హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సిఎపిఎఫ్ ఎస్) ఆధునీకరణ ప్లాన్ 4ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో 01-02-2022 నుంచి 31-03-2026 మధ్య కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూ 1523 కోట్ల రూపాయల కేటాయింపుతో ఆధునీకరణ ప్రణాళికను అమలు చేయనుంది.
సిఎపిఎఫ్‌ల మొత్తం సామర్ధ్యం, సన్నద్ధత పెంపునకు ఈపథకం వీలుకలిగిస్తుంది.
Posted On:
04 MAR 2022 11:29AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాయుధ బలగాల (సిఎపిఎఫ్ ఎస్) ఆధునీకరణ పథకం 3 కు కొనసాగింపుగా ఆధునీకరణ ప్లాన్ 4ను ప్రభుత్వం ఆమోదించింది.
ఆధునీకరణ పథకం 4 కింద సిఎపిఎఫ్ మొత్తం రూ 1523 కోట్ల రూపాయల కేటాయింపులతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశంలో 01-02-2022 నుంచి 31-03-2026 వరకు అమలు చేస్తారు. ఈ పథకం కింద సిఎపిఎఫ్‌కు ఆధునిక ఆయుధాలు, వాటి అవసరాలకు అనుగుణంగా పరికరాలను సమకూరుస్తారు. వివిధ ప్రాంతాలలో వాటిని నియమించడానికి సంబంధించి వాటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. దీనికి తోడు ఐటి సొల్యూషన్స్‌ను అప్ గ్రేడ్ చేసి దానిని సిఎపిఎఫ్‌కు సమకూరుస్తారు.
ఈ పథకం అమలు సిఎపిఎఫ్ మొతత్ం నిర్వహణా సామర్ధ్యాన్ని, సన్నద్ధతను మెరుగుపరుస్తుంది. ఇది దేశంలో అంతర్గత భద్రత పరిస్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది. అలాగే అంతర్జాతీయ సరిహద్దులవద్ద, అధీన రేఖ వద్ద, వాస్తవాధీన రేఖ వద్ద అలాగే వివిధ ప్రాంతాలలో అంటే వామపక్ష తీవ్ర వాదం, జమ్ము కాశ్మీర్, లద్దాక్, చొరబాట్ల ప్రభావం కల ఈశాన్య రాష్ట్రాల వంటి సవాళ్లు ఎదుర్కొనే ప్రాంతాలలో ప్రభుత్వ సామర్ధ్యాన్ని పెంచడానికి దీనితో వీలు కలుగుతుంది.
***
(Release ID: 1803259)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam