంత్రి అన్నారు. పూణె ప్రజలు, ముఖ్యంగా సంపన్న వర్గాలు మెట్రోను, ఇతర ప్రజా రవాణాను వాడడం అలవాటు చేసుకోవాలని అన్నారు.
నానాటికీ పెరుగుతున్న నగరవాసుల జనాభా ఒక అవకాశం,ఒక సవాలు వంటిదని ప్రధానమంత్రి అన్నారు. నగరాలలో నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలను తట్టుకునేదుకు భారీ ప్రజా రవాణా వ్యవస్థ సరైన సమాధానమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోపెరుగుతున్న న గరాలకోసం మరింత హరిత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వంటి వాటి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి నగరంలో స్మార్ట్ మొబిలిటికి వీలుగా అన్ని రకాల రవాణా సదుపాయాలకు ప్రజలు ఒకే ఒక కార్డును వినియోగించేలా ఉండాలని, సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రతి నగరంలో ఉండి ఈ సదుపాయాలను మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి నగరానికి ఒక ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఉండాలని ఇది సర్కులర్ ఎకానమీని బలోపేతం చేసేదిగా ఉండాలని అన్నారు. ప్రతి నగరం వాటర్ ప్లస్ స్థాయికి ఎదిగేందుకు ఆధునిక మురుగునీటి వ్యర్థాల శుద్ధి ప్లాంటులు తగినన్ని ఉండాలని అన్నారు. జలవనరుల సంరక్షణకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి నగరాలు వ్యర్థాలనుంచి సంపదను సృష్టించేందుకు బయోగ్యాస్ ప్లాంటులను కలిగి ఉండాలన్నారు. అలాగే ఇంధన సమర్ధతా చర్యలైన ఎల్ఇడి బల్బుల వాడకం ఈ నగరాలకు ఒక గుర్తుగా ఉండాలన్నారు. అమృత్ మిషన్, రెరా చట్టాలు నగరవాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
నగరాల జీవనంలో నదుల ప్రాధాన్యతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నదులు కలిగిన రాష్ట్రాలు, ప్రజలకు నదులపై అవగాహన కల్పించేందుకు నదీ ఉత్సవాలు నిర్వహించాలని,ప్రజల జీవనాడిగా ఉండే నదుల పరిరక్షణకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.
దేశంలో మౌలి కసదుపాయాల ఆధారిత అభివృద్ధి గురించి న విధానాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఏ దేశంలో అయినా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైనది, వేగవంతమైన , భారీ పరిమాణంలో వాటి అమలు. అయితే దశాబ్దాలుగా , ఇలాంటి ప్రాజెక్టులు పూర్తికావడానికి మన దగ్గర చాలా కాలం పట్టేది. ఈ మందకొడి వైఖరి దేశ అభివృద్ధిపై ప్రభావం చూపుతూ వచ్చింది. ఇవాల్టి సత్వరం అభివృద్ధి చెందుతున్న ఇండియాలో మనం వేగం, దాని పరిమాణంపై దృష్టిపెట్ట వలసి ఉంది. అందువల్ల మన ప్రభుత్వం పిఎం- గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. గతిశక్తి ప్రణాళిక భాగస్వాములందరూ పూర్తి సమాచారం, తగిన సమన్వయంతో సమీకృత దృష్టితో పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. ఆధునికతతోపాటు, పూణె ప్రాచీన వారసత్వం, మహారాష్ట్రప్రతిష్ఠ వంటివాటిని అర్బన్ ప్లానింగ్‌లో ప్రముఖంగా దృష్టిలో ఉంచుకోవడం జరిగిందని ప్రధానమంత్రి అన్నారు.
పూణెలో నగర ప్రజా రవాణాకు సంబంధించి ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల కల్పనకు జరిగిన ప్రయత్నమే పూణె మెట్రో రైలు ప్రాజెక్టు అని ప్రధానమంత్రి అన్నారు. 2016 డిసెంబర్ 24 న ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ పూణె మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. మొతత్ం 32.2 కిలోమీటర్ల పూణె మెట్రో రైలు ప్రాజెక్టులో 12 కిలోమీటర్ల మార్గాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ మొత్తం ప్రాజెక్టును 11,400 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపడుతున్నారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా గర్వరే మెట్రో స్టేషనలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించి తనిఖీ చేశారు. అలాగే గర్వరే మెట్రో స్టేషన్ నుంచి ఆనందనగర్ మెట్రో స్టేషన్ కు ప్రధానమంత్రి మెట్రో రైలులో ప్రయాణించారు.
ములా- ముథా నది ప్రాజెక్టులకు సంబంధించి పునరుజ్జీవనం, కాలుష్య నియంత్రణకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.1080 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 9 కిలోమీటర్ల దూరం నదీ పునరుజ్జీవన చేపట్టనున్నారు. నదీ తీర పరిరక్షన, మురుగును అడ్డుకునే నెట్ వర్క్, ప్రజా సదుపాయాలు, బోటింగ్ కార్యకలాపాలు, వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయని ఆయన అన్నారు. ముల్లా ముథా నదీ కాలుష్య నియంత్రణ ప్రాజెక్టు ను ఒక నగరం, ఒక ఆపరేటర్ కాన్సెప్ట్‌పై అమలు చేయనున్నారు. 1470 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో దీనిని చేపడతారు. మొత్తం 11 మురుగునీటి వ్యర్థాల ప్లాంటులను ఈ ప్రాజెక్టు వ్యయంలో భాగంగా నిర్మిస్తారు. వీటి మొత్తం ఉమ్మడి సామర్ధ్యం 400 ఎంఎల్‌డిలుగా ఉంటుంది. ప్రధానమంత్రి ఈ సందర్భంగా 140 ఈ బస్ లను బనేర్ లో నిర్మించిన ఈ బస్ డిపోను ప్రధానంత్రి ప్రారంభించారు.
ప్రధానమంత్రి ,పూణెలోని బలేవాడిలో నిర్మించిన ఆర్.కెలక్ష్మన్ ఆర్ట్‌గ్యాలరీ, మ్యూజియంలను కూడా ప్రారంభించారు. ఈ మ్యూజియం ప్రధాన ఆకర్షన, మాల్గుడి నమూనా గ్రామం తీరులో ఉంటుంది. ఆడియో విజువల్ ఎఫెక్ట్‌తో ఇది వచ్చేట్టు చేశారు ఆర్.కె .లక్ష్మన్ గీసిన కార్టూన్‌లు ఈ మ్యూజియంలో ప్రదర్శించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ముందు ప్రధానమంత్రి, శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని పూణే మునిసిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని 1850 కేజీల గన్ మెటల్ తో దీనిని రూపొందించారు. ఈ విగ్రహం ఎత్తు 9.5 అడుగులు.
(Release ID: 1803492)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam