పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 10,800 మంది భారతీయుల పునరాగమనం


రాబోయే 24 గంటల్లో మరికొందరిని తీసుకురావడానికి సన్నద్ధమైన 11 పౌర ,4 భారత వైమానిక దళ విమానాలు

Posted On: 04 MAR 2022 5:37PM by PIB Hyderabad

భారతీయ పౌరులను రక్షించే క్రమంలో 'ఆపరేషన్ గంగా' కింద, ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి 14 పౌర విమానాలు 3 C-17 భారత వైమానిక దళ విమానాలతో సహా 17 ప్రత్యేక విమానాలు ఈ రోజు దేశానికి తిరిగి వచ్చాయి. మరో పౌర విమానం ఈ రోజు తర్వాత వచ్చే అవకాశం ఉంది. పౌర విమానాలు 3142 మందిని తీసుకురాగా, C-17 విమానాలు 630 మంది ప్రయాణికులను తరలించాయి. ఇప్పటివరకు, 43 ప్రత్యేక పౌర విమానాల ద్వారా 9364 మంది భారతీయులను తరలించారు. C-17కి చెందిన 7 విమానాలు ఇప్పటివరకు 1428 మంది ప్రయాణికులను తరలించి, 9.7 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ని తీసుకెళ్లాయి. నేటి పౌర విమానాలలో బుకారెస్ట్ నుండి 4, కోసిస్ నుండి 2, బుడాపెస్ట్ నుండి 4, ర్జెస్జో నుండి 3  సుసెవా నుండి 2 ఉన్నాయి, అయితే భారత వైమానిక దళవిభాగం బుకారెస్ట్ నుండి 2  బుడాపెస్ట్ నుండి 1 విమానాలను నడిపింది.

రేపు, 11 ప్రత్యేక పౌర విమానాలు 2200 కంటే ఎక్కువ సంఖ్యలో భారతీయులను తిరిగి తీసుకు వస్తాయని భావిస్తున్నారు, 10 విమానాలు న్యూఢిల్లీలో  ఒకటి ముంబైలో దిగుతాయి. 5 విమానాలు బుడాపెస్ట్ నుండి, 2 ర్జెస్జో నుంచి  4 సుసెవా నుంచి బయలుదేరుతాయి. నాలుగు C-17 విమానాలు రోమానియా, పోలాండ్  స్లోవేకియాల నుంచి వాయుమార్గాన ఉన్నాయి, ఇవి రాత్రి ఆలస్యంగా  రేపు తెల్లవారుజామున మన దేశానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.

***

 



(Release ID: 1803145) Visitor Counter : 163